Credit Card: మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా..? ఈ విషయాలను గుర్తించుకోండి.. లేకపోతే కష్టాల్లో ఇరుక్కున్నట్లే..!
Credit Card: ప్రస్తుతం క్రెడిట్ కార్డులు వాడే వారి సంఖ్య పెరిగిపోతోంది. గతంలో క్రెడిట్ కార్డు కావాలంటే పెద్ద ప్రాసెస్ ఉండేది. కాని ఇప్పుడు అలాంటి ప్రాసెస్ లేదు. కేవలం..
Credit Card: ప్రస్తుతం క్రెడిట్ కార్డులు వాడే వారి సంఖ్య పెరిగిపోతోంది. గతంలో క్రెడిట్ కార్డు కావాలంటే పెద్ద ప్రాసెస్ ఉండేది. కాని ఇప్పుడు అలాంటి ప్రాసెస్ లేదు. కేవలం ఫోన్‌లో కేవైసీ పత్రాలు పొంది క్రెడిట్ కార్డులను జారీ చేస్తున్నాయి బ్యాంకులు. అయితే కార్డు వాడకంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కార్డులో డబ్బులు ఉన్నాయి కదా అని ఇష్టానుసారంగా వాడుతుంటే అప్పుల్లో కూరుకుపోయే ప్రమాదం ఉంది. కార్డు ఉంటే షాపింగ్, ఆన్‌లైన్ షాపింగ్ తదితర లావాదేవీలు భారీగా జరుపుతుంటారు. అలాగే వాడుకున్న అమోంట్‌ను గడువులోగా చెల్లించుకోవాలి. లేకపోతే ఎడిషనల్ చార్జీలతో పాటు పెనాల్టీ చార్జీలు కూడా వసూలు చేస్తుంటాయి బ్యాంకులు. ఈ కార్డు మీ ఆర్థిక అవసరాలను సమయానికి అనుగుణంగా నెరవేర్చడమే కాకుండా.. అకస్మాత్తుగా ఏదైనా లావాదేవీ చేయాల్సి వచ్చినప్పుడు అండగా నిలుస్తుంది.
క్రెడిట్ కార్డును ఎలా వాడాలో తెలుసుకోవాలి.. ముందుగా క్రెడిట్ కార్డు తీసుకున్న తర్వాత కార్డును ఎలా వాడాలో అనే విషయాన్ని తెలుసుకోవడం మంచిది. కార్డు వాడిన తర్వాత డబ్బులు చెల్లించని సమయంలో ఎలాంటి చార్జీలు వేస్తారు.. పెనాల్టీలు తదితర విషయాలను ముందుగానే తెలుసుకోవడం మంచిది. అలాగే క్రెడిట్ కార్డును చాలా మంది విమాన, రైల్వే టికెట్లు బుకింగ్ చేసే సమయంలో డిస్కౌంట్లు, ఆన్‌లైన్ షాపింగ్ ఆఫర్లు పొందేందుకు వాడుతుంటారు. కానీ ఆఫర్లు పొందిన తర్వాత గడువులోగా డబ్బులు కట్టకుంటే కష్టాల నుంచి బయట పడటం కష్టమే.
బిల్లు చెల్లించి వడ్డీల నుంచి తప్పించుకోవాలి.. క్రెడిట్ కార్డు వాడిన తర్వాత గడువులోగా డబ్బులు చెల్లించడం ఉత్తమం. గడువు సమయంలోగా డబ్బులు చెల్లిస్తే వడ్డీ నుంచి తప్పించుకోవచ్చు. లేకపోతే భారీ ఎత్తున వడ్డీ చెల్లించుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు వడ్డీతో పాటు ఇతర చార్జీలు కూడా వడ్డిస్తుంటాయి బ్యాంకులు.
లిమిట్ దాటొద్దు.. క్రెడిట్ కార్డు ఉంది కదా అని మన ఆర్థిక స్థోమతకు మించి వాడుతుంటే ఎన్నో కష్టాలను ఎదుర్కొవాల్సి ఉంటుంది. కార్డులో డబ్బులు ఉన్నాయి కదా అని ఎడాపెడ షాపింగ్ చేస్తే డబ్బులు చెల్లించే ముందు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక్కసారి బిల్లు చెల్లించకపోతే కష్టాలు మొదలైనట్లే. ఎందుకంటే ఒక్కనెల డబ్బులు చెల్లించకుంటే పెనాల్టీ చార్జీలు, వడ్డీ, ఇతర జీఎస్టీ రకరకాల చార్జీల పేరుతో తడిసి మోపెడవుతుంది. అందుకే క్రెడిట్ కార్డులు వాడే ముందు జాగ్రత్తగా వాడటం మంచిదంటున్నారు ఆర్థిక నిపుణులు. లేకపోతే చిక్కుల్లో చిక్కుకుపోయే ప్రమాదం ఉంటుంది. షాపింగ్ ఇతర అవసరాలకు వాడుతుంటే ఈఎంఐ పెట్టుకోవడం బెటర్. అందులో ఎంచుకున్న ఈఎంఐలను సమయానికి కడుతుంటే మంచిది. లేకపోతే అధిక చార్జీలతో నష్టపోయే ప్రమాదం ఉంది.
రివార్డ్ పాయింట్లు: క్రెడిట్ కార్డుతో షాపింగ్ చేయడం, బిల్లులు చెల్లించడం వంటి సమయాల్లో రివార్డు పాయింట్లు, కూపన్లు వస్తుంటాయి. అలాంటి వాటితో నెలవారీ ఖర్చులు కొంత తగ్గించుకోవచ్చు. క్రెడిట్ కార్డుతో ఆన్‌లైన్‌గా లేదా ఆఫ్‌లైన్‌గా షాపింగ్ చేసినప్పుడు 10 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది. పండుగ సీజన్‌లో అయితే ఈ కార్డులపై మరిన్ని ఆఫర్లుంటాయి. ఇలాంటి సమయంలో మంచి బెనిఫిట్ పొందవచ్చు. కానీ సమయానుకూలంగా బిల్లులు కడితే ప్రయోజనం ఉంటుందనే విషయం గుర్తించుకోవాలి.
క్రెడిట్ స్కోర్‌పై ఎఫెక్ట్.. మీరు క్రెడిట్ కార్డు వాడుతున్న సమయంలో గడువులోగా బిల్లు సరిగ్గా కడుతుంటే మీ క్రెడిట్ స్కోర్ బాగుంటుంది. లేకపోతే తగ్గుతూ ఉంటుంది. క్రెడిట్ స్కోర్ తగ్గిపోతే భవిష్యత్తులో ఏ బ్యాంకు నుంచి అయిన రుణాలు పొందే సమయంలో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. క్రెడిట్ స్కోర్ బాగుంటేనే బ్యాంకులు వ్యక్తిగత రుణాలు, గృహ రుణాలు, ఇతర రుణాలు లభిస్తాయి. లేకపోతే ఆ సదుపాయం కోల్పోతారు.
ఇవి కూడా చదవండి: