Small Savings Schemes: సుకన్య సమృద్ది, పీపీఎఫ్, ఇతర స్కీమ్‌లలో డబ్బులు పెట్టే వారికి గుడ్‌న్యూస్.. ఎందుకంటే!
Small Savings Schemes: కేంద్రం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతోంది. ఇక పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్, సుకన్య సమృద్ది యోజన పథకంలో డబ్బులు ఇన్వెస్ట్ చేసేవారికి శుభవార్త..
Small Savings Schemes: కేంద్రం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతోంది. ఇక పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్, సుకన్య సమృద్ది యోజన పథకంలో డబ్బులు ఇన్వెస్ట్ చేసేవారికి శుభవార్త అందించింది కేంద్రం. తాజాగా ప్రభుత్వం స్మాల్ సేవింగ్స్ స్కీమ్‌పై వడ్డీ రేట్లు యథాతథంగానే కొనసాగుతాయని ప్రకటించింది. మార్చి నెల చివరి వరకు ఇవే వడ్డీ రేట్లు కొనసాగుతాయని తెలిపింది. చిన్న మొత్తాల పొదుపు స్కీమ్‌లలో డబ్బులు పెట్టే వారికి ఊరట కలగనుంది. ఈ ఏడాదిలో వడ్డీ రేట్లపై కేంద్ర ప్రభుత్వం సమీక్షించి వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉందిన అందరూ భావించారు.
సాధారణంగా కేంద్ర సర్కార్ స్మాల్ సేవింగ్స్ స్కీమ్‌లపై వడ్డీ రేట్లను త్రైమాసికంలో సమీక్షించి మార్పులు చేస్తుంటుంది. మూడు నెలలకోసారి ఈ వడ్డీ రేట్లను సవరిస్తుంటుంది. ఈ సమీక్షలో వడ్డీ రేట్లు పెరగవచ్చు.. లేదా తగ్గవచ్చు.. లేక స్థిరంగా కొనసాగవచ్చు. సుకన్య సమృద్ది పథకం, పీపీఎఫ్ వంటి స్కీమ్‌లకే కాకుండా ఇతర చిన్న మొత్తాల పొదుపు పథకాలకు ఇదే విధానం వర్తిస్తుంది.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), టైమ్ డిపాజిట్ స్కీమ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, మంత్లీ ఇకన్‌కమ్ స్కీమ్, కిసాన్ వికాస్ పత్ర, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ తదితర పథకాలు స్మాల్ సేవింగ్స్ స్కీమ్ కిందకే వస్తాయి.
ఈ స్కీమ్‌లకు ఎంత వడ్డీ రేటు ► సుకన్య సమృద్ది యోజన స్కీమ్ (SSY)పై 7.6 శాతం
► పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)పై 7.1 శాతం వడ్డీ
► సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (SSCS)పై 7.4 శాతం
► నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్(NSC)పై 6.8 శాతం
► మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (MIS) పై 6.6 శాతం
► టైమ్ డిపాజిట్ (TD)పై 6.7 శాతం
► రికరింగ్ డిపాజిట్ (RD)పై 5.8 శాతం
► కిసాన్ వికాస్ పత్ర పథకం (KVP)పై 6.9 శాతం వడ్డీ
ఇవి కూడా చదవండి: