BSNL Plan: కొత్త ఏడాదిలో బీఎస్‌ఎన్‌ఎల్‌ అదిరిపోయే ఆఫర్‌.. ఆ ప్లాన్‌లో అదనంగా 60 రోజుల వ్యాలిడిటీ

BSNL Plan: ప్రస్తుతం మొబైల్‌ వాడకం అనేది ఎక్కువైపోయింది. ప్రతి ఒక్కరికి మొబైల్‌ లేనిది రోజు గడవని పరిస్థితి ఉంది. ఇక ఆయా టెలికం కంపెనీలు కూడా రీచార్జ్‌ ప్లాన్స్‌ను..

BSNL Plan: కొత్త ఏడాదిలో బీఎస్‌ఎన్‌ఎల్‌ అదిరిపోయే ఆఫర్‌.. ఆ ప్లాన్‌లో అదనంగా 60 రోజుల వ్యాలిడిటీ
Follow us
Subhash Goud

|

Updated on: Jan 01, 2022 | 11:56 AM

BSNL Plan: ప్రస్తుతం మొబైల్‌ వాడకం అనేది ఎక్కువైపోయింది. ప్రతి ఒక్కరికి మొబైల్‌ లేనిది రోజు గడవని పరిస్థితి ఉంది. ఇక ఆయా టెలికం కంపెనీలు కూడా రీచార్జ్‌ ప్లాన్స్‌ను పెంచేశాయి. ఈ కొత్త సంవత్సరంలో ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది.  ఈ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని తన ప్రీపెయిడ్ వినియోగదారులకు శుభవార్త అందించింది. రూ.2,399 ప్రీపెయిడ్‌ రీచార్జ్‌ ప్లాన్‌పై అదనంగా 60 రోజుల పాటు వ్యాలిడిటీ అందిస్తున్నట్లు బీఎస్‌ఎన్‌ఎల్‌ (BSNL) ప్రకటించింది. అయితే ఈ ప్యాక్‌ వాలిడిటీ 365 రోజులు. ఇప్పుడు అదనపు కాలపరిమితి పెంచడంతో 425 రోజులకు చేరింది.

ఈ రూ.2,399 ప్లాన్‌లో అపరిమిత కాల్స్‌తో పాటు రోజూ 3జీబీ హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ డేటా, ప్రతి రోజు 100 ఎస్‌ఎంఎస్‌ (SMS)లు అందిస్తోంది. అంతేకాకుండా బీఎస్‌ఎన్‌ఎల్‌ ట్యూన్స్‌ ఉచిత యాక్సెస్‌ అందిస్తోంది. అలాగే రోజువారీ డేటా ఉపయోగించుకున్న తర్వాత ఇంటర్నెట్‌ వేగం 80కేబీపీఎస్‌కు పడిపోతుంది. ఈ ప్లాన్‌లో అదనపు వ్యాలిడిటీ ఫిబ్రవరి నెలాఖరు వరకు ఉంటుందని బీఎస్‌ఎన్‌ఎల్‌ వెల్లడించింది.

ఇవి కూడా చదవండి:

LPG Gas Cylinder: కొత్త సంవత్సరంలో గ్యాస్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర

Petrol Diesel Prices Today: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గనున్నాయా..? తాజాగా ప్రధాన నగరాల్లో ధరల వివరాలు..!