Petrol Diesel Prices Today: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గనున్నాయా..? తాజాగా ప్రధాన నగరాల్లో ధరల వివరాలు..!
Petrol Diesel Prices Today: కొత్త సంవత్సరం మొదటి రోజు చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ (IOCL) పెట్రోల్, డీజిల్ కొత్త రేట్లను విడుదల చేసింది. తాజాగా జనవరి 1వ..
Petrol Diesel Prices Today: కొత్త సంవత్సరం మొదటి రోజు చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ (IOCL) పెట్రోల్, డీజిల్ కొత్త రేట్లను విడుదల చేసింది. తాజాగా జనవరి 1వ తేదీన పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. కొత్త ధరల ప్రకారం.. నేడు దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.95.41, డీజిల్ ధర రూ.86.67గా ఉంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు:
► ఢిల్లీ – పెట్రోల్ లీటర్ ధర రూ. 95.41, డీజిల్ రూ. 86.67
► ముంబై – పెట్రోల్ లీటర్ ధర రూ. 109.98, డీజిల్ ధర రూ. 94.14
► హైదరాబాద్- పెట్రోల్ లీటర్ ధర రూ.108.20, డీజిల్ ధర రూ.94.62
► బెంగళూరు – పెట్రోలు లీటర్ ధర రూ. రూ.100.58, డీజిల్ ధర రూ.85.01
► చెన్నై – పెట్రోల్ లీటర్ ధర రూ. 101.40, డీజిల్ ధర రూ. 91.43
► కోల్‌కతా – పెట్రోల్ లీటర్ ధర రూ. 91.43, డీజిల్ ధర డీజిల్ రూ. 91.43
► లక్నో పెట్రోల్ లీటర్ ధర రూ. 95.28, డీజిల్ ధర రూ. 86.80
► విజయవాడ – పెట్రోల్ లీటర్ ధర రూ.110.53, డీజిల్ ధర రూ.96.59
వాస్తవానికి విదేశీ మారకపు ధరలతో పాటు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధర ఆధారంగా పెట్రోల్ మరియు డీజిల్ ధరలు ప్రతిరోజూ మారుతూ ఉంటాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సమీక్షించిన తర్వాత రోజువారీ ధరలను నిర్ణయిస్తాయి. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం సంస్థలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తాయి. అయితే ముందు ముందు పెట్రోల్, డీజిల్ ధరలు మరింతగా తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో పాటు పలు రాష్ట్రాలు కూడా ధరలను తగ్గించాయి. అయితే పెట్రోల్ ధర కొన్ని ప్రాంతాల్లో రూ.100కుపైగానే ఉంది.
ఇవి కూడా చదవండి: