LPG Gas Cylinder: కొత్త సంవత్సరంలో గ్యాస్ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర
LPG Gas Cylinder: ప్రతి నెల మాదిరిగానే గ్యాస్ సిలిండర్ ధరలను సవరిస్తూ ఉంటుంది కంపెనీ. తాజాగా గ్యాస్ వినియోగదారులకు కొత్త ఏడాదిలో గుడ్‌న్యూస్ అందింది...
LPG Gas Cylinder: ప్రతి నెల మాదిరిగానే గ్యాస్ సిలిండర్ ధరలను సవరిస్తూ ఉంటాయి కంపెనీలు. తాజాగా గ్యాస్ వినియోగదారులకు కొత్త ఏడాదిలో గుడ్‌న్యూస్ అందింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరపై రూ.102 తగ్గింది. తగ్గిన ధర జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. అయితే గృహ అవసరానికి వినియోగించే 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఈ విషయాన్ని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తాజాగా వెల్లడించింది. అయితే ఈ ఏడాదిలో గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రస్తుతం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ 2వేల వరకు ఉంది. తగ్గిన ధరతో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ఢిల్లీలో రూ.2,004, కోల్‌కతాలో రూ.2,074.5, ముంబైలో రూ.1,951, చెన్నైలో రూ.2,134.50 ఉంది. ఇక ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల వెబ్‌సైట్ల ద్వారా కూడా గ్యాస్ సిలిండర్ ధరలను తెలుసుకోవచ్చు. గ్యాస్ ధరలపై అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు, రూపాయి డాలర్ మారక విలువ వంటి అంశాలు ప్రభావం చూపుతుంటాయి.
ఇవి కూడా చదవండి: