హిజాబ్ ధరించినందుకు క్లాస్‌లోకి నో ఎంట్రీ.. ముస్లిం బాలికల ఆందోళన.. ఎక్కడంటే..?

Wearing Hijab:కర్నాటకలోని ఉడిపి జిల్లా నుంచి ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ముస్లిం బాలికలు కళాశాలకి హిజాబ్‌ ధరించి

హిజాబ్ ధరించినందుకు క్లాస్‌లోకి నో ఎంట్రీ.. ముస్లిం బాలికల ఆందోళన.. ఎక్కడంటే..?
Wearing Hijab
Follow us
uppula Raju

|

Updated on: Jan 02, 2022 | 2:36 PM

Wearing Hijab:కర్నాటకలోని ఉడిపి జిల్లా నుంచి ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ముస్లిం బాలికలు కళాశాలకి హిజాబ్‌ ధరించి వచ్చినందుకు తరగతి గదికి హాజరుకాకుండా నిషేధించారు. ఈ ఘటనపై కొందరు ఇండియన్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ సభ్యులు, ముస్లిం విద్యార్థినులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఓ కాలేజీ విద్యార్థి మాట్లాడుతూ.. ‘మేము హిజాబ్‌ వేసుకొని వచ్చినందుకు క్లాసులోకి రాకుండా అడ్డుకున్నారు’ దీంతో కళాశాలకు చెందిన కొంతమంది విద్యార్థుల ప్రతినిధి బృందం, కొంతమంది ఇస్లామిక్ సంస్థ సభ్యులు జిల్లా కలెక్టర్‌ని సంప్రదించారు. హిజాబ్ ధరించినందుకు నిషేధానికి గురైన ఐదుగురు బాలికలు కూడా ఈ బృందంలో ఉన్నారు.

ఈ విషయమై కళాశాల ప్రిన్సిపాల్‌తో మాట్లాడినట్లు కలెక్టర్‌ తెలిపారు. ఒక విద్యార్థి మాట్లాడుతూ ‘మా తల్లిదండ్రులను కళాశాలకు తీసుకురావాలని అడిగారు కానీ వారు వచ్చినప్పుడు పాఠశాల అధికారులు మూడు నాలుగు గంటలపాటు వేచి ఉండేలా చేశారు. హిజాబ్ వేసుకోకముందు అంతా బాగానే ఉండేది కానీ ఇప్పుడు ఈ విధంగా వివక్ష చూపుతున్నారు’ అని చెప్పింది. క్లాస్‌లో హిజాబ్ ధరించడానికి ప్రిన్సిపాల్ అనుమతించడం లేదని మహిళా పీయూ కాలేజీకి చెందిన ఆరుగురు ముస్లిం విద్యార్థినులు ఆరోపించారు. ఉర్దూ, అరబిక్, బెరీ భాషల్లో మాట్లాడేందుకు అనుమతించడం లేదని విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. మూడు రోజులుగా బాలికలు తరగతి బయట నిలబడి నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమ తల్లిదండ్రులు ప్రిన్సిపాల్ రుద్రగౌడను కూడా సంప్రదించారని అయితే అతను సమస్యను చర్చించడానికి నిరాకరించాడని బాలికలు పేర్కొన్నారు.

గత మూడు రోజులుగా తమ హాజరు కూడా నమోదు కావడం లేదని దీంతో కాలేజీలో తమ హాజరు శాతం తగ్గిపోతుందని బాలికలు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు క్యాంపస్‌లో విద్యార్థినులు హిజాబ్ ధరించవచ్చని అయితే దానిని తరగతి గదిలోకి అనుమతించబోమని కళాశాల ప్రిన్సిపాల్ రుద్రగౌడ తెలిపారు. తరగతి గదిలో ఏకరూపత ఉండేలా ఈ నిబంధనను పాటిస్తున్నామని తెలిపారు. ఈ విషయమై త్వరలో పేరెంట్‌-టీచర్‌ సమావేశం కూడా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.

Used Car: మీరు సెకండ్ హ్యాండ్ కారు కొనాలని అనుకుంటున్నారా? అయితే ఈ తప్పులు అసలు చేయకండి!

Winter Health: చలికాలంలో శరీరం ఎందుకు వణుకుతుందో తెలుసా? వణుకు రాకుండా ఏమి చేయాలంటే..

Omicron Effect: ఒమిక్రాన్ ఎఫెక్ట్.. తమిళనాడులో స్కూల్స్ బంద్.. కొత్త కరోనా మార్గదర్శకాలు జారీ చేసిన స్టాలిన్ ప్రభుత్వం!