Omicron Effect: ఒమిక్రాన్ ఎఫెక్ట్.. తమిళనాడులో స్కూల్స్ బంద్.. కొత్త కరోనా మార్గదర్శకాలు జారీ చేసిన స్టాలిన్ ప్రభుత్వం!

కరోనా విధ్వంసం కారణంగా, తమిళనాడులోని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. కరోనా కేసులను దృష్టిలో ఉంచుకుని, రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ కొన్ని తరగతులను మూసివేసింది.

Omicron Effect: ఒమిక్రాన్ ఎఫెక్ట్.. తమిళనాడులో స్కూల్స్ బంద్.. కొత్త కరోనా మార్గదర్శకాలు జారీ చేసిన స్టాలిన్ ప్రభుత్వం!
Follow us

|

Updated on: Jan 02, 2022 | 1:35 PM

Omicron Effect: కరోనా విధ్వంసం కారణంగా, తమిళనాడులోని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. కరోనా కేసులను దృష్టిలో ఉంచుకుని, రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ కొన్ని తరగతులను మూసివేసింది. ఇతర తరగతులు, కళాశాల విద్యార్థులకు మార్గదర్శకాలు కూడా సవరించారు. పెరుగుతున్న కరోనా.. ఒమిక్రాన్ కేసుల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిషేధం విధించింది. తమిళనాడులో 1 నుండి 8 తరగతుల పాఠశాలలు జనవరి 10, 2022 వరకు మూసివేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అలాగే, 9వ తరగతి నుంచి కళాశాల వరకు విద్యార్థులకు కొత్త మార్గదర్శకాలు జారీ చేశారు

వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు..

అంతర్జాతీయ ప్రయాణ చరిత్ర లేని వ్యక్తులు ఇన్‌ఫెక్షన్‌కు గురవుతున్నందున తమిళనాడులో కోవిడ్ కేసులు చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేశాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలను మూసివేయాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన కొత్త ఆంక్షల ప్రకారం, 9 నుంచి 12 తరగతుల పాఠశాలలు COVID-19 భద్రతా ప్రోటోకాల్‌లను అనుసరించి పనిచేస్తాయి. దీనితో పాటు, తమిళనాడులోని కళాశాలలు కూడా COVID తగిన ప్రవర్తనతో ఆఫ్‌లైన్ తరగతులను కొనసాగించాలని సూచించారు. నివేదికల ప్రకారం, తమిళనాడులోని పాఠశాలలు సెలవుల అనంతరం మొదట జనవరి 3, 2022 నుంచి తిరిగి తెరవాల్సి ఉంది.

జనవరి 3 నుంచి పాఠశాలలు తెరవాల్సి ఉంది..

తమిళనాడులో ప్రస్తుతం జనవరి 10, 2022 వరకు ఆంక్షలు అమలులో ఉన్నాయి. కోవిడ్ కేసులు తగ్గకపోతే, మరింత కఠినమైన ఆంక్షలను అమలు చేయడం ద్వారా వాటిని కూడా పెంచవచ్చు. నివేదికల ప్రకారం, తమిళనాడులోని పాఠశాలలు మొదట జనవరి 3, 2022 నుండి తిరిగి తెరవాల్సి ఉంది. మరోవైపు తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చెన్నైతోపాటు పొరుగు జిల్లాల్లోని పాఠశాలలు మూతపడ్డాయి.

పిల్లలకు టీకాలు..

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సోమవారం పోరూర్‌లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పాఠశాలల్లో చిన్నారులకు కరోనా వ్యాక్సినేషన్ శిబిరాన్ని ప్రారంభించనున్నారు. దేశంలోని 15-18 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు టీకాలు వేయడం జనవరి 3, సోమవారం నుంచి ప్రారంభమవుతుంది, అయితే ఇందుకోసం రిజిస్ట్రేషన్లు జనవరి 1 నుంచి ప్రారంభమయిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి: Corona Vaccination: 15-18 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్.. మొదటి రోజు ఎంతమంది నమోదు చేసుకున్నారో తెలుసా?

New Year Horoscope: కొత్త సంవత్సరంలో మీ ఆరోగ్య..ఆర్ధిక పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోవాలని ఉందా? మరెందుకాలస్యం..