AR Rahman: వేడుకగా ఏ ఆర్‌ రెహమాన్‌ కూతురి నిశ్చితార్థం.. కాబోయే వరుడు ఎవరంటే..

ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ గ్రహీత ఏఆర్‌ రెహమాన్‌ ఇంట్లో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన పెద్ద కుమార్తె ఖతీజా రెహమాన్‌ త్వరలో పెళ్లిపీటలెక్కనుంది. తాజాగా ఆమె నిశ్చితార్థం వేడుకగా జరిగింది.

AR Rahman: వేడుకగా ఏ ఆర్‌ రెహమాన్‌ కూతురి నిశ్చితార్థం.. కాబోయే వరుడు ఎవరంటే..
Follow us

|

Updated on: Jan 03, 2022 | 7:40 AM

ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ గ్రహీత ఏఆర్‌ రెహమాన్‌ ఇంట్లో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన పెద్ద కుమార్తె ఖతీజా రెహమాన్‌ త్వరలో పెళ్లిపీటలెక్కనుంది. తాజాగా ఆమె నిశ్చితార్థం వేడుకగా జరిగింది. ఈ శుభవార్తను ఖతీజా సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. అదేవిధంగా తనకు కాబోయే భర్తను కూడా అందరికీ పరిచయం చేసింది. ఆడియో ఇంజినీర్‌, వ్యాపారవేత్త అయిన రియాసిద్దీన్‌ షేక్‌ మహ్మద్‌తో త్వరలో ఆమె నిఖా జరగనుంది. అయితే పెళ్లి తేదీ ఇంకా ఖరారు కాలేదు. కాగా చెన్నైలో అత్యంత రహస్యంగా వీరి నిశ్చితార్థం జరిగింది. కేవలం కుటుంబసభ్యులు, బంధువులు మాత్రమే హాజరయ్యారు. అందుకే ఎంగేజ్‌మెంట్‌ ఫొటోలు కూడా బయటకు రాలేదు. అయితే ఖతీజా తన భర్త ఫొటోను పంచుకుంటూ సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టింది. దీంతో ఇవి కాస్తా వైరల్‌ గా మారాయి.

తండ్రి బాటలోనే.. కాగా రెహ్మాన్ కు ఇద్దరు కూతుళ్లు ఒక కుమారుడు ఉన్నారు. ఖతీజా పెద్ద కూతురు కాగా చిన్నకూతురు పేరు రహీమా. కుమారుడి పేరు అమీన్ రెహ్మాన్. ఇక తండ్రి బాటలోనే పయనిస్తోన్న ఖతీజా కూడా మంచి గాయనిగా పేరు తెచ్చుకుంది. రజనీకాంత్‌ నటించిన ‘ఎందిరన్‌’ (తెలుగులో రోబో) ద్వారా గాయనిగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అందులో ఆమె పాడిన ‘మరమనిషి’ పాట సంగీతాభిమానులను బాగా అలరించింది. ఆతర్వాత ‘ఫరిష్టోన్’ అనే మ్యూజిక్ ఆల్బమ్‌ను కూడా విడుదల చేసింది. ఈ మ్యూజిక్ వీడియో ఉత్తమ యానిమేషన్ మ్యూజిక్ వీడియోగా గుర్తింపు పొందింది. ఇక చిన్న కూతురు రహీమా బాలీవుడ్లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే నటనలో శిక్షణ కూడా తీసుకుంది. కాగా ఇన్‌స్టాలో ఖతీజా పోస్ట్ చేసిన ఎంగేజ్‌మెంట్‌ ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. అభిమానులు, నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నారు.

Also read:

Post Office scheme: పోస్టాఫీసులో అదిరిపోయే ఆఫర్‌.. ప్రతి నెల రూ.1500తో చేతికి రూ.35 లక్షలు.. పూర్తి వివరాలు!

Assembly Elections: ఆ ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయండి.. ఈసీకి విజ్ఞప్తి.. కారణం ఏంటంటే..

Vaccination:15 నుంచి 18 ఏళ్లలోపు వారికి నేటి నుంచి వ్యాక్సినేషన్.. ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్న 4.5 లక్షల మంది..

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!