Numaish: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈనెల 10 వరకు నుమాయిష్ ప్రవేశం నిలిపివేత..!
Numaish: తెలంగాణలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల ప్రస్తుతం కోవిడ్ కేసులు తగ్గుముఖం..
Numaish: తెలంగాణలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల ప్రస్తుతం కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టగా, ఇటీవల వెలుగులోకి వచ్చిన కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తెలంగాణ రాష్ట్రంలో విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రారంభమైన నుమాయిష్ ప్రవేశాన్ని నిలిపివేశారు. ప్రభుత్వ ఆదేశాలతో ఈనెల 10వ తేదీ వరకు నిలిపివేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అయితే ఈనెల 1వ తేదీన రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, రాష్ట్ర హోం శాఖ మంత్రి మమహూద్ అలీలు కలిసి జ్యోతి వెలిగించి ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇక ఒమిక్రాన్ దృష్ట్యా ప్రభుత్వ ఆదేశాల మేరకు మూసివేస్తుట్లు ఎగ్జిబిషన్ సొసైటీ తెలిపింది.
ఇప్పుడు ఒమిక్రాన్ కొత్త వేరియంట్ వ్యాప్తి చెందుతుండటంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఒమిక్రాన్ ప్రభావం ఎలా ఉండబోతోందోనని భయాందోళనకు గురవుతున్నారు. కేసుల సంఖ్య పెరిగిపోతే ఆంక్షలు విధించే అవకాశం ఉండటంతో మళ్లీ అన్ని రంగాలు మూసివేస్తే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉండటంతో అందరిలో కలవరం మొదలవుతోంది.
ఇవి కూడా చదవండి: