Lockdown: కరోనా ఎఫెక్ట్‌.. ఆ రాష్ట్రంలో లాక్‌డౌన్‌.. రేపటి నుంచి పాఠశాలలు, కళాశాలల మూసివేత..!

Lockdown: కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. కరోనాతో పాటు కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ పాజిటివ్‌ కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఒమిక్రాన్‌ వేరియంట్‌ వల్ల అన్ని..

Lockdown: కరోనా ఎఫెక్ట్‌.. ఆ రాష్ట్రంలో లాక్‌డౌన్‌.. రేపటి నుంచి పాఠశాలలు, కళాశాలల మూసివేత..!
Follow us

|

Updated on: Jan 02, 2022 | 6:12 PM

Lockdown: కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. కరోనాతో పాటు కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ పాజిటివ్‌ కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఒమిక్రాన్‌ వేరియంట్‌ వల్ల అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ వేరియంట్‌ను దృష్టిలో ఉంచుకుని పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఒమిక్రాన్‌ కట్టడికి ప్రభుత్వం సోమవారం నుంచి కోవిడ్‌ ఆంక్షలు విధించింది. పాక్షికంగా లాక్‌డౌన్‌ విధించింది. ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో పెరుగుతున్న కరోనా మహమ్మారి కారణంగా ప్రస్తుత పరిస్థితిని సమీక్షించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది బెంగాల్‌ ప్రభుత్వం. కరోనా ఇన్ఫెక్షన్ కారణంగా సోమవారం నేతాజీ ఇండోర్ స్టేడియంలో జరగాల్సిన కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. బెంగాల్‌లోని అన్ని పాఠశాలలు, కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాలు రేపటి నుండి మూసివేయబడతాయని బెంగాల్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హెచ్‌కె ద్వివేది తెలిపారు. ప్రైవేటు, ప్రభుత్వ కార్యాలయాల్లో హాజరు శాతం 50 శాతానికి తగ్గింది. ముంబై, ఢిల్లీ నుండి వారానికి రెండు రోజులు సోమవారం మరియు శుక్రవారం మాత్రమే విమానాలు నడవనున్నాయి. రాత్రి కర్ఫ్యూ నిర్వహించనున్నారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అమలు కానుంది.

కొత్త వేరియంట్‌ కారణంగా కొన్ని ఆంక్షలు విధిస్తామని సీఎం మమతా బెనర్జీ ఇప్పటికే చెప్పారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హెచ్‌కే ద్వివేది తెలిపారు. సోమవారం నుంచి బ్రిటన్ నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించారు. వైరస్‌ ఎక్కువగా ఉన్న దేశాలతో పాటు ఇతర దేశాల నుంచి వచ్చే వచ్చే ప్రయాణికులకు RT-PCR పరీక్ష నిర్వహిస్తున్నారు. వైరస్‌ పెరుగుతున్న నేపథ్యంలో రేపటి నుండి అన్ని పాఠశాలలు, కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాలు మూసివేయనున్నారు.

Bengal 1

అలాగే పాఠశాలలతోపాటు అన్ని స్విమ్మింగ్ ఫూల్స్‌, బ్యూటీ పార్లర్‌లను కూడా మూసివేయనున్నారు. అలాగే జంతుప్రదర్శనశాలలు, సినిమా హాళ్లు మూసివేయబడతాయని, షాపింగ్ మాల్స్‌లో 50 శాతం మందితో నడుస్తాయని ప్రభుత్వం వెల్లడించింది. ఇక సమావేశాలు కూడా 50 శాతం మందితో నిర్వహించుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే లోకల్ రైలు 50 శాతం సామర్థ్యంతో రాత్రి 7 గంటల వరకు మాత్రమే నడుస్తాయి. మెట్రోలో కూడా 50 శాతం ప్రయాణికులతో నడపనున్నారు. ఇక హోమ్ డెలివరీ చేసే వారు కరోనా నిబంధనలు తప్పకుండా పాటించాలని సూచించింది. రాత్రి కర్ఫ్యూ ఉంటుందని తెలిపింది.

కోల్‌కతాలో 11 మైక్రో కంటైన్‌మెంట్ జోన్‌లు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి. అలాగే పరిశుభ్రతను పాటించడం వంటి నిబంధనలను పాటించాలని సూచించింది. అయితే సగం మంది సిబ్బందితో ప్రైవేట్, ప్రభుత్వ కార్యాలయాలు తెరవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కోల్‌కతాలో 11 మైక్రో-కంటైన్‌మెంట్ జోన్‌లు ఉంటాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చెప్పారు. మిగతా జిల్లాల్లోనూ ఇదే తరహా జోన్‌ను ఏర్పాటు చేయనున్నారు.

కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు జిల్లా యంత్రాంగం, పోలీసు కమిషనరేట్ మరియు స్థానిక అధికారులు మాస్క్‌లు ధరించడం, సామాజిక దూరం పాటించడం తప్పనిసరి అని, కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని బెంగాల్‌ ప్రభుత్వం హెచ్చరించింది.

ఇవి కూడా చదవండి:

Coronavirus: కరోనా కలకలం.. నవోదయ విద్యాలయంలో 85 మంది విద్యార్థులకు కోవిడ్ పాజిటివ్‌

Credit Card: మీరు క్రెడిట్‌ కార్డు వాడుతున్నారా..? ఈ విషయాలను గుర్తించుకోండి.. లేకపోతే కష్టాల్లో ఇరుక్కున్నట్లే..!