AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WHO on Covid: ఒమిక్రాన్ విషయంలో ఓ గుడ్ న్యూస్.. మరో బ్యాడ్ న్యూస్.. అవేంటంటే..!

WHO on Covid: లోకమంతా ఒమిక్రాన్‌కు భయపడుతోంది. ఇలాంటి సమయంలో ఓ గుడ్‌న్యూస్‌, మరో బ్యాడ్‌న్యూస్‌ చెప్పింది అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ. మరి గుడ్‌న్యూస్‌ ఏంటీ,

WHO on Covid: ఒమిక్రాన్ విషయంలో ఓ గుడ్ న్యూస్.. మరో బ్యాడ్ న్యూస్.. అవేంటంటే..!
Shiva Prajapati
|

Updated on: Jan 04, 2022 | 9:57 AM

Share

WHO on Covid: లోకమంతా ఒమిక్రాన్‌కు భయపడుతోంది. ఇలాంటి సమయంలో ఓ గుడ్‌న్యూస్‌, మరో బ్యాడ్‌న్యూస్‌ చెప్పింది అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ. మరి గుడ్‌న్యూస్‌ ఏంటీ, బ్యాడ్‌న్యూస్‌ ఏంటీ? ఇప్పుడు తెలుసుకుందాం. కరోనా మహమ్మారి ఎంట్రీ ఇచ్చి లక్షలాది మందికి ఎగ్జిట్‌ కార్డు ఇచ్చింది. ఈ మహమ్మారికి వేరియంట్లుగా డెల్టాలు, ఒమిక్రాన్‌లు తోడయ్యాయి. దీంతో ఇంకా ఆగమైంది యావత్ ప్రపంచం. మహమ్మారి భయంతోనే అన్ని వేడుకలు, పండగలు చేసుకుంది ప్రపంచం. తాజాగా 2022 కొత్త ఏడాదికి కూడా వైరస్‌ వర్రీతోనే స్వాగతం చెప్పాయి ప్రపంచదేశాలు. అయితే, ఒమిక్రాన్ భయాలు నెలకొన్న వేళ అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ ఓ శుభవార్త చెప్పింది. వైరస్‌పై కీలక కామెంట్స్‌ చేశారు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ ట్రెడోస్. కరోనా సంక్షోభంతో మూడో ఏడాదిలోకి అడుగుపెట్టిన ప్రపంచానికి 2022లో ఈ వైరస్ ముంగిపు చూసే అవకాశం ఉందన్నారు డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ టెడ్రోస్ అథనోమ్. అదే సమయంలో మరో బ్యాడ్ న్యూస్ చెప్పారు.

ఈ ఏడాదిలో ప్రపంచం ఎదుర్కొనే ఆరోగ్య ముప్పు కేవలం కొవిడ్ కాదని, ఇంకా చాలానే ఉన్నాయని మరో బాంబ్ పేల్చారు టెడ్రోస్. కొవిడ్ సంక్షోభంలో పడిపోయిన ప్రజలు సాధారణ వ్యాక్సినేషన్, ఫ్యామిలీ ప్లానింగ్, మిగిలిన రోగాలకు చికిత్స తీసుకోవడంలో అలసత్వం చూపారని అన్నారు టెడ్రోస్. కరోనాను కట్టడి చేసేందుకు, చికిత్స అందించేందుకు చాలా కొత్త సాధనాలు ఉన్నాయని, సుదీర్ఘ కాలం పాటు దేశాల మధ్య అసమానతలు కొనసాగితే నియంత్రించలేనంతగా, అంచనా వేయలేనంతగా వైరస్​ ప్రమాదకరంగా మారుతుందన్నారు WHO డైరెక్టర్. అసమానతలకు ముగింపు పలికితేనే ఈ మహమ్మారిని అంతం చేయగలుగుతామని, కొవిడ్​ మహమ్మారి వచ్చి మూడో ఏడాదిలోకి అడుగుపెడుతున్న క్రమంలో ఈ సంవత్సరంలోనే దానికి ముగింపు ఉంటుందనే నమ్మకం ఉంద్నారాయన. కానీ కలిసికట్టుగా పోరాడితేనే అది సాధ్యమవుతుందని స్పష్టం చేశారు టెడ్రోస్ అథనోమ్.

Also read:

RBI Recruitment 2022: ఆర్‌బీఐలో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవచ్చంటే?

Realme GT 2 Pro: రియల్‌మీ తొలి ఫ్లాగ్‌షిప్‌ ఫోన్‌ విడుదలకు సిద్ధం.. ఫీచర్లివే!

Cyber Attack: రెచ్చిపోయిన సైబర్ నేరగాళ్లు.. 40 పైసలకు 6 లక్షలు అంటూ భారీ ఝలక్..