Realme GT 2 Pro: రియల్‌మీ తొలి ఫ్లాగ్‌షిప్‌ ఫోన్‌ విడుదలకు సిద్ధం.. ఫీచర్లివే!

Realme GT 2 Pro అనేది బయో-బేస్డ్ మెటీరియల్‌తో రూపొందించబడిన ప్రపంచంలోని మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్ అని రియల్‌మే పేర్కొంది.

Realme GT 2 Pro: రియల్‌మీ తొలి ఫ్లాగ్‌షిప్‌ ఫోన్‌ విడుదలకు సిద్ధం.. ఫీచర్లివే!
Realme Gt 2 Pro
Follow us
Venkata Chari

|

Updated on: Jan 04, 2022 | 9:19 AM

Realme GT 2 Pro: రియల్‌మీ నేడు (జనవరి 4)న తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. Realme GT 2 సిరీస్‌తో పలు ఫోన్లను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ మేరకు నిన్న కంపెనీ కొన్ని వివరాలను వెల్లడించింది. GT 2 ప్రో సిరీస్‌లో రెండు స్మార్ట్‌ఫోన్‌లు విడుదల కానున్నాయి. అందులో Realme GT 2, Realme GT 2 Pro నేడు రిలీజ్ కానున్నాయి. Weiboలో ఒక పోస్ట్‌లో ఈ వివరాలు వెల్లడించింది. ఈ స్మార్ట్‌ఫోన్స్ 32MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 50MP డ్యూయల్ రియర్ కెమెరాతో రానున్నట్లు వెల్లడించింది. Realme GT2 స్లిమ్ బెజెల్స్, 2K AMOLED డిస్ప్లేతో వస్తుందని పోస్ట్‌లో పేర్కొంది.

Realme GT 2 Proలో కొత్తగా విడుదలైన Qualcomm Snapdragon 8 Gen 1 చిప్‌సెట్‌తో స్మార్ట్‌ఫోన్ రానుందని కంపెనీ ఇప్పటికే ధృవీకరించింది. డివైస్ కొన్ని ఫీచర్లు ఇప్పటికే నెట్టింట్లో లీకయ్యాయి. డిజైన్ విషయానికి వస్తే, రియల్‌మీ జీటీ 2 ప్రో బయో-బేస్డ్ మెటీరియల్‌తో రూపొందించబడిన ప్రపంచంలోని మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్ అని కంపెనీ పేర్కొంది. కంపెనీ ప్రకారం, గ్లోబల్ వార్మింగ్‌కు దోహదపడే శిలాజ ముడి పదార్థానికి పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయంగా పనిచేసే బయో-పాలిమర్ మెటీరియల్ స్మార్ట్‌ఫోన్ వెనుక కవర్‌లో ఉపయోగించినట్లు రియల్‌మీ పేర్కొంది.

ఈ ఫోన్స్ 6.7-అంగుళాల డిస్‌ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్, ఇన్-బిల్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇది Qualcomm Snapdragon 8 Gen 1 చిప్‌సెట్‌ను 12GB వరకు ర్యామ్, 512GB మెమొరీతో రానుందని లీకులు చెబుతున్నాయి. Realme GT2 ప్రో ఫ్రంట్ కెమెరా 150-డిగ్రీల అల్ట్రా-వైడ్ యాంగిల్‌ను కలిగి ఉన్న మొదటి స్మార్ట్‌ఫోన్ అని కంపెనీ పేర్కొంది. ఇక ప్రైమరీ కెమెరాలో 84-డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూతో రానున్నట్లు పేర్కొంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌ల కోసం ప్రపంచంలోని మొట్టమొదటి ఫిష్‌ఐ మోడ్‌ను కంపెనీ అభివృద్ధి చేసింది. ఇది అల్ట్రా-లాంగ్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఎఫెక్ట్‌ను అందిస్తుంది. హైపర్‌స్మార్ట్ యాంటెన్నా స్విచింగ్ టెక్నాలజీ కూడా వీటిలో ఉంది. ఇది ఫోన్‌లోని అన్ని వైపులా కవర్ చేసే 12 ర్యాప్-అరౌండ్ యాంటెన్నాలతో రూపొందించారు.

Also Read: WhatsApp New Features 2022: వాట్సప్ నుంచి అదిరిపోయే ఫీచర్లు ఈ సంవత్సరం రానున్నాయి.. అవేమిటో తెలుసా?

Smartphone Tips: మీ స్మార్ట్ ఫోన్ పదే పదే స్టోరేజ్ ఫుల్ అంటోందా..? అయితే వీటిని ట్రై చేయాల్సిందే..