Smartphone: మీ పాత ఫోన్‌ను ఇతరులకు విక్రయిస్తున్నారా..? జాగ్రత్త.. అమ్మేసే ముందు ఈ పని తప్పకుండా చేయండి..!
Smartphone: కొత్తగా మొబైల్ కొనుగోలు చేసేటప్పుడు పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేయడం లేదా తక్కువ ధరకి అమ్మడం లాంటివి చేస్తుంటాము. అయితే పాత ఫోన్‌ను అమ్మే సమయంలో..
Smartphone: కొత్తగా మొబైల్ కొనుగోలు చేసేటప్పుడు పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేయడం లేదా తక్కువ ధరకి అమ్మడం లాంటివి చేస్తుంటాము. అయితే పాత ఫోన్‌ను అమ్మే సమయంలో ఫోన్‌లో డేటా పూర్తిగా తొలగించినా అందులో మనకి సంబంధించిన ఎంతో కొంత సమాచారం ఉండిపోతుంది. అందుకే పాత ఫోన్‌ని ఎవరికైనా అమ్మేటప్పుడు దాన్ని ఫ్యాక్టరీ రీసెట్ చేయడం తప్పనిసరి అని మొబైల్ నిపుణులు సూచిస్తుంటారు. ఇలా చేయడం వల్ల మన ఫోన్‌లోని డేటా మొత్తం పూర్తిగా డిలీట్ అవ్వడమే కాకుండా ఫోన్ కొన్నప్పుడు ఉన్న సెట్టింగ్స్ ఉంటాయి. దీని వల్ల మీ డేటా పూర్తి సురక్షితంగా ఉంటుంది. ఫోన్ ఫ్యాక్టరీ రీసెట్ చేయకపోతే మీ డేటా వివరాలు తెలిసిపోతాయి. దీని వల్ల సైబర్ నేరాలు, ఇతర సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొంత మందికి ఫోన్‌ను ఫ్యాక్టరీ రీసెట్ ఎలా చేయాలి అనే విషయాలు తెలిసి ఉండవు. ఒక వేళ తెలిసినా.. రీసెట్ చేయాలనే ఆలోచన రాదు. ఎందుకంటే మనకు సంబంధించిన వివరాలు పెద్దగా ఏముంటాయనే భావనలో ఉంటారు. మరి మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఫ్యాక్టరీ రీసెట్ ఎలా చేయాలో తెలుసుకుందాం.
ముందుగా మీ మొబైల్‌లోని వాట్సాప్, ట్విటర్, ఎంఎస్ ఆఫీస్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, గూగుల్ అకౌంట్, జీమెయిల్ వంటి అకౌంట్లను లాగౌట్ చేయండి. ఇందుకోసం ఫోన్ సెట్టింగ్స్‌లో అకౌంట్స్‌లోకి వెళ్లి ఒక్కో ఖాతా నుంచి లాగౌట్ చేస్తే సరిపోతుంది. చివరిగా మీ గూగుల్ అకౌంట్ నుంచి లాగౌట్ చేయాలి. ఇలా చేయడం వల్ల మీ పాత ఫోన్‌లోని వివరాలు సింక్ కాకుండా ఉంటాయి. ఆ తర్వాత మొబైల్‌లో మైక్రో ఎస్‌డీ కార్డు, సిమ్ కార్డులను తొలగించాలి. సెట్టింగ్‌లోకి వెళ్లి జనరల్ మేనేజ్‌మబెంట్‌పై క్లిక్ చేస్తే అందులో రీసెట్ సెక్షన్‌పై క్లిక్ చేయాలి. అందులో ఫ్యాక్టరీ డేటా రీసెట్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే మీ ఫోన్‌లో ఉన్న డేటా మొత్తం డిలీట్ అయిపోయి ఫోన్ రీస్టాట్ అవుతుంది.
ఈ ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాత ఫోన్ ఆన్ చేస్తే ఆండ్రాయిడ్ వెల్‌కమ్ అని స్క్రీన్ మీద కనిపిస్తుంది. దాంతో కొత్తగా మీ ఫోన్ ఉపయోగించేవారు తమ మీ వివరాలు తెలుసుకునేందుకు ఎలాంటి ఆస్కారం ఉండదు. అయితే ఇంకో విషయం ఏంటంటే.. ఫ్యాక్టరీ రీసెట్ ప్రాసెస్ ఫోన్ మోడల్‌ని బట్టి మారుతుంది. ఉదాహరణకు శాంసంగ్ ఫోన్‌లో ఫ్యాక్టరీ డేటా రీసెట్ ఆప్షన్ సెట్టింగ్స్‌లో జనరల్ మేనేజ్‌మెంట్‌లో ఉంటుంది. షావోమి ఫోన్లలో సెట్టింగ్స్‌లో అబౌట్ ఫోన్‌లోకి వెళ్లి డిలీట్ ఆల్ (ఫ్యాక్టరీ రీసెట్) పేరుతో కనిపిస్తుంది. ఐఫోన్‌లో సెట్టింగ్స్‌లో జనరల్‌పై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేస్తే రీసెట్ ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఓపెన్ చేసి ఎరేజ్ ఆల్ కంటెంట్ అండ్ సెట్టింగ్స్‌ని సెలెక్ట్ చేయాలి. ఇలా ఒక్కో ఫోన్‌లలో ఒక్కో విధంగా ఉంటుంది.
ఇవి కూడా చదవండి: