- Telugu News Photo Gallery Technology photos Are You Planning To buy smart phone in this new year here some smartphones under 20k
Smartphone Under 20K: కొత్త ఏడాదిలో కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నారా.? రూ. 20 వేల లోపు ఉన్న బెస్ట్ ఫోన్స్ ఇవే..
Smartphone Under 20K: కొత్త ఏడాదిలో కొత్త స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలని చాలా మంది భావిస్తుంటారు. మీరు కూడా అదే ఆలోచనలో ఉన్నారా.? అయితే రూ. 20 వేలలోపు అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ స్మార్ట్ ఫోన్స్, ఫీచర్లపై ఓ లుక్కేయండి..
Updated on: Jan 04, 2022 | 2:56 PM

రోజుకో కొత్త స్మార్ట్ ఫోన్‌తో మొబైల్ తయారీ సంస్థలు వినియోగదారులను అట్రాక్ట్ చేస్తున్నాయి. ఇలా అందుబాటులో ఎన్నో రకాల బ్రాండ్‌లకు చెందిన స్మార్ట్ ఫోన్స్ ప్రస్తుతం మార్కెట్లో సందడి చేస్తున్నాయి. మరి వీటిలో రూ. 20 వేల లోపు ఉన్న కొన్ని బెస్ట్ స్మార్ట్ ఫోన్స్‌పై ఓ లుక్కేద్దామా..

Redmi Note 11T: రూ. 20 వేల లోపు అందుబాటులో ఉన్న బెస్ట్ స్మార్ట్ ఫోన్స్‌లో రెడ్‌మీ నోట్ 11టీ ఒకటి. ఈ ఫోన్ మొత్తం మూడు స్టోరేజ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఫోన్ రూ. 14,090గా ఉంది. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో మీడియా టెక్ డైమెన్సిటీ 810 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను అందించారు. 50 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు 16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు. ఇక 2400*1080 రిజల్యూషన్‌తో కూడిన 6.6 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ+ఎల్‌సీడీ స్క్రీన్‌ను ఇచ్చారు.

Realme 8 5G: రియల్‌మీ 8 64 జీబీ స్టోరేజ్, 4 జీబీ ర్యామ్ ధర రూ. 15,499గా ఉండగా, 128 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్ ధర రూ. 18,499గా ఉంది. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.5 ఇంచెస్ స్క్రీన్‌ను అందించారు. ఇక కెమెరా విషయానికొస్తే ఇందులో 48 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు, 16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా అందించారు. 15 వాట్స్ సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు.

Motorola Moto G60: ఈ స్మార్ట్ ఫోన్‌లో 120 హెచ్‌జెడ్‌తో కూడిన 6.8 ఇంచెస్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను అందించారు. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 732 జీ ప్రాసెసర్ ఈ ఫోన్ సొంతం. ఈ స్మార్ట్ ఫోన్‌లో 108 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 32 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు. 6జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్‌తో కూడిన ఈ ఫోన్ రూ. 17,999గా ఉంది.

Realme Narzo 30 5G: స్మార్ట్ ఫోన్స్‌లో గేమింగ్ ఇష్టపడే వారికి ఈ స్మార్ట్ ఫోన్‌ను బెస్ట్ ఆప్షన్‌గా చెప్పవచ్చు. ఇందులో 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ+ ఎల్‌సీడీ స్క్రీన్‌ను అందించారు. కెమెరా విషయానికొస్తే ఇందులో 48 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. ఇక 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ సొంతం.




