WhatsApp Blue Tick Feature: వాట్సాప్‌లో మూడో బ్లూటిక్ ఫీచర్ వస్తోందా..? యూజర్లకు క్లారిటీ ఇచ్చిన సంస్థ
WhatsApp Blue Tick Feature: వాట్సాప్.. ఇది లేనిది ఏ స్మార్ట్‌ఫోన్ ఉండదు. ఉదయం లేచింది నుంచి రాత్రి పడుకోబోయే వరకు వాట్సాప్‌లో మునిగి తేలుతుంటారు. ఇక వాట్సాప్..
WhatsApp Blue Tick Feature: వాట్సాప్.. ఇది లేనిది ఏ స్మార్ట్‌ఫోన్ ఉండదు. ఉదయం లేచింది నుంచి రాత్రి పడుకోబోయే వరకు వాట్సాప్‌లో మునిగి తేలుతుంటారు. ఇక వాట్సాప్ సంస్థ కూడా ఎప్పటికప్పుడు యూజర్లకు కొత్త కొత్త ఫీచర్స్‌ను పరిచయం చేస్తోంది. టెక్నాలజీ పెరుగుతున్నకొద్ది కొత్త ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పటికే ఎన్నో ఫీచర్స్‌ను తీసుకువచ్చిన వాట్సాప్.. ఇప్పుడు మరో ఫీచర్స్ తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోందనే వార్తసోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక సాధారణం మనం వాట్సాప్‌లో మెసేజ్ పంపగానే సింగిల్ టిక్ వస్తుంది. అలాగే అవతలి వాళ్లు మెసేజ్ చేసిన తర్వాత రెండు బ్లూ టిక్స్ వస్తాయి. ఈ ఫీచర్ ప్రస్తుతం ఉన్న ఫీచరే.
ఇప్పుడు రాబోయే ఫీచర్ ఏంటంటే .. వాట్సాప్ సందేశం పంపిన తర్వాత వాళ్లు చూసి దానిని స్క్రీన్ షాట్ తీసుకున్నట్లయితే మూడు బ్లూ టిక్స్ వస్తాయనేది దీని సారాంశం. ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు వాట్సాప్ ప్రయత్నాలు చేస్తోందని కథనాలు వెలువడుతున్నాయి. ఇక దీనిపై స్పందించిన సంస్థ ఇది ఫేక్ న్యూస్‌గా తేల్చింది. ఇలాంటి ఫీచర్స్‌ను తీసుకురావడం లేదని తేల్చి చెప్పింది. మూడో బ్లూటిక్ ఆప్షన్ తీసురావడం లేదని క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి మెకానిజం కోసం వాట్సాప్ సంస్థ ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి: