Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Driving Licence: డ్రైవింగ్‌ లైసెన్స్‌ కావాలా..? మీకో గుడ్‌న్యూస్‌.. ఇంట్లోనే ఉండి దరఖాస్తు చేసుకోవచ్చు.. ఎలాగంటే..!

Driving Licence: ఈ రోజుల్లో డ్రైవింగ్ లైసెన్స్‌ అనేది తప్పనిసరి అయిపోయింది. వాహనాలు నడపాలంటే డ్రైవింగ్‌ లైసెన్స్‌ తప్పనిసరి. గతంలో లైసెన్స్‌ లేకుండా వాహనాలు..

Driving Licence: డ్రైవింగ్‌ లైసెన్స్‌ కావాలా..? మీకో గుడ్‌న్యూస్‌.. ఇంట్లోనే ఉండి దరఖాస్తు చేసుకోవచ్చు.. ఎలాగంటే..!
Follow us
Subhash Goud

|

Updated on: Jan 03, 2022 | 9:43 AM

Driving Licence: ఈ రోజుల్లో డ్రైవింగ్ లైసెన్స్‌ అనేది తప్పనిసరి అయిపోయింది. వాహనాలు నడపాలంటే డ్రైవింగ్‌ లైసెన్స్‌ తప్పనిసరి. గతంలో లైసెన్స్‌ లేకుండా వాహనాలు నడిపేవారు చాలా మందే ఉండేవారు. కానీ రోజుకురోజుకు మారుతున్న నిబంధనల కారణంగా డ్రైవింగ్‌ లైసెన్స్‌ తప్పనిసరి అయిపోయింది. డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా వాహనాలు నడిపితే చర్యలు కఠినంగా ఉన్నాయి. ఒకవేళ నడిపితే మాత్రం అది చట్ట విరుద్ధం అవుతుంది. భారీగా జరిమానా వేస్తారు. అందుకే వాహనాలు నడిపే వారికి డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండటం తప్పనిసరి. ఇక డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందడం ఇప్పుడు సులభతరంగా మారింది. గతంలో ఉన్న నిబంధలన్ని మారిపోయాయి. ఇప్పుడు ఆన్‌లైన్‌లో కూడా లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇక మీరు ఏపీకి చెందిన వారైతే మీరు ఇంట్లోనే ఉండి డ్రైవింగ్‌ లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఓ వెబ్‌సైట్‌ను రూపొందించింది. దీని ద్వారా ఏ రాష్ట్రానికి చెందిన వారు అయినా డ్రైవింగ్‌ లైసెన్స్‌ కోసం ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈ వెబ్‌సైట్‌లో తెలంగాణ రాష్ట్రం పేరు మాత్రం లేదు.

డ్రైవింగ్‌ లైసెన్స్‌ కావాలని అనుకుంటే https://sarathi.parivahan.gov.in/sarathiservice/stateSelection.do వెబ్‌సైట్‌లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో రాష్ట్రం పేరు ఎంపిక చేసుకుని చేసుకునే వెలుసుబాటు అందుబాటులోకి వచ్చింది. ఇందులో ఎన్నో సేవలు అందుబాటులో ఉన్నాయి.ఎల్ఎల్ఆర్, డ్రైవింగ్ లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్, డూప్లికెట్ డ్రైవింగ్ లైసెన్స్ ఇలా ఇంకా చాలా రకాల సేవలు పొందే అవకాశం ఉంది.

వెబ్‌సైట్‌లో డ్రైవింగ్‌ లైసెన్స్‌ దరఖాస్తు అనే ఆప్షన్‌ను ఎంచుకుని ఏయే డాక్యుమెంట్ల అవసరమో చూసుకోవాలి. అన్ని వివరాలు నమోదు చేసిన తర్వా డాక్యుమెంట్లను సైతం అప్‌లోడ్‌ చేయాలి. ఫోటో, సంతకం, ఆధార్‌, పేమెంట్‌ తదితర వివరాలు నమోదు చేయాలి. దరఖాస్తు చేసుకున్న తర్వాత దానిని ప్రింట్‌తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి:

Post Office scheme: పోస్టాఫీసులో అదిరిపోయే ఆఫర్‌.. ప్రతి నెల రూ.1500తో చేతికి రూ.35 లక్షలు.. పూర్తి వివరాలు!

PAN Card: మీ వద్ద ఒకటి కంటే ఎక్కువ పాన్‌ కార్డులు ఉన్నాయా..? జాగ్రత్త.. ఇబ్బందుల్లో పడ్డట్లే..!