- Telugu News Business Alert PAN Card Holders: These people will pay Rs 10,000 fine for their PAN cards, check details
PAN Card: మీ వద్ద ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు ఉన్నాయా..? జాగ్రత్త.. ఇబ్బందుల్లో పడ్డట్లే..!
PAN Card: పాన్ కార్డు అనేది చాలా ముఖ్యం. బ్యాంకు ఖాతా తీయాలన్నా.. ఇతర లావాదేవీలు జరపాలన్నా.. ఇన్‌కమ్ ట్యాక్స్, ఐటీఆర్ రిటర్న్ తదితర వాటికి పాన్ ఎంతో ముఖ్యం. ఇది లేనిది ..
Updated on: Jan 02, 2022 | 9:14 PM

PAN Card: పాన్ కార్డు అనేది చాలా ముఖ్యం. బ్యాంకు ఖాతా తీయాలన్నా.. ఇతర లావాదేవీలు జరపాలన్నా.. ఇన్‌కమ్ ట్యాక్స్, ఐటీఆర్ రిటర్న్ తదితర వాటికి పాన్ ఎంతో ముఖ్యం. ఇది లేనిది పనులు జరగవు. అయితే కొందరు పాన్ కార్డును ఉపయోగించుకుని కొన్ని తప్పులు చేస్తుంటారు. కార్డును మిస్‌యూజ్ చేస్తే భారీగా ఫైన్ కట్టాల్సి ఉంటుంది. అలాంటివారికి రూ.10వేల జరిమానా చెల్లించుకోవాల్సి ఉంటుంది.

పాన్‌కార్డు ద్వారా ఎవరు ఎటువంటి లావాదేవీలు చేస్తున్నారో ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారుల వద్ద పూర్తి డేటా ఉంటుంది. కొందరు రెండు పాన్ కార్డులు తీసుకుని మిస్ యూజ్ చేస్తుంటారు ఇలా రెండు పాన్ కార్డులు తీసుకోవడం అనేది చట్టరిత్యా నేరం. ఒకవేళ రెండు పాన్ కార్డులు ఉండి అధికారులకు దొరికిపోయినట్లయితే రూ.10 వేల జరిమానా కట్టాల్సి ఉంటుంది.

ఇలా రెండు పాన్‌కార్డులు ఉంటే జరిమానాతో పాటు బ్యాంకు ఖాతాలను సైతం స్తంభింపజేస్తారు. ఇలా రెండు పాన్ కార్డు కలిగిన వాళ్లు ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 కింద సెక్షన్ 272బీ ప్రకారం.. ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులకు దాన్ని తిరిగి ఇచ్చేయవచ్చు. అలా ఇచ్చేయకుండా తమ దగ్గరే పెట్టుకుంటే మాత్రం అధికారులు చర్యలు తీసుకుంటారు.

ఇలా రెండు పాన్ కార్డులు ఉన్నవాళ్లు. ఏదైనా ఎన్‌ఎస్‌డీఎల్ కార్యాలయంలో పాన్ కార్డును రిటర్న్ చేయవచ్చు. దానికంటే ముందు పాన్ కార్డు అఫిషియల్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఓ ఫామ్ నింపాల్సి ఉంటుంది. ఇలా ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు కలిగి ఉంటే చట్టపరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు కలిగిన వారిపై ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు ప్రత్యేక నిఘా పెడుతున్నారు.




