Ashok Elluswamy: మస్క్​’టీమ్’లో భారత సంతతి ఇంజినీర్.. వెల్లడించిన ​ఎలాన్ మస్క్..

Tesla వ్యవస్థాపకుడు, CEO ఎలోన్ మస్క్ తన ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ ఆటోపైలట్ టీమ్‌లో నియమించిన మొదటి ఉద్యోగి పేరును వెల్లడించారు.

Ashok Elluswamy: మస్క్​'టీమ్'లో భారత సంతతి ఇంజినీర్.. వెల్లడించిన ​ఎలాన్ మస్క్..
Ashok Elluswamy
Follow us
Srinivas Chekkilla

| Edited By: Ravi Kiran

Updated on: Jan 03, 2022 | 9:29 AM

Tesla వ్యవస్థాపకుడు, CEO ఎలోన్ మస్క్ తన ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ ఆటోపైలట్ టీమ్‌లో నియమించిన మొదటి ఉద్యోగి పేరును వెల్లడించారు. ఉద్యోగులను రిక్రూట్ చేయడానికి సోషల్ మీడియాను ఉపయోగిస్తున్న మస్క్, భారతీయ సంతతికి చెందిన అశోక్ ఎల్లుస్వామి తన ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ ఆటోపైలట్ టీమ్‌లో నియమించిన మొదటి ఉద్యోగి అని వెల్లడించారు.” ట్వీట్ ద్వారా రిక్రూట్ చేసిన మొదటి వ్యక్తి అశోక్. టెస్లా ఒక ఆటోపైలట్ టీమ్‌ను ప్రారంభిస్తోందని చెప్తున్నాను!” అని మస్క్ చెప్పారు.”టెస్లా ఆటోపైలట్ AI బృందం చాలా ప్రతిభావంతమైనదన్నారు.

టెస్లాలో చేరడానికి ముందు, Mr ఎల్లుస్వామి వోక్స్‌వ్యాగన్ ఎలక్ట్రానిక్ రీసెర్చ్ ల్యాబ్, WABCO వెహికల్ కంట్రోల్ సిస్టమ్‌ విభాగంలో పని చేసేవారు. అతను చెన్నైలోని కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ గిండీ నుంచి ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని, కార్నెగీ మెల్లన్ విశ్వవిద్యాలయం నుంచి రోబోటిక్స్ సిస్టమ్ డెవలప్‌మెంట్‌లో మాస్టర్స్ డిగ్రీని పొందాడు.

మస్క్ ఇటీవల ట్వీట్ చేశారు. ప్రజల జీవితాలను నేరుగా ప్రభావితం చేసే సమస్యలను పరిష్కరించడంలో శ్రద్ధ వహించే హార్డ్‌కోర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఇంజనీర్‌ల కోసం వెతుకుతున్నానని చెప్పారు. ఆసక్తి గల అభ్యర్థులతో జాబ్ అప్లికేషన్ పంపాలన్నారు. పేరు, ఇమెయిల్, సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌లో చేసిన పని వివరాలు తెలపాలని కోరారు.

Read Also.. Bandi Sanjay: బండి సంజయ్ దీక్ష భగ్నం చేసిన పోలీసులు.. కరీంనగర్‎లో ఉద్రిక్తత..