AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hindu Coucil: భారత్‌లో ప్రముఖ దేవాలయాలను సందర్శించడానికి రానున్న పాకిస్థాన్ హిందువుల బృందం.. ఎప్పుడంటే..

Pakistan Hindu Coucil: పాకిస్తానీ హిందువుల ప్రతినిధి బృందం ఈ నెలలో భారతదేశంలోని వివిధ దేవాలయాలను సందర్శించనుంది. ఈ మేరకు పాక్ అధికారులు ఆదివారం భారత దేశ..

Hindu Coucil: భారత్‌లో ప్రముఖ దేవాలయాలను సందర్శించడానికి రానున్న పాకిస్థాన్ హిందువుల బృందం.. ఎప్పుడంటే..
Pakistani Hindus
Surya Kala
| Edited By: Janardhan Veluru|

Updated on: Jan 11, 2022 | 9:39 AM

Share

Pakistan Hindu Coucil: పాకిస్తానీ హిందువుల ప్రతినిధి బృందం ఈ నెలలో భారతదేశంలోని వివిధ దేవాలయాలను సందర్శించనుంది. ఈ మేరకు పాక్ అధికారులు ఆదివారం భారత దేశ అధికారులకు సమాచారం అందించారు. తమ దేశంలోని మైనార్టీల కోసం ప్రభుత్వం మతపరమైన పర్యాటకాన్ని ప్రోత్సహిస్తోందని..  పాకిస్తాన్ హిందూ పరిషత్ చీఫ్ రమేష్ కుమార్ చెప్పారు. అంతేకాదు.. ఈ పర్యటన “భారత్ , పాకిస్తాన్ మధ్య సంబంధాలు సాధారణ స్థితికి చేరుకోవడానికి  ఇది ఒక పెద్ద అడుగు” అని అన్నారు.

ఈ బృందం జనవరి 20న భారత్‌కు చేరుకుని పలు దేవాలయాలను సందర్శించనుంది. అయితే.. ఈ బృందం మన దేశంలోని ఏయే ఆలయాలను సందర్శిస్తారనేది తెలియాల్సి ఉంది. అంతేకాదు ప్రతినిధి బృందంలో ఎంత మంది భక్తులు ఉంటారో కూడా తెలియాల్సి ఉంది.

మరోవైపు, వాయువ్య పాకిస్థాన్‌లోని 100 ఏళ్ల పురాతన మహారాజా పరమహంస జీ ఆలయాన్ని ఆదివారం భారతదేశం, అమెరికా, గల్ఫ్ ప్రాంతానికి చెందిన 200 మందికి పైగా హిందూ భక్తులు సందర్శించారు.

భద్రత కోసం 600 మంది సిబ్బంది: 

ఈ సందర్భంగా భక్తుల భద్రత కోసం 600 మంది సిబ్బందిని నియమించారు. ఖైబర్ పఖ్తుంఖ్వాలోని కరక్ జిల్లా తేరి గ్రామంలోని పరమహంస జీ ఆలయం, ‘సమాధి’ గత సంవత్సరం పునరుద్ధరించబడింది. ఆలయాన్ని సందర్శించిన హిందువుల బృందంలో భారతదేశం నుండి దాదాపు 200 మంది యాత్రికులు, పదిహేను మంది దుబాయ్ నుండి, మిగిలినవారు US , ఇతర గల్ఫ్ దేశాల నుండి ఉన్నారు. 2020 సంవత్సరంలో.. పర్యాటనకు వెళ్లిన ప్రయాణీకులను ఒక గుంపు దోచుకుంది. ఈ ఘటనను ప్రపంచవ్యాప్తంగా ఖండించారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది భారీ సంఖ్యలో భద్రతా సిబ్బందిని పాక్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

వాఘా సరిహద్దు: భారత  యాత్రికులు లాహోర్ సమీపంలోని వాఘా సరిహద్దును దాటి, సాయుధ సిబ్బంది సహాయంతో ఆలయానికి చేరుకున్నారని అధికారులు తెలిపారు. పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌తో కలిసి పాకిస్థాన్ హిందూ కౌన్సిల్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.

Also Read:  చాణక్య నీతి ప్రకారం ఈ 5 విషయాలను ఎప్పుడూ గుర్తుంచుకున్న వ్యక్తి .. కెరీర్‌లో సక్సెస్ అందుకుంటారు..