Astronauts in Space: స్పేస్‌లో ఆస్ట్రానాట్స్‌ ఎలా ఉంటారు.. ఏం తింటారు.? ఎలా నిద్రపోతారు.?(వీడియో)

స్పేస్‌ టూరిజం.. ఇప్పుడిదే వరల్డ్‌ వైడ్‌గా హాట్‌ టాపిక్‌.. ఇప్పటికే.. గ్రావిటీ లెవల్‌ను పర్యాటకులు ఆస్వాదించారు. ఇప్పుడు చందమామను కూడా పర్యాటక స్థలంగా మార్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు వ్యాపార దిగ్గజాలు. ఇదిలా ఉంటే..

Anil kumar poka

|

Jan 03, 2022 | 9:54 PM


స్పేస్‌ టూరిజం.. ఇప్పుడిదే వరల్డ్‌ వైడ్‌గా హాట్‌ టాపిక్‌.. ఇప్పటికే.. గ్రావిటీ లెవల్‌ను పర్యాటకులు ఆస్వాదించారు. ఇప్పుడు చందమామను కూడా పర్యాటక స్థలంగా మార్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు వ్యాపార దిగ్గజాలు. ఇదిలా ఉంటే.. స్పేస్‌ సెంటర్‌లోకి వెళ్లిన ఆస్ట్రోనాట్స్‌ కొన్ని నెలల పాటు అక్కడే ఉండి పరిశోధనలు చేయాల్సి ఉంటుంది. అయితే అన్ని రోజుల పాటు వాళ్లు ఏం తిని బతుకుతారు? వారి స్నానపానాదులు ఎలా? అసలు నిద్ర పడుతుందా? మిగితా పనులను ఎలా చేసుకుంటారు? ఈ అ డౌట్లు ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఇంతకీ… ఇదంతా ఎలా సాధ్యమో తెలుసా..?ముందుగా ఆస్ట్రోనాట్స్‌ స్పేస్‌లోకి వెళ్లే ముందు.. వాళ్లు శారీరకంగా, మానసికంగా స్ట్రాంగ్‌ ఉండేలా చూస్తారు సైంటిస్టులు. దీని కోసం వాళ్లు చాలా నెలల పాటు భూమి మీదే ట్రైనింగ్‌ ఇస్తుంటారు.ఇక భూమి మీద నుంచి స్పేస్‌లోకి వెళ్లే ప్రతి ఒక్క ఆస్ట్రోనాట్‌ ఇంటర్‌ నేషనల్‌ స్పేస్‌ సెంటర్‌లోకే వెళ్తారు. ఈ ఇంటర్‌ నేషనల్‌ స్పేస్‌ సెంటర్‌ భూమికి 400కిలో మీటర్ల ఎత్తులో ఉండి, స్పేస్‌లో ఉన్న ప్రతి ఒక్కశాటిలైట్‌లను తన ఆధినంలో ఉండేలా చూసుకుంటుంది ఈ అడ్వాన్స్‌డు ల్యాబోరేటరీ. ఈ మిషీన్‌ను అమెరికాతో పాటు మొత్తం 16దేశాలు 120బిలియన్‌ డాలర్స్‌ ఖర్చు పెట్టి మరీ తయారు చేశాయి. అయితే ఓ ఆస్ట్రోనాట్‌ భూమి మీద నుంచి ముందుగా స్పేస్‌లోకి ఎంటర్‌ కాగానే అతడి శరీరంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. స్పేస్‌లోని గ్రావిటీ కారణంగా ఆస్ట్రోనాట్స్‌ ఎముకలు, కండరాలు కొంచెం కుచించుకుపోతాయి.. అది ప్రమాదమే . అందుకే ఈ ముప్పు నుంచి తప్పించుకునేందుకు వారు ప్రతి రోజూ ఎక్సర్‌సైజ్ చేయ్యాల్సి ఉంటుంది. నాసా మొత్తం మూడు రకాల మిషెన్స్‌ ద్వారా వాళ్ల ఆస్ట్రోనాట్స్‌కు ఎక్సర్‌సైజ్‌ చేయిస్తుంది. వీటిలో ట్రెడ్‌మిల్‌ చాలా ఇంపార్ట్‌టెంట్‌ అవుతుంది. ఎందుకంటే స్పేస్‌లో ఆస్ట్రోనాట్స్‌ ముఖ్యంగా ఫ్లోట్‌ అవుతూనే ఉంటారు కాబట్టి, ఈ ట్రెడ్‌మిల్‌ చాలా ఉపయోగపడుతుంది.

భూమి మీద ఉండే మనకు ప్రతి రోజూ 24గంటలు ఉంటాయి. మరీ స్పేస్‌లో కాస్త డిఫిరెంట్‌గా ఉంటుంది. కానీ ఆస్ట్రోనాట్స్‌ మాత్రం మన టైమ్‌నే ఫాలో అవుతుంటారు. స్పేస్‌ సెంటర్‌లో వేగంగా ప్రయాణిస్తున్న కారణంగా ఈ 24గంటల్లోనే వీరు 16సార్లు సూర్యోదయాన్ని. అయితే స్పేస్‌లోకి వెళ్లే ఏ ఆస్ట్రోనాట్స్‌ అయినా సరే ఓమేగా కంపెనీ యొక్క స్మార్ట్‌ వాచ్‌ను మాత్రమే ధరించాల్సి ఉంటుంది. దీని ద్వారానే ఆస్ట్రోనాట్స్‌ భూమి మీద టైమ్‌ను ఫాలో అవుతారు. ఇక ఆస్ట్రోనాట్స్‌ ఉదయం లేవగానే టూత్‌ బ్రేష్‌ చేసుకోవడం నుంచి ప్రతీది వాళ్లకు పెద్ద టాస్కే. ముందుగా టూత్‌పేస్ట్‌ను బ్రేష్‌పై ఉంచి నోట్లో బ్రేష్‌ పెట్టుకుని, నోరు మూసుకోని మరీ బ్రేష్‌ చేస్తారు ఆస్ట్రోనాట్స్‌. ఎందుకంటే.. గ్రావిటీ కారణంగా నోట్లో ఉన్న పేస్ట్‌ మొత్తం కిందకు పడిపోయే ఛాన్స్‌ ఉంటుంది. అంతేకాదు.. వాళ్లు బ్రేష్‌ చేసుకున్న తర్వాత ఆ పేస్ట్‌ను అలాగే మిగేస్తుంటారు. అక్కడ స్పిట్‌ చేసేందుకు వీళ్లు లేదు.ఇక స్నానం విషయానికి వస్తే.. ముందుగా ఆస్ట్రోనాట్స్‌ వారి బాడీపై షాంపును ఉంచుకోని, ఓ క్లాత్‌ షవర్‌ బ్యాగ్‌ కింద నిలబడి ఉంటారు. ఆ తర్వాత నీటితో ఉన్న క్లాత్‌ను శరీరం మొత్తం రఫ్‌ చేసుకుంటారు. ఎందుకంటే.. ఇలా చేయడం వల్ల నీరు అటుఇటు ఫ్లోట్‌ అవ్వకుండా ఉంటుంది కాబట్టి. ఇక వాష్‌ రూమ్‌ విషయానికి వస్తే.. గతంలో ఆస్ట్రోనాట్స్‌ యూరిన్‌ స్పేస్‌లోనే వదిలేసే వారు. కానీ.. ఇప్పుడు ఆస్ట్రోనాట్స్ యూరిన్‌.. ఫిల్టర్‌ అయి తమ మిషెన్‌లో ఉన్న డ్రింకింగ్‌ వాటర్‌లో ట్యాంక్‌ లోకి వెళ్లిపోతుంది. ఇలా స్పేస్‌లో ఏవి వేస్ట్‌ చేయ్యారు.ఇక భూమి మీద మనం ఉదయాన్నే ఎలాగైతే బ్రేక్‌ ఫాస్ట్‌ చేస్తామో.. అదే విధంగా ఆస్ట్రోనాట్స్‌ కూడా స్పేస్‌లో బ్రేక్‌ ఫాస్ట్‌ చేస్తారు. కానీ వాళ్లు అప్పటికప్పుడు కుక్‌ చేసుకుని తినేంత ఛాన్స్‌ ఉండదు. భూమి మీద నుంచే వెళ్లేటప్పుడే తినే ఆహారం వీరి వెంట తీసుకెళ్తారు. వీళ్లు తినే ఫుడ్‌ చాలా రోజుల నిల్వ ఉండేలా రెడీ చేస్తారు. కేవలం జపాన్‌ రష్యా అమెరికాలో మాత్రమే ఈ ఫుడ్‌ను రెడీ చేస్తారు. వీటిలో మరీ ముఖ్యంగా గుడ్డు, మాంసహారం ఎక్కువ ఉండే ఆహారం మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక చివరగా ఆస్ట్రోనాట్స్‌ నిద్ర పోవడం ఎలా అంటే.. ప్రతి రోజు రాత్రి 9గంటల నుంచి లేదా 10గంటల ప్రాంతంలో పడుకుంటారు. ఒక్కో ఆస్ట్రోనాట్‌ ఒక్కో స్లీపింగ్‌ పాడ్ ఉంటుంది. కేవలం అందులోనే వాళ్లు పడుకుంటారు. అలాగే ఆ స్లీపింగ్‌ పాడ్‌లో వాళ్ల యొక్క పర్సనల్‌ థింగ్స్‌ ఉంటాయి. అయితే ఇక్కడ ఇంకో విచిత్రం ఏమిటంటే.. స్పేస్‌ ఆస్ట్రోనాట్స్‌ తిన్నగా పడుకున్న లేదా రివర్స్‌లో పడుకున్న వారికి ఎలాంటి డిఫరెన్స్‌ కనిపించదు. ఇలా స్పేస్‌లో ప్రతిదీ ఓ అద్భుతమనే చెప్పాలి. ఆస్ట్రోనాట్స్‌ గురించి ఇన్ని ఇంట్రెస్టింగ్‌ విషయాలు తెలుసుకున్న తర్వాత ఇలాంటి అనుభూతిని పొందాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. ఇలాంటి వారి కోసం కొన్ని ప్రైవేట్‌ సంస్థలు స్పేస్‌లో వెళ్లే జెట్స్‌తో టూరిజంను ప్రారంభించి, సక్సెస్‌ఫుల్‌గా వెళ్లి కూడా వచ్చాయి. కానీ ఇలా స్పేస్‌లోకి వెళ్లి రావడం అనేది మాత్రం చాలా డబ్బుతో కూడుకున్న విషయం.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu