WhatsApp Accounts Ban: వాట్సాప్‌ సంచలన నిర్ణయం.. 17.5 లక్షల అకౌంట్లు బ్యాన్‌.. కారణం ఏంటంటే..!

WhatsApp Accounts Ban: వాట్సాప్‌.. ఈ యాప్‌ లేనిది ఏ స్మార్ట్‌ఫోన్‌ ఉండదు. ఉదయం లేచింది నుంచి రాత్రి పడుకోబోయే వరకు వాట్సాప్‌లోని మునిగి తేలుతుంటారు చాలా మంది..

WhatsApp Accounts Ban: వాట్సాప్‌ సంచలన నిర్ణయం.. 17.5 లక్షల అకౌంట్లు బ్యాన్‌.. కారణం ఏంటంటే..!
Follow us
Subhash Goud

|

Updated on: Jan 02, 2022 | 3:53 PM

WhatsApp Accounts Ban: వాట్సాప్‌.. ఈ యాప్‌ లేనిది ఏ స్మార్ట్‌ఫోన్‌ ఉండదు. ఉదయం లేచింది నుంచి రాత్రి పడుకోబోయే వరకు వాట్సాప్‌లోని మునిగి తేలుతుంటారు చాలా మంది. ఇంకా వాట్సాప్‌ గ్రూపులతో ఎంతో మంది బిజీగా ఉంటారు. ఈ మధ్య కాలంలో ఎవరు పడితే వారు వాట్సాప్‌ గ్రూపులు క్రియేట్‌ చేయడం, చాటింగ్‌లు చేయడం పెరిగిపోయింది. ఈ రోజుల్లో వాట్సాప్‌ అంటేనే ఒక వ్యసనంగా మారిపోయింది. ఇక తాజాగా వాట్సాప్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్‌ 2021లో 17.5 లక్షలకుపై వాట్సాప్‌ అకౌంట్లను బ్యాన్‌ చేసినట్లు కంప్లియెన్స్‌ రిపోర్టులో వెల్లడించింది.

ఈ మధ్య కాలంలో వాట్సాప్‌ సంస్థకు భారీ ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అసభ్యకరమైన పోస్టులు, ఇతర కంటెంట్లపై ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ సమయంలో సంస్థకు 602 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపింది. వాట్సాప్‌ తాజాగా సమర్పించిన రిపోర్టులో ఈ విషయాన్ని వెల్లడించింది. నిబంధనలు ఉల్లంఘిస్తున్న భారత్‌ ఖాతాలను +91 ఫోన్‌ నెంబర్‌ ద్వారా గుర్తించినట్లు తెలిపింది. ఐటీ నిబంధనల ప్రకారం.. గత ఏడాది నవంబర్‌ నెలకు సంబంధించిన రిపోర్టును ప్రకటించామని వాట్సాప్ తెలిపింది. నిబంధనలను ఉల్లంఘిస్తున్న వారి అకౌంట్లను గుర్తించి అకౌంట్ల రద్దు నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. అలాగే కొంత మంది యూజర్లపై వాట్సాప్‌ సొంతంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. వాట్సాప్‌ను సురక్షితంగా ఉంచేందుకు ఈ చర్యలు చేపడుతున్నట్లు తెలిపింది.

అక్టోబర్‌లో 20 లక్షల అకౌంట్లు బ్యాన్‌.. గత ఏడాది అక్టోబర్‌ నెలలో కూడా భారీ ఎత్తున అకౌంట్లను రద్దు చేసింది వాట్సాప్‌ సంస్థ. ఆ నెలలో 500లకుపైగా ఫిర్యాదులు అందినట్లు, దీంతో అకౌంట్లపై ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపింది. నిబంధనలకు విరుద్దంగా కంటెంట్‌ పోస్టు చేయడం, అభ్యకరమైన పోస్టులు చేయడం చేస్తే అలాంటి వాట్సాప్‌ అకౌంట్లను రద్దు చేస్తామని హెచ్చరించింది.

దేశ వ్యాపత్ంగా 40 కోట్లకుపైగా యూజర్లు.. ఇక దేశ వ్యాప్తంగా 40 కోట్లకుపై వాట్సాప్ యూజర్లు ఉన్నారు. రద్దు అయిన అకౌంట్ల ద్వారా యూజర్లు బల్క్‌ మెసేజ్‌లు పుంపుతున్నట్లు గుర్తించామని వాట్సాప్‌ తెలిపింది. గత ఏడాది మే నెల నుంచి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త ఐటీ నిబంధనలు అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాట్సాప్‌ అకౌంట్లపై చర్యలు చేపట్టింది సంస్థ.

ఇవి కూడా చదవండి:

WhatsApp Pay: వాట్సాప్‌లో బ్యాంకు బ్యాలెన్స్‌ చెక్‌ చేసుకోవాలా..? ఇలా చేయండి..!

c VIGIL: ఈ విషయం మీకు తెలుసా? ఎన్నికల్లో అక్రమాలకు చెక్ చెప్పే యాప్ ఒకటి ఉంది..దీని గురించి తెలుసుకోండి!