- Telugu News Photo Gallery Technology photos Motorola Launching Motorola Edge X30 Smartphone. Have a look on features
Motorola Edge X30: భారత మార్కెట్లోకి మోటరోలా నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు ఎలా ఉన్నాయో చూశారా.?
Motorola Edge X30: మోటరోలో తాజాగా భారత మార్కెట్లోకి మరో స్మార్ట్ ఫోన్ విడుదల చేయనుంది. మోటో ఎడ్జ్ ఎక్స్ 30 పేరుతో లాంచ్ చేయనున్న ఈ స్మార్ట్ ఫోన్ త్వరలోనే అందుబాటులోకి రానుంది..
Updated on: Jan 02, 2022 | 1:14 PM

ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం మోటరోలా భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. మోటో ఎడ్జ్ ఎక్స్ 30 పేరుతో లాంచ్ చేయనున్న ఈ స్మార్ట్ ఫోన్ జనవరి చివరి లేదా ఫిబ్రవరిలో అందుబాటులోకి రానుంది.

ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. ఈ స్మార్ట్ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ఎస్ఓసీ ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. ఇందులో 6.8 ఇంచెస్ ఫుల్‌హెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు.

12జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్‌లో తీసుకొచ్చిన ఈ ఫోన్ ధరపై క్లారిటీ రావాల్సి ఉంది.

కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 50 మెగాపిక్సెల్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.

వీటితోపాటు 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ v5.2, యూఎస్బీ టైప్ సీ పోర్ట్‌ని అందించారు. ఈ ఫోన్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది. దీనిలో 68W టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇచ్చే 5,000mAh బ్యాటరీని ఇచ్చారు.




