AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

c VIGIL: ఈ విషయం మీకు తెలుసా? ఎన్నికల్లో అక్రమాలకు చెక్ చెప్పే యాప్ ఒకటి ఉంది..దీని గురించి తెలుసుకోండి!

వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను సకాలంలో నిర్వహిస్తామని ఎన్నికల సంఘం గురువారం విలేకరుల సమావేశంలో తెలిపింది. ఎన్నికల సమయంలో ప్రజలు' సి విజిల్' (cVIGIL) యాప్‌ను ఉపయోగించాలని కమిషన్‌ సూచించింది.

c VIGIL: ఈ విషయం మీకు తెలుసా? ఎన్నికల్లో అక్రమాలకు చెక్ చెప్పే యాప్ ఒకటి ఉంది..దీని గురించి తెలుసుకోండి!
C Vigil App
KVD Varma
|

Updated on: Dec 31, 2021 | 9:09 AM

Share

c VIGIL: వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను సకాలంలో నిర్వహిస్తామని ఎన్నికల సంఘం గురువారం విలేకరుల సమావేశంలో తెలిపింది. ఎన్నికల సమయంలో ప్రజలు’ సి విజిల్’ (cVIGIL) యాప్‌ను ఉపయోగించాలని కమిషన్‌ సూచించింది. ఎన్నికల్లో అవకతవకలు జరిగితే ప్రజలు దీని ద్వారా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని ఎన్నికల కమిషన్ చెబుతోంది. ఈ యాప్‌ను కమిషన్ 3 సంవత్సరాల క్రితం 2019లో ప్రారంభించింది. అసలు ‘ సి విజిల్’ (cVIGIL) యాప్ అంటే ఏమిటి? అదెలా పనిచేస్తుంది తెలుసుకుందాం.

సి-విజిల్ యాప్ అంటే ఏమిటి?

ఎన్నికల్లో అక్రమాలను నిరోధించేందుకు ఎన్నికల సంఘం సీ-విజిల్ యాప్‌ను రూపొందించింది. ఈ యాప్ సహాయంతో ఓటర్లు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై ఫిర్యాదు చేయవచ్చు. ఈ యాప్ అందరు ఆండ్రాయిడ్ .. ఐఓఎస్ వినియోగదారుల కోసం సిద్ధం చేశారు. యాప్‌పై ఫిర్యాదు చేయడానికి, వినియోగదారు స్మార్ట్‌ఫోన్ కెమెరా..GPSకి యాక్సెస్ కలిగి ఉండాలి. ఎన్నికల సంఘం ఈ యాప్‌ను గత 3 సంవత్సరాలుగా అన్ని రకాల ఎన్నికల్లో ఉపయోగిస్తోంది.

సి-విజిల్ ఎన్నికలను పారదర్శకంగా చేస్తుంది

  • ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిన రాష్ట్రం. అక్కడి ప్రజలు ఈ యాప్‌ను ఉపయోగించుకోవచ్చు.
  • ఎన్నికల కమిషన్ ప్రకారం, ఎన్నికల తేదీలను ప్రకటించినప్పటి నుండి ఓటింగ్ ముగిసే వరకు, ఎవరైనా తన ఫిర్యాదును సి-విజిల్ యాప్ ద్వారా ఎన్నికల కమిషన్‌కు పంపవచ్చు.
  • ప్రవర్తనా నియమావళి సమయంలో, నాయకుల తరపున ఎలాంటి అక్రమ పత్రాల పంపిణీ, అవినీతి.. వివాదాస్పద ప్రకటనలు ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.
  • సి-విజిల్ యాప్‌లో ఫిర్యాదుదారుడు అప్‌లోడ్ చేసిన ఏదైనా వీడియో లేదా ఫోటో 5 నిమిషాల్లో స్థానిక ఎన్నికల అధికారికి చేరిపోతుంది.
  • ఫిర్యాదు సరైనదైతే, ఆ సమస్య 100 నిమిషాల్లో పరిష్కరించే అవకాశం ఉంది.
  • మే 2019లో కర్నాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈ యాప్ మొదటిసారి ఉపయోగించచారు. అప్పటి నుంచి ఎన్నికల్లో ఈ యాప్‌ను నిరంతరం ఉపయోగిస్తున్నారు.

సి-విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయడం ఎలా?

c-vigil యాప్ ద్వారా ఎవరికైనా ఫిర్యాదు చేయాలనుకునే వారు. వారు ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. యాప్‌ను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత, మీరు నమోదు చేసుకోవాలి. దీని కోసం, ఫిర్యాదుదారు పేరు, చిరునామా, రాష్ట్రం, జిల్లా, అసెంబ్లీ, పిన్‌కోడ్ వివరాలను ఇవ్వాలి. ఇది OTP సహాయంతో ధృవీకరించబడుతుంది. ఇప్పుడు ఫిర్యాదు చేయడానికి ఫోటో లేదా కెమెరాను ఎంచుకోండి. ఫిర్యాదుదారు యాప్‌లో గరిష్టంగా 2 నిమిషాల వీడియోను అప్‌లోడ్ చేయవచ్చు. ఫోటోలు.. వీడియోలకు సంబంధించిన వివరాల కోసం ఒక బాక్స్ కూడా అందుబాటులో ఉంది, వాటి గురించి రాయవచ్చు.

ఎలక్షన్ కమిషన్ ప్రకారం, అప్‌లోడ్ చేసే ఫోటో లేదా వీడియో, ఆ స్థలం ఎక్కడుందో కూడా తెలుస్తుంది. ఫోటో లేదా వీడియోను అప్‌లోడ్ చేసిన తర్వాత, వినియోగదారుకు ప్రత్యేకమైన ID లభిస్తుంది. దీని ద్వారా వారు మొబైల్‌లోనే ఫాలోఅప్‌ని ట్రాక్ చేయవచ్చు. ఫిర్యాదుదారుడి గుర్తింపు గోప్యంగా ఉంచుతారు. అయితే, మీరు యాప్‌లో ముందుగా రికార్డ్ చేసిన వీడియోలు లేదా ఫోటోలను అప్‌లోడ్ చేయలేరు. ఇది మాత్రమే కాదు, యాప్ నుండి రికార్డ్ చేయసిన వీడియోలు లేదా ఫోటోలు ఫోన్ గ్యాలరీలో సేవ్ అవ్వవు.

ఇవి కూడా చదవండి: Dry List 2022: మద్యం షాపులకు కూడా సెలవులు ఉంటాయని మీకు తెలుసా..? ఏయే రోజుల్లో మూసి ఉంటాయి..!

Omicron: భారత్‌లో ఒమిక్రాన్ తొలి మరణం.. నైజీరియా నుంచి వచ్చాడన్న అధికారులు.. 1200 దాటిన కేసులు..!

Ration Card: రేషన్‌ కార్డు, ఇళ్లు లేనివారికి కేంద్రం గుడ్‌న్యూస్‌.. త్వరలో కొత్త వ్యవస్థ..!