Ration Card: రేషన్‌ కార్డు, ఇళ్లు లేనివారికి కేంద్రం గుడ్‌న్యూస్‌.. త్వరలో కొత్త వ్యవస్థ..!

Ration Card: భారతదేశంలో ఆహార ధాన్యాలను పొందడానికి రేషన్ కార్డు ఎంతో ముఖ్యం.అయితే, రేషన్ కార్డు పొందడానికి అవసరమైన పత్రాలు ఎంతో అవసరం. ఇలాంటి..

Ration Card: రేషన్‌ కార్డు, ఇళ్లు లేనివారికి కేంద్రం గుడ్‌న్యూస్‌.. త్వరలో కొత్త వ్యవస్థ..!
Follow us
Subhash Goud

|

Updated on: Dec 31, 2021 | 6:03 AM

Ration Card: భారతదేశంలో ఆహార ధాన్యాలను పొందడానికి రేషన్ కార్డు ఎంతో ముఖ్యం.అయితే, రేషన్ కార్డు పొందడానికి అవసరమైన పత్రాలు ఎంతో అవసరం. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది నిరాశ్రయులు, నిరుపేదలు చౌకగా లభించే ఆహార ధాన్యాలు పొందడం లేదు. అలాంటి పరిస్థితి దారుణంగా మారింది. రేషన్‌ కార్డులు లేని నిరాశ్రయులు, నిరుపేదలు సబ్సిడీ ఆహార ధాన్యాల ప్రయోజనాలను కూడా పొందేందుకు వీలుగా వారి డేటాను సేకరించేందుకు కేంద్రం తుది దశలో ఉందని ఆహార కార్యదర్శి సుధాన్షు పాండే తెలిపారు.

కొత్త వ్యవస్థ ఎందుకు అవసరం? నిరాశ్రయులు, నిరుపేదలకు సొంత గుర్తింపు కార్డులు లేవని, ఇళ్ల స్థలాలు కూడా లేవని ఆయన అన్నారు. దీంతో వారి పేరున రేషన్‌ కార్డులు లేకపోవడంతో ఆహారం కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. అలా వారి వివరాలను కేంద్ర ప్రభుత్వం కొత్త వ్యవస్థను తీసుకువచ్చి వివరాలను సేకరిస్తోందని వెల్లడించారు. జనాభాలోని ఈ వర్గాన్ని పథకం పరిధిలోకి తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ఇలాంటి వారిని గుర్తించే ప్రక్రియ చివరి దశలో ఉందని, త్వరలోనే వారి వివరాలు సేకరించి రేషన్‌ కార్డులు, ఇళ్ల స్థలాలను అందజేస్తామని తెలిపారు. రేషన్‌ కార్డులు, ఇళ్ల స్థలాలు లేక నిరాశ్రయులైన వారిని గుర్తించేందుకు రేషన్ కార్డులు లేని నిరేపేదలను గుర్తించేందుకు కొత్త వ్యవస్థ తీసుకువస్తున్నట్లు చెప్పారు. వారికి గుర్తింపు లేకపోవడం, ఇంటి చిరునామా లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వాలు వారికి రేషన్‌కార్డులు ఇవ్వలేదని, ఇళ్లు లేని నిరుపేదలకు సంబంధించిన ఈ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని చెప్పారు.

81 కోట్ల మందికి రేషన్‌ ప్రస్తుతం జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ) కింద రేషన్‌కార్డులు ఉన్న 81 కోట్ల మందికిపైగా ప్రజాపంపిణీ వ్యవస్థ (పిడిఎస్) ద్వారా ప్రభుత్వం కిలోకు రూ.1-3 చొప్పున రేషన్‌ అందుతోందని అన్నారు. సబ్సిడీ ఆహార ధాన్యాలు కాకుండా, మహమ్మారి సమయంలో ప్రభుత్వం ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (PMGKAY) కింద NFSA లబ్ధిదారులకు ఉచిత ఆహార ధాన్యాలను సరఫరా చేస్తోంది. ఈ పథకం అనేక సార్లు పొడిగించబడింది. ఇప్పుడు మార్చి 2022 వరకు లబ్దిదారులకు ఉచితంగానే రేషన్‌ బియ్యం అందుతుంది. నిరాశ్రయులు గుర్తింపు కార్డు లేదా నివాస చిరునామా లేకపోవడం వల్ల ప్రజలకు రేషన్ కార్డ్ లేదు కాబట్టి వారు NFSA లేదా PMGKAY కిందకు తీసుకువచ్చి సహాయం చేస్తామన్నారు. ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ పరిధిలోకి రాని వ్యక్తులకు పంపిణీ చేయడానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2021-22లో రాష్ట్రాలు 11.21 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను ఎత్తివేసినట్లు కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ అధికారి తెలిపారు.

ఇవి కూడా చదవండి:

IRCTC Tour Package: పర్యటకులకు ఐఆర్‌సీటీసీ గుడ్‌న్యూస్‌.. అదిరిపోయే టూర్‌ ప్యాకేజీ.. పూర్తి వివరాలు

Gold Price: వినియోగదారులకు కొత్త ఏడాదిలో బంగారం ధరలు షాకివ్వనున్నాయా..? కారణం ఏమిటి..?