RBI Recruitment 2022: ఆర్‌బీఐలో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవచ్చంటే?
RBI Specialist Officer 2022: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అధికారిక వెబ్‌సైట్ rbi.org.inలో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను త్వరలో విడుదల కానుంది.
RBI SO Recruitment 2022: బ్యాంకులో ఉద్యోగం చేయాలనుకునే యువతకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)ఒక సువర్ణావకాశం రానుంది. rbi.org.inలో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల కానుంది. మీడియా నివేదికల ప్రకారం, RBI SO రిక్రూట్‌మెంట్ 2022 కోసం దరఖాస్తు ప్రక్రియ 15 జనవరి 2022 నుంచి ప్రారంభమవుతుందని తెలుస్తుంది. అర్హులైన అభ్యర్థులందరూ 4 ఫిబ్రవరి 2022 వరకు ఈ పోస్టులకు దరఖాస్తులు చేసుకోవడానికి చివరి తేదీగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.
అధికారిక సమాచారం ప్రకారం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 14 స్పెషలిస్ట్ ఆఫీసర్లను నియమించనున్నారు. ఇందులో లా ఆఫీసర్ గ్రేడ్ బి 2, మేనేజర్ (టెక్నికల్-సివిల్) 6 పోస్టులు, మేనేజర్ (టెక్నికల్-ఎలక్ట్రికల్) 3 పోస్టులు, లైబ్రరీ ప్రొఫెషనల్ (అసిస్టెంట్ లైబ్రేరియన్) గ్రేడ్ ఎ 1, ఆర్కిటెక్ట్ గ్రేడ్ ఎ 1, టైమ్ క్యూరేటర్ 1 పోస్ట్‌పై పూర్తి రిక్రూట్‌మెంట్ చేయనున్నారు. మరిన్ని వివరాల కోసం, అభ్యర్థులు బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌ను తనిఖీ చేస్తూ ఉంండాలని పేర్కొంది.
ఆన్‌లైన్ పరీక్ష ఆధారంగా ఆర్‌బీఐలోని స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ రిక్రూట్‌మెంట్ పరీక్ష 6 మార్చి 2022న నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. విద్యార్హత, వయోపరిమితితో సహా ఇతర సమాచారం కోసం, అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి నోటిఫికేషన్ విడుదల వరకు వేచి ఉండాలి. ఆసక్తి ఉన్న, అర్హత ఉన్న అభ్యర్థులందరూ RBI స్పెషలిస్ట్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ 2022 కోసం 15 జనవరి 2022 నుంచి 4 ఫిబ్రవరి 2022 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇవ్వనున్నారు.