CAT 2021 Results: క్యాట్ 2021 ఫలితాలు వచ్చేశాయి.. 9 మందికి 100 శాతం.. రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి..
CAT 2021 Results: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎమ్) అహ్మదాబాద్ సోమవారం క్యాట్ 2021 ఫలితాలను విడుదల చేసింది. పరీక్షకు హాజరైన వారిలో 9 మంది 100 శాతం మార్కులను సాధించారు..
CAT 2021 Results: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎమ్) అహ్మదాబాద్ సోమవారం క్యాట్ 2021 ఫలితాలను విడుదల చేసింది. పరీక్షకు హాజరైన వారిలో 9 మంది 100 శాతం మార్కులను సాధించారు. వంద శాతం మార్కులను సాధించిన వారిలో అత్యధికులు మహారాష్ట్రకు చెందిన వారే కావడం విశేషం. తొమ్మిది మందిలో మహారాష్ట్రా (04), ఉత్తర ప్రదేశ్ (02), హర్యానా (01), తెలంగాణ (01), వెస్ట్ బెంగాల్ (01)గా ఉన్నారు.
ఇక క్యాట్ 2021 పరీక్షకు 2 లక్షలకు పైగా అభ్యర్థులు హాజరయ్యారు. దేశంలోని 156 పట్టణాల్లో మొత్తం 438 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక పరీక్షలో అర్హత సాధించిన వారిని తర్వాతి రౌండ్స్ అయిన గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా సీట్లను కేటాయిస్తారు.
ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి..
* ముందుగా ఐఐఎమ్ క్యాట్ అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి.
* అనంతరం ‘క్యాట్ 2021 రిజల్ట్స్’ లింక్‌పై క్లిక్ చేయాలి.
* తర్వాత అప్లికేషన్ నెంబర్‌తో పాటు ఇతర వివరాలను ఎంటర్ చేసి సబ్‌మిట్‌పై నొక్కాలి.
* వెంటనే ఫలితాలు మీ స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ప్రింటవుట్ తీసుకోవాల్సి ఉంటుంది.
Also Read: OTT Movies: మూవీ లవర్స్‌కి అదిరిపోయే న్యూస్.. ఓటీటీ వేదికగా ఒకే నెలలో మూడు భారీ చిత్రాలు..
Viral Video: బిల్డింగ్ నుంచి కిందపడుతున్న చిన్నారిని ప్రాణాలకు తెగించి కాపాడుకున్న తల్లి..
Ayodhya: రామ జన్మభూమి రూపురేఖలు మార్చనున్న కేంద్రం.. సాంస్కృతిక రాజధానిగా అయోధ్య