OTT Movies: మూవీ లవర్స్‌కి అదిరిపోయే న్యూస్‌.. ఓటీటీ వేదికగా ఒకే నెలలో మూడు భారీ చిత్రాలు..

OTT Movies: మూవీ లవర్స్‌కి అదిరిపోయే న్యూస్‌.. ఓటీటీ వేదికగా ఒకే నెలలో మూడు భారీ చిత్రాలు..
Ott Movies

OTT Movies: ప్రస్తుతం ఓటీటీ మార్కెట్ భారీగా పెరిగిపోతోంది. కరోనా నేపథ్యంలో కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీలో విడుదలవుతుండగా మరికొన్ని చిత్రాలు థియేటర్లలోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లలో విడుదలవుతున్నాయి...

Narender Vaitla

|

Jan 03, 2022 | 5:35 PM

OTT Movies: ప్రస్తుతం ఓటీటీ మార్కెట్ భారీగా పెరిగిపోతోంది. కరోనా నేపథ్యంలో కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీలో విడుదలవుతుండగా మరికొన్ని చిత్రాలు థియేటర్లలోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లలో విడుదలవుతున్నాయి. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ సంస్థల మధ్య పెరుగుతోన్న పోటీ కారణంగా పెద్ద మొత్తానికి సినిమాల డిజిటల్‌ హక్కులను కొనుగోలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే మూవీ లవర్స్‌కి జనవరి నెలలో ఫుల్‌ మీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించేందుకు ఓటీటీ వేదికలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది థియేటర్లలో విడుదలైన మూడు భారీ చిత్రాలు జనవరిలోనే ఓటీటీ వేదికగా రానున్నట్లు సమాచారం.

వీటిలో ఒకటి అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ చిత్రంలో తెరకెక్కిన పుష్ప. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కన ఈ సినిమా రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. పాన్‌ ఇండియా చిత్రంగా విడుదలైన ఈ సినిమా ఒక్క తెలుగులోనే కాకుండా అన్ని భాషల్లోనూ మంచి టాక్‌ను సొంతం చేసుకొంది. ఇక ఈ సినిమా డిజిటల్‌ హక్కులను అమేజాన్‌ ప్రైమ్‌ భారీ మొత్తానికి సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం అమేజాన్‌ ప్రైమ్‌ ఈ చిత్రాన్ని జనవరి 14న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ నెలలో ఓటీటీలో రానున్నట్లు చర్చ జరుగుతోన్న మరో చిత్రం అఖండ. కరోనా పరిస్థితుల తర్వాత పెద్ద విజయంగా పేరు తెచ్చుకున్న ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన హ్యాట్రిక్‌ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అఖండ హాట్‌స్టార్‌ ఓటీటీలో ఇదే నెలలోనే విడుదల కానుంది. ఇక ఓటీటీలో విడుదల కానున్న మరో చిత్రం పెళ్లి సందడి. శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. హాట్‌స్టార్‌ వేదికగా ఈ సినిమా జనవరి 14న విడుదల కానున్నట్లు తెలుస్తోంది. అయితే వీటిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Also Read: JP Nadda: బండి సంజయ్ దీక్షను చూసి కేసీఆర్ ప్రభుత్వం భయపడింది.. అరెస్ట్ ఖండిస్తున్నామన్న జేపీ నడ్డా

Astro Tips: ప్రతిరోజూ ఉదయం మీరు ఇలా మొదలు పెట్టండి.. ఆనందం, సంతోషం, సక్సెస్ మీ వెంటే..

Anasuya Bharadwaj: ఎట్రాక్ట్ చేస్తున్న రంగమ్మ అత్త లేటెస్ట్ ఫోటోస్

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu