AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa: నెట్టింట్లో బన్నీ మేనియా..  అమెజాన్ ప్రైమ్‏లో పుష్ప.. స్ట్రీమింగ్ డేట్ ఇదేనంటూ.. 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం పుష్ప. ఇటీవల విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్

Pushpa: నెట్టింట్లో బన్నీ మేనియా..  అమెజాన్ ప్రైమ్‏లో పుష్ప.. స్ట్రీమింగ్ డేట్ ఇదేనంటూ.. 
Rajitha Chanti
|

Updated on: Jan 03, 2022 | 9:38 PM

Share

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం పుష్ప. ఇటీవల విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. థియేటర్లలో ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అల్లు అర్జున్ నటనకు.. సుక్కు మేకింగ్ అదిరిపోయిందంటూ ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో పక్కా మాస్ క్యారెక్టర్ లో కనిపించి మెప్పించాడు బన్నీ. పుష్ప రాజ్ పాత్రలో అదరగొట్టారు బన్నీ. పాన్ ఇండియా లెవల్లో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి పార్ట్ పుష్ప.. ది రైజ్ పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చి రికార్డ్స్ సృష్టిస్తోంది.

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే రూ. 300 కోట్ల ట్రేడ్ మార్క్‏ను దాటేసి విజయవంతంగా దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా గురించి మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. జక్కన్న తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం జనవరి 7న రావాల్సి ఉంది. కానీ ఓమిక్రాన్, కరోనా కేసులు పెరుగుతుండడం… తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్స్ వివాదం నడుస్తుండడంతో ఆర్ఆర్ఆర్ సినిమాను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. దీంతో ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మెగా అభిమానులకు నిరాశే ఎదురైంది. ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్ విడుదల కావాల్సిన తేదీనే పుష్ప సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‏లో స్ట్రీమింగ్ కానున్నట్లుగా నెట్టింట్లో టాక్ నడుస్తోంది. ఆర్ఆర్ఆర్ రావాల్సిన జనవరి 7ను క్యాష్ చేసుకోవడానికి ఓటీటీలో పుష్ప రాజ్ సందడి చేయనున్నాడని టాక్ నడుస్తోంది. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రాలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఇప్పుడు పుష్ప రాజ్ మేనియా నడుస్తోంది.

Also Read: Kajal Aggarwal: తొలిసారి బేబి బంప్‏తో కనిపించిన కాజల్.. సోషల్ మీడియాలో ఫోటోస్ వైరల్..

Follow Us
రైతులకు అలర్ట్‌.. పీఎం కిసాన్‌ 24వ విడత ఎప్పుడు వస్తుందో తెలుసా?
రైతులకు అలర్ట్‌.. పీఎం కిసాన్‌ 24వ విడత ఎప్పుడు వస్తుందో తెలుసా?
ఓటీటీని శాసిస్తున్న సినిమా..
ఓటీటీని శాసిస్తున్న సినిమా..
ఎన్నాళ్లు ఇలా అపోహల్లో ఉంటారు.. వానాకాలంలో పెరుగు తింటే జరిగేదిదే
ఎన్నాళ్లు ఇలా అపోహల్లో ఉంటారు.. వానాకాలంలో పెరుగు తింటే జరిగేదిదే
ఎలక్ట్రిక్ బైక్ కొంటున్నారా..? కేంద్రం నుంచి శుభవార్త
ఎలక్ట్రిక్ బైక్ కొంటున్నారా..? కేంద్రం నుంచి శుభవార్త
సచిన్ రికార్డు తుడిచేసిన వైభవ్.. ఆ విషయంలో బుడ్డోడి క్రేజ్ చూస్తే
సచిన్ రికార్డు తుడిచేసిన వైభవ్.. ఆ విషయంలో బుడ్డోడి క్రేజ్ చూస్తే
పూరి కూతురిలో అద్భుతమైన టాలెంట్.. ఫోటోస్ చూస్తే..
పూరి కూతురిలో అద్భుతమైన టాలెంట్.. ఫోటోస్ చూస్తే..
త్రివర్ణ జెండా ఎగురవేస్తున్నారా..? ఈ తప్పులు చేస్తే జైలుకే!
త్రివర్ణ జెండా ఎగురవేస్తున్నారా..? ఈ తప్పులు చేస్తే జైలుకే!
కొరడా చేతపట్టి వీధుల్లోకి ప్రభుత్వ బడి టీచర్‌.. అసలు సంగతి ఏమంటే?
కొరడా చేతపట్టి వీధుల్లోకి ప్రభుత్వ బడి టీచర్‌.. అసలు సంగతి ఏమంటే?
ఒకే ఓవర్‌లో 7 సిక్సర్లు.. క్రికెట్ చరిత్రలోనే తొలిసారి ఇలా..
ఒకే ఓవర్‌లో 7 సిక్సర్లు.. క్రికెట్ చరిత్రలోనే తొలిసారి ఇలా..
ఆఫ్ఘాన్ డైరెక్ట్‌గా క్వాలిఫై అయింది.. వెస్టిండీస్ కాలేదు! ఎందుకు?
ఆఫ్ఘాన్ డైరెక్ట్‌గా క్వాలిఫై అయింది.. వెస్టిండీస్ కాలేదు! ఎందుకు?