Sara Ali Khan: దానికి ఒప్పుకుంటేనా పెళ్లి.. కాబోయే వాడికి కండిషన్‌ పెట్టిన బాలీవుడ్‌ బ్యూటీ..

Sara Ali Khan: ఎవరి జీవితంలోనైనా పెళ్లికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. వందేళ్ల జీవితంలో కీలక ఘట్టమైన వివాహం కోసం ఎన్నో కలలు అంటారు. తమ జీవితంలోకి వచ్చే కొత్త వ్యక్తి తమను అర్థం చేసుకోవాలని..

Sara Ali Khan: దానికి ఒప్పుకుంటేనా పెళ్లి.. కాబోయే వాడికి కండిషన్‌ పెట్టిన బాలీవుడ్‌ బ్యూటీ..
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 03, 2022 | 6:27 PM

Sara Ali Khan: ఎవరి జీవితంలోనైనా పెళ్లికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. వందేళ్ల జీవితంలో కీలక ఘట్టమైన వివాహం కోసం ఎన్నో కలలు అంటారు. తమ జీవితంలోకి వచ్చే కొత్త వ్యక్తి తమను అర్థం చేసుకోవాలని కొందరు కోరుకుంటే, తమ అభిరుచులకు తగ్గట్లు ప్రవర్తించాలని మరికొందరు ఆశిస్తుంటారు. మరీ ముఖ్యంగా పుట్టింటి నుంచి మెట్టినిల్లుకు వెళ్లే మహిళలకు వివాహం విషయంలో ఎన్నో కోరికలు ఉంటాయి. అయితే ఇది కేవలం సామాన్యులకే పరిమితం అనుకుంటే పొరబడినట్లే, సెలబ్రిటీలు కూడా తమ వివాహంపై కోటి ఆశలతో ఉంటారు. తాజాగా బాలీవుడ్‌ బ్యూటీ సారా అలిఖాన్‌ తనకు కాబోయే వాడి గురించి చెప్పుకొచ్చింది. అయితే తనను పెళ్లి చేసుకోబోయే వాడు ఒక కండిషన్‌కు ఓకే చెప్పాలని నిబంధన పెట్టింది.

వివరాల్లోకి వెళితే.. సారా అలిఖాన్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా తనకు ఎలాంటి వాడు కావాలనే ప్రశ్నకు సమాధానమిచ్చిన సారా.. తనను పెళ్లి చేసుకునే వ్యక్తి ఇల్లరికం వచ్చేందుకు ఒప్పుకోవాలని కండిషన్‌ పెట్టింది. దీనికిగల కారణాన్ని వివరిస్తూ.. ‘అమ్మే నాకు అన్నీ.. ఆమెతో ఉంటేనే నేను సంతోషంగా ఉంటాను. నేను ఎన్ని పనుల్లో బిజీగా ఉన్న అమ్మతోనే సమయాన్ని గడపటానికి ఇష్టపడతాను. కొన్ని విషయాలు అమ్మను అడిగే నిర్ణయాలు తీసుకుంటా. ఆమె నాకు ఇళ్లు లాంటిది.

ఆమెను వదిలి వెళ్లడం నా వల్ల కాదు. అందుకే భవిష్యత్తులో నేను వివాహం చేసుకునే వ్యక్తి ఇల్లరికం వచ్చేందుకు ఒప్పుకోవాల్సి వస్తుంది’ అంటూ చెప్పుకొచ్చింది. కెరీర్‌ విషయానికొస్తే సారా 2020లో ‘లవ్‌ ఆజ్‌ కల్‌’, ‘కూలీ నెం 1’ చిత్రాల్లో నటించగా, గతేడాది ‘అత్రంగి రే’ సినిమాలో కనిపించింది. ఓటీటీ వేదికగా విడుదలైన ఈ సినిమాలో ధనుష్‌ కూడా నటించిన విషయం తెలిసిందే.

Also Read: Viral Video: ట్రైన్ లోకో ఫైలట్ ఎమర్జెన్సీ బ్రేక్‌.. మోటార్‌మ్యాన్‌పై ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు!

AP: ఆ జిల్లాలో అర్థరాత్రి భయానక క్షుద్రపూజలు.. పంది గొంతు కోసి.. పసుపు, కుంకుమ చల్లి..

Andhra Pradesh: రైతుల ఖాతాల్లో జమ అయిన భరోసా సొమ్ము.. మీకు వచ్చాయో లేదో ఇలా చెక్‌ చేసుకోండి..