AP: ఆ జిల్లాలో అర్థరాత్రి భయానక క్షుద్రపూజలు.. పంది గొంతు కోసి.. పసుపు, కుంకుమ చల్లి..
కరోనా కల్లోలంలోనూ క్షద్రపూజలు ఆగడం లేదు. మహమ్మారికి వ్యాక్సిన్ కనిపెట్టాం కానీ.. ఈ మూఢనమ్మకాలకు ముగింపు పలకలేకపోతున్నాం.
కరోనా కల్లోలంలోనూ క్షద్రపూజలు ఆగడం లేదు. మహమ్మారికి వ్యాక్సిన్ కనిపెట్టాం కానీ.. ఈ మూఢనమ్మకాలకు ముగింపు పలకలేకపోతున్నాం. తాజాగా గుంటూరు జిల్లా అచ్చంపేటలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. అచ్చంపేట-మాదిపాడు ప్రధాన రహదారి తాళ్ళచెరువు అడ్డరోడ్డు వద్ద గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్ళు స్థానికులకు భయాందోళనలకు గురిచేశాయి. భయంకరంగా వరాహాన్ని బలి ఇచ్చి పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, చీర, చాటలతో పూజలు చేశారు. వరాహాన్ని గొంతుకోసి పసుపు, కుంకుమలతో పూజలు చేశారు. ప్రధాన రహదారిపై నిరంతరం వాహనాలు రద్దీ వున్నప్పటికీ పందిని చంపి క్షుద్రపూజలు చేయటంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గతరాత్రి అమావాస్య ఆదివారం కావడంతో.. పూజలు ఎక్కడైనా జరిపి ఇక్కడకు తెచ్చి పడవేశారా అన్న భావన స్థానికుల్లో నెలకొంది. అమావాస్య ఆదివారం రావటంతో క్షుద్ర పూజలు చేసే మంత్రగాళ్ళు రెచ్చిపోయారు. ఆదివారం రోజు వచ్చే అమావాస్యలో పూజలు చేస్తే క్షుద్ర దేవతలు కరుణిస్తారన్న మూఢ నమ్మకాలున్నాయి. ఈ క్రమంలోనే పూజలు చేసినట్లుగా భావిస్తున్నారు.
రిపోర్టర్: టి నాగరాజు, టీవీ9, గుంటూరు.
Also Read: Tollywood: తెలుగు ఇండస్ట్రీ పెద్దగా రామ్ గోపాల్ వర్మ.. నెట్టింట ట్రెండింగ్‌గా ఆ దర్శకుడి ట్వీట్
నదిలో దూకిన లేడీ వాలంటీర్.. పరుగుపరుగన వచ్చి ఆమెను కాపాడిన కౌన్సిలర్.. కానీ