Tollywood: తెలుగు ఇండస్ట్రీ పెద్దగా రామ్ గోపాల్ వర్మ.. నెట్టింట ట్రెండింగ్‌గా ఆ దర్శకుడి ట్వీట్

ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీలో టిక్కెట్ల గోల పీక్స్‌కు చేరింది. దీనిపై పెద్ద చర్చ జరుగుతుండగానే మరో బాంబ్‌ పేల్చారు మెగాస్టార్ చిరంజీవి.

Tollywood: తెలుగు ఇండస్ట్రీ పెద్దగా రామ్ గోపాల్ వర్మ.. నెట్టింట ట్రెండింగ్‌గా ఆ దర్శకుడి ట్వీట్
Ram Gopal Varma
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 03, 2022 | 2:58 PM

ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీలో టిక్కెట్ల గోల పీక్స్‌కు చేరింది. దీనిపై పెద్ద చర్చ జరుగుతుండగానే మరో బాంబ్‌ పేల్చారు మెగాస్టార్ చిరంజీవి. టాలీవుడ్‌లో పెద్దరికం నాకు వద్దు.. ఇండస్ట్రీ సమస్యలపై బాధ్యత తీసుకుంటానంటూ మెగా స్టేట్‌మెంట్ ఇచ్చారు చిరు. దాసరి తర్వాత ఆ లోటు ఎవరూ పూడ్చలేకపోతున్నారు. ఆ బాధ్యత మెగాస్టార్ తీసుకోవాలంటూ టాక్‌ నడుస్తున్న క్రమంలో బిగ్‌ బాంబ్‌ పేల్చారు చిరంజీవి.

మెగాస్టార్ ఇలా బిగ్‌ స్టేట్‌ మెంట్ ఇచ్చారో లేదో సాయంత్రానికి లేఖాస్త్రం సంధించారు డైలాగ్‌ కింగ్ మోహన్ బాబు. ఇండస్ట్రీ అంటే ఏ ఒక్కరి గుత్తాధిపత్యం కాదు. సినీ పరిశ్రమ అంటే నలుగురు హీరోలు, నలుగురు ప్రొడ్యూసర్లు, నలుగురు డిస్ట్రిబ్యూటర్లు కాదు, వేల కుటుంబాలు, జీవితాలని స్పష్టం చేశారు. ఇండస్ట్రీలో సమస్యల గురించి సీఎంలకు వివరించాలంటే అందరూ కూర్చుని మాట్లాడుకోవాలి కానీ, నలుగుర్నే రమ్మన్నారనడం ఏంటని ప్రశ్నించారు. ఇండస్ట్రీలో ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, అందరూ సమానమేనని స్పష్టం చేశారు. నిర్మాతల్ని కలుపుకుని సీఎంల దగ్గరకు వెళ్లి ఉంటే ఈ సమస్యలు వచ్చేవి కావని మోహన్‌బాబు అభిప్రాయపడ్డారు. దీనిపై టాలీవుడ్‌లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో టిక్కెట్ల వివాదంపై చర్చ నడుస్తున్న క్రమంలో తనదైన శైలిలో సెటైర్లు విసిరారు రామ్‌ గోపాల్ వర్మ. సినిమా టిక్కెట్ల వివాదం వెనుక ఒకరిద్దరు హీరోల్ని తొక్కేయాలనే కాన్సెప్ట్‌ ఉందా? ఆంధ్రప్రదేశ్‌ సర్కార్‌ అలాంటి వ్యూహమేదైనా పన్నిందా? అంటే అలాంటి డౌట్‌ ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు ఆర్జీవీ.

ఈ క్రమంలో ఆర్జీవీ శిష్యుడు, ఆర్‌ఎక్స్100, మహాసముద్రం చిత్రాల దర్శకుడు క్రేజీ ట్వీట్ చేశారు. తన బాస్ ( రాంగోపాల్ వర్మ ) ని ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా చూడాలన్నది తన ఆశ అని పేర్కొన్నాడు. ‘సామీ మీరు రావాలి సామీ’ అని రాసుకొచ్చాడు. ఈ ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

Also Read: నదిలో దూకిన లేడీ వాలంటీర్‌.. పరుగుపరుగన వచ్చి ఆమెను కాపాడిన కౌన్సిలర్.. కానీ

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!