AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kajal Aggarwal: తొలిసారి బేబి బంప్‏తో కనిపించిన కాజల్.. సోషల్ మీడియాలో ఫోటోస్ వైరల్..

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో నటించిన లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగులోకి హీరోయిన్‏గా ఎంట్రీ ఇచ్చింది కాజల్.

Kajal Aggarwal: తొలిసారి బేబి బంప్‏తో కనిపించిన కాజల్.. సోషల్ మీడియాలో ఫోటోస్ వైరల్..
Kajal
Rajitha Chanti
|

Updated on: Jan 03, 2022 | 6:48 PM

Share

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో నటించిన లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగులోకి హీరోయిన్‏గా ఎంట్రీ ఇచ్చింది కాజల్. మొదటి సినిమాతోనే మంచి నటన పరంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ చందమామ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఈ మూవీతో ఒక్కసారిగా కాజల్ క్రేజ్ మారిపోయింది. టాలీవుడ్‏లో వరుస సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్‏గా కొనసాగింది. చిరంజీవి, రామ్ చరణ్, ఎన్టీఆర్, నాగార్జున వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ చేసుకుంటూ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది కాజల్. ఇటీవల తన స్నేహితడు గౌతమ్ కిచ్లూని వివాహం చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది కాజల్.

అయితే పెళ్లి తర్వాత కూడా కాజల్ సినిమాలు చేయడం ఆపలేదు. మెగాస్టార్ చిరంజీవి మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో నటించింది. అయితే ఈ సినిమా అనంతరం నాగార్జున ఘోస్ట్ మూవీలో కాజల్ నటించాల్సి ఉంది. కానీ అనుహ్యంగా ఈ మూవీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. దీంతో కాజల్ తల్లి కాబోతుందంటూ నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలపై కాజల్ దంపతులు ఇప్పటివరకు స్పందించలేదు.

Kajal 1

Kajal 1

ఇదిలా ఉంటే.. తాజాగా నూతన సంవత్సరం వేళ కాజల్ అగర్వాల్ భర్త గౌతమ్ కిచ్లూ ఈ విషయాన్ని తెలియజేశారు. ఆయన తన ఇన్ స్టాలో షేర్ చేసిన కాజల్ ఫోటోస్ షేర్ చేస్తూ.. అందుకు గర్భం దాల్చిన మహిళ ఎమోజీని షేర్ చేశారు. దీంతో కాజల్ ప్రెగ్నెంట్ విషయంలో క్లారిటీ ఇచ్చేశారు. తాజాగా.. కాజల్ తన భర్త గౌతమ్ కిచ్లుతో సముద్రం ఒడ్డున నడుస్తున్న ఫోటోస్ షేర్ చేసుకుంది. ప్రతి విజయవంతమైన వ్యక్తి వెనక అతని భార్య ఉంది.. ఫోటోస్ తీయడం అంటూ క్యాప్షన్ ఇచ్చింది. కాజల్ షేర్ చేసిన ఫోటోలో ఆమె బేబి బంప్ క్లారిటీగా కనిపిస్తుంది. దీంతో కాజల్ ఫోటోస్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

Also Read: Sara Ali Khan: దానికి ఒప్పుకుంటేనా పెళ్లి.. కాబోయే వాడికి కండిషన్‌ పెట్టిన బాలీవుడ్‌ బ్యూటీ..

Ram Gopal Varma: ఏపీలో సినిమా టికెట్ రేట్లపై వర్మ ఒపీనియన్.. ఈ రోజు బిగ్ న్యూస్ బిగ్ డిబేట్‌లో.. డోంట్ మిస్

OTT Movies: మూవీ లవర్స్‌కి అదిరిపోయే న్యూస్‌.. ఓటీటీ వేదికగా ఒకే నెలలో మూడు భారీ చిత్రాలు..