Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astro Tips: ప్రతిరోజూ ఉదయం మీరు ఇలా మొదలు పెట్టండి.. ఆనందం, సంతోషం, సక్సెస్ మీ వెంటే..

Astro Tips: ప్రతి మనిషి జీవితం మంచి, చెడు, సుఖం, దుఃఖం అన్ని కలగలిపి ఉంటాయి. అయితే ప్రతి ఒక్కరూ తాము ఈరోజుని సంతోషంగా మొదలు పెట్టాలని.. ఏ పని తలపెట్టినా పూర్తి అవ్వాలని..

Astro Tips: ప్రతిరోజూ ఉదయం మీరు ఇలా మొదలు పెట్టండి.. ఆనందం, సంతోషం, సక్సెస్ మీ వెంటే..
Vastu Tips
Follow us
Surya Kala

|

Updated on: Jan 03, 2022 | 2:44 PM

Astro Tips: ప్రతి మనిషి జీవితం మంచి, చెడు, సుఖం, దుఃఖం అన్ని కలగలిపి ఉంటాయి. అయితే ప్రతి ఒక్కరూ తాము ఈరోజుని సంతోషంగా మొదలు పెట్టాలని.. ఏ పని తలపెట్టినా పూర్తి అవ్వాలని కోరుకుంటారు. జ్యోతిష్యానికి సంబంధించిన నియమాలను పాటించడం వల్ల జీవితంలో ఆనందం , సంతోషం, సంపద లభిస్తుందని నమ్ముతారు. అయితే రోజూ నిద్ర లేచిన వెంటనే కొన్ని పద్దతులను పాటించాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ పద్దతులను మీరు ఉదయం నిద్రలేచిన వెంటనే  పాటించడం ద్వారా చెడుని నివారించవచ్చు అని అంటున్నారు.. ఆ రెమెడీ గురించి ఈరోజు తెలుసుకోండి…

అరచేయి:  ఉదయం నిద్రలేచిన వెంటనే రెండు అరచేతులను చూడటం వల్ల మేలు జరుగుతుందని పెద్దల నమ్మకం. అరచేతిలో లక్ష్మీదేవి , విష్ణువు యొక్క అనుగ్రహం నిలిచి ఉంటుందని భావిస్తారు.

తల్లిదండ్రులకు నమస్కారం:  తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్నవారికి చెడు దరిచేరదని చెబుతున్నారు. రోజూ తల్లిదండ్రులకు నమస్కరించే పిల్లల పట్ల భగవంతుని అనుగ్రహం నిలిచి ఉంటుందని…  అసంపూర్తిగా ఉన్న పనులు కూడా పూర్తవుతాయని నమ్మకం.

ఆవు-రొట్టె:

ఇంట్లో రోటీలు తయారు చేసే సమయంలో తప్పనిసరిగా ఈ నియమం పాటించండి.. జ్యోతిష్యం ప్రకారం రోటీలు తయారు చేసినప్పుడు మొదటి రోటీని ఎప్పుడూ అవుకు పెట్టండి. అంతేకాదు ఇంటి దగ్గరకు ఆవు వచ్చినప్పుడల్లా శక్తి కొలదీ ఆహారం పెట్టండి.

సూర్య భగవానునికి నమస్కారం:  హిందూ పురాణాలలో ఉదయాన్నే సూర్య భగవానుని ఆరాధించడం చాలా పవిత్రమైనది పేర్కొన్నారు. సూర్యభగవానునికి నమస్కారాలు చేయడం ద్వారా రోజంతా శరీరం ఒక శక్తిని కలిగి ఉంటుంది. అంతేకాదు సూర్య నమస్కారం చేయడం వల్ల ఈ రోజు మంచి జరుగుతుందని అంటారు.

పెరుగు- చక్కెర కలిపి తినండి: ఆఫీసుకి లేదా ఏదైనా ముఖ్యమైన పని కోసం ఉదయం ఇంటి నుండి బయటకు వెళుతున్నట్లయితే.. ఖచ్చితంగా చక్కర కలిపిన పెరుగుని తిని వెళ్ళండి. ఇలా చేయడం వలన చెడు దరిచేరదని.. కొత్త అవకాశాలు వస్తాయని.. చేపట్టిన పనిలో సక్సెస్ అందుకుంటారని పెద్దల నమ్మకం.

Also Read:  మోహన్ బాబు గారు మీ వెంటే మేమంతా.. పెద్దరాయుడికి మద్దతుగా నిర్మాత సి. కళ్యాణ్