Vastu Tips: ఇంట్లో పూజ గది ఏర్పాటులో ఈ నియమాలు పాటించండి.. సంపద, సంతోషం మీ సొంతం..
Vastu Tips: కొత్త సంవత్సరం వచ్చింది. ప్రతి ఒక్కరి జీవితం ఆనందం, సంతోషం నిండి ఉండాలని అందరం కోరుకుంటాం. నూతన సంవత్సరం సందర్భంగా .. చాలామంది తమ ఇంట్లో వాస్తు..
Vastu Tips: కొత్త సంవత్సరం వచ్చింది. ప్రతి ఒక్కరి జీవితం ఆనందం, సంతోషం నిండి ఉండాలని అందరం కోరుకుంటాం. నూతన సంవత్సరం సందర్భంగా .. చాలామంది తమ ఇంట్లో వాస్తు ప్రకారం ఏ వస్తువులుండాలి.. అనే విషయంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు.. ఎందుకంటే వాస్తు దోషం జీవితంలో ఇలాంటి అనేక సమస్యలను తెస్తుంది. అనేక ఇబ్బందులు పెడుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో దేవుడికి గుడికి సంబంధించి అనేక విషయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. నిజానికి.. ఇంట్లో పూజ గది అంటే.. మనసుకి ఆందోళలన నుంచి ఉపశమనం ఇచ్చే ప్రదేశం. ఇంట్లో ఉండే ఈ పవిత్ర స్థలం గురించి కొన్ని నియమాలు ఉన్నాయి. వీటిని అనుసరించడం ద్వారా మనశ్శాంతి, శక్తిని అందిస్థాయి. దైవిక అనుగ్రహం లభిస్తుంది. కనుక ఇంట్లోని దేవతలకు పూజలు చేసేటప్పుడు మనం పాటించాల్సిన కొన్ని వాస్తు నియమాల గురించి తెలుసుకుందాం..
దిశ వాస్తు శాస్త్రం ప్రకారం.. ఈశాన్యం దిక్కు శుభప్రదం. కనుక ఇంట్లో దేవుడి గది ఎప్పుడూ ఇంట్లో ఈశాన్య దిశలో ఉండాలి.
దేవుని విగ్రహం చాలామంది దేవుడి గదిలో అనేక దేవుడి పటాలను, విగ్రహాలను ఏర్పాటు చేస్తారు. అయితే ఆలా అధికంగా దేవుడి విగ్రహాలను ఏర్పటు చేయడం వలన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక పూజ గదిలో ఫ్యామిలీకి సంబంధించిన కుల దైవం పటాలను, ఇష్టదైవాన్ని పెట్టుకుంటే చాలు.
విరిగిన విగ్రహం పొరపాటున కూడా విరిగిన లేదా విరిగిన విగ్రహాన్ని ఆలయంలోనే ఉంచి పూజాదికార్యక్రమాలను నిర్వహించకూడదు. ఇలా విరిగిన విగ్రహానికి పూజ చేస్తే.. ఇంట్లో కలహాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అలాంటి విగ్రహాలను నదుల్లో వేయాలి.
శంఖం: వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిలోని పూజ గదిలో రెండు శంఖాలు ఉండకూడదు.
భారీ విగ్రహం: కొత్త సంవత్సరం సందర్భంగా ఇంటిలోని పూజ గదిలో భారీ విగ్రహాలను పూజ కోసం ఏర్పాటు చేసుకోకూడదు. అలా పెద్ద విగ్రహాలను ఇంట్లో పెట్టడం మంచిది కాదని నమ్మకం.
Also Read: