Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayodhya: రామ జన్మభూమి రూపురేఖలు మార్చనున్న కేంద్రం.. సాంస్కృతిక రాజధానిగా అయోధ్య

Ayodhya: భారత్ కు స్వాతంత్య్రం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే లోపులో రామ మందిర నిర్మాణంతో పాటు అయోధ్యను ప్రపంచ సాంస్కృతిక రాజధానిగా తీర్చిదిద్దాలనే ప్రధాని మోడీ ఆశయం...

Ayodhya: రామ జన్మభూమి రూపురేఖలు మార్చనున్న కేంద్రం.. సాంస్కృతిక రాజధానిగా అయోధ్య
Ayodhya
Follow us
Surya Kala

|

Updated on: Jan 03, 2022 | 3:55 PM

Ayodhya: భారత్ కు స్వాతంత్య్రం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే లోపు రామ మందిర నిర్మాణంతో పాటు అయోధ్యను ప్రపంచ సాంస్కృతిక రాజధానిగా తీర్చిదిద్దాలనే ప్రధాని మోడీ ఆశయం. బీజేపీ కలను సాకారం చేసుకునే దిశగా అడుగులు వేయడం మొదలైంది. హిందుస్థాన్ టైమ్స్ నివేదిక ప్రకారం.. కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ తన మంత్రిత్వ శాఖ అయోధ్య అభివృద్ధి కోసం 20 వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టుల ప్రతిపాదనను సిద్ధం చేశారు.

ఇటీవల 84 కోసి పరిక్రమ మార్గ్ జాతీయ రహదారి హోదాను పొందింది. అంతే కాదు నాలుగు వేల కోట్లతో 275 కి.మీ మేర హైవే నిర్మాణానికి ఆమోదం కూడా లభించింది. దీంతో పాటు పది వేల కోట్లతో అయోధ్య మీదుగా గోరఖ్‌పూర్-లక్నో జాతీయ రహదారిని ఆరు లేన్లగా మార్చే ప్రాజెక్టుకు కూడా గ్రీన్ సిగ్నల్ లభించింది. దీంతోపాటు ఇప్పుడు బైపాస్ రోడ్డుగా  సుమారు 70 కిలోమీటర్ల రింగ్ రోడ్డ నిర్మాణానానికి ఆరు వేల కోట్లతో ఆమోదం తెలిపింది. దీనికి జనవరి 6న కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి గడ్కరీ శంకుస్థాపన చేయనున్నారు.

నాలుగు రైల్వే ఓవర్‌బ్రిడ్జిలు, సరయూ నదిపై రెండు వంతెనలు, ఐదు ప్రధాన రహదారులు నిర్మించనున్నారు అయోధ్య, బస్తీ,  గోండా మూడు జిల్లాల మీదుగా 70 కి.మీ రింగ్ రోడ్డు వెళ్లనుంది. దీని డీపీఆర్‌ను అహ్మదాబాద్‌కు చెందిన కంపెనీ తయారు చేసింది. సేకరించిన భూమికి పరిహారం కూడా ఇవ్వనున్నారు.

ఎంపీ లల్లూ సింగ్ ఇదే విషయంపై స్పందిస్తూ… నాలుగు రైల్వే ఓవర్‌బ్రిడ్జిలు, సరయూ నదిపై రెండు వంతెనలు, ఐదు ప్రధాన రహదారులు నిర్మించాల్సి ఉందని చెప్పారు. ఈ బైపాస్‌తో కనెక్టివిటీ మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. ఆధ్యాత్మిక పర్యాటకం ప్రాంతంగా ఖ్యాతిగాంచుతుందని… అటు వ్యాపారవేత్తలు కూడా లాభపడతారని అన్నారు.

275 కి.మీ పొడవు 84 కోసి పరిక్రమ మార్గం

అయోధ్యలో సుమారు నాలుగు వేల కోట్ల రూపాయలతో 275 కి.మీ పొడవు 84 కోసి పరిక్రమ మార్గ్‌ను నిర్మించనున్నారు.  దీని కోసం పిడబ్ల్యుడి ఎన్‌హెచ్ వింగ్ ఇప్పటికే సర్వేను పూర్తి చేసింది. పౌరాణిక ప్రాముఖ్యత కలిగిన 51 పుణ్యక్షేత్రాలు ఈ మార్గం ద్వారా అయోధ్యకు అనుసంధానించబడతాయి. ప్రస్తుతం అయోధ్య, అంబేద్కర్ నగర్, గోండా, బారాబంకి, బస్తీల మీదుగా వెళ్లే ఈ పరిక్రమ మార్గం దాదాపు 233 కి.మీ పొడవు ఉంటుంది. ఈ నిర్మాణం కోసం 45 మీటర్ల వెడల్పుతో భూమిని సేకరించనున్నారు. దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. నిజానికి భూ సేకరణ   పనులు 2022 డిసెంబర్ నాటికి పూర్తికావాల్సి ఉంది. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నిర్మించనున్న పరిక్రమ మార్గ్‌ పొడవు 275 కి.మీ.

Also Read:  రోడ్డు పక్కన నిరాశ్రయుడైన వ్యక్తిని కౌగలించుకున్న కుక్క.. నెటిజన్ల మనసు గెలుచుకున్న వీడియో