Lord Hanuman: కోరిన కోర్కెలు తీర్చే అత్యంత మంత్ర శక్తి కలిగిన ఆంజనేయ స్వామి దండకం..
Lord Hanuman: సీతా రాముల దాసునిగా, రామ భక్తునిగా, విజయ ప్రదాతగా, రక్షకునిగా హిందువులతో పూజలను అందుకుంటున్న దేవుడు హనుమంతుడు. దేశవిదేశాల్లో హనుమంతుని గుడి..
Lord Hanuman: సీతా రాముల దాసునిగా, రామ భక్తునిగా, విజయ ప్రదాతగా, రక్షకునిగా హిందువులతో పూజలను అందుకుంటున్న దేవుడు హనుమంతుడు. దేశవిదేశాల్లో హనుమంతుని గుడి , లేదా విగ్రహం లేని ఊరు బహుఅరుదు. నవ వ్యాకరణ పండితుడు. హనుమంతుడు రుద్రాంశ కలవాడైన ఆంజనేయుని పూజిస్తే అందరు దేవతలను పూజించినట్లే. తనను భక్తితో పూజించినవారు కోరిన కోర్కెలు తీర్చే ఆంజనేయస్వామికి ఐదు అంటే అమితమైన ఇష్టం. అందుకనే హనుమంతుడి గుడి చుట్టూ ఐదు ప్రదక్షణలు, ఐదు అరటిపళ్ళు సమర్పించాలని పండితులు చెబుతారు.
కోరిన కోర్కెలు తీర్చే ఆంజనేయ స్వామికి స్తుతిస్తూ శ్రీ ఆంజనేయ దండకం తెలుగునాట చాలా తరాలనుండి ప్రాచుర్యంలో ఉన్నది. ఆంజనేయస్వామివారి మహిమ, సుగుణాలు, సాధించిన ఘనకార్యాలు, రక్షణ, అనుగ్రహం మొదలైనవన్నీ ఈ దండకంలో ఉన్నాయి. మంత్రశక్తి కలిగిన ఈ దండకాన్ని శ్రద్ధగా పారాయణ చేసినవారికి కోరిన కోర్కెలు తీరుస్తుందని భక్తుల నమ్మకం.
శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభా దివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్య మిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబు సాయంత్రమున్ నీ నామసంకీర్తనల్ జేసి నీ రూపు వర్ణించి నీ మీద నే దండకం బొక్కటిన్ జేయ నీ మూర్తిగావించి నీ సుందరం బెంచి నీ దాసదాసుండనై రామభక్తుండనై నిన్ను నేగొల్చెదన్ నీ కటాక్షంభునన్ జూచితే వేడుకల్ చేసితే నా మొరాలించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భాస్వయా దేవ నిన్నెంచ నేనెంతవాడన్ దయాశాలివై జూచితే ధాతవై బ్రోచితే దగ్గరన్ నిల్చితే తొల్లి సుగ్రీవుకున్ మంత్రివై స్వామి కార్యార్దమై యేగి శ్రీరామ సౌమిత్రులన్ జూచి వారిఁవిచారించి సర్వేశు బూజించి యబ్బానుజుం బంటు గావించి యవ్వాలినిన్ జంపించి కాకుత్త్స తిలకున్ దయాదృష్టి వీక్షించి కిష్కిందకేతెంచి శ్రీరామ కార్యార్దమై లంక కేతెంచియున్ లంకినిన్ జంపియున్ లంకనున్ గాల్చియున్ యభ్భుమిజన్ జూచి యానందముప్పొంగి యాయుంగరంబిచ్చి యారత్నమున్ దెచ్చి శ్రీరాముకున్నిచ్చి సంతుష్టునింజేసి సుగ్రీవునిన్ అంగదున్ జాంబవంతాది నీలున్నీలున్ గూడి యాసేతువున్ దాటి వానరుల్మూకలై పెన్మూకలై యా దైత్యులన్ ద్రుంచగా రావణుండంత కాలాగ్ని రుద్రుండుగా వచ్చి బ్రహ్మాండమైనట్టి యా శక్తినివేచి యాలక్ష్మణున్ మూర్చనొందింపగానప్పుడే నీవు సంజీవినిందెచ్చి సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబు రక్షింపగా కుంభకర్ణాదులన్ వీరులంబోర శ్రీరామ బానాగ్ని వారందరిన్ రావనున్ జంపగా నంత లోకంబు లానందమై యుండ నవ్వేళను విభీషణున్ వేడుకన్ దోదుకన్ వచ్చి పట్టాభిషేకంబు చేయించి, సీతామహాదేవినిన్ దెచ్చి శ్రీరాముకున్నిచ్చి, యంతన్నయోద్యాపురింజొచ్చి పట్టాభిషేకంబు సంరంభమైయున్న నీకన్న నాకెవ్వరున్ గూర్మి లేరంచు మన్నించి శ్రీరామభక్త ప్రశస్తంబుగా నిన్ను సేవించి నీ కీర్తనల్ చేసినన్ పాపముల్బాయునే భయములున్ దీరునే భగ్యముల్ గల్గునే సాంరాజ్యముల్ గల్గు సంపత్తులున్ కల్గునో వానరాకార యోభక్త మందార యోపుణ్య సంచార యోధీర యోవీర నీవే సమస్తంబుగా నెంచి యాతారక బ్రహ్మ మంత్రంబు పఠియించుచున్ స్థిరముగన్ వజ్రదేహంబునున్ దాల్చి శ్రీరామ శ్రీరామయంచున్ మనఃపూతమైన ఎప్పుడున్ తప్పకన్ తలతునా జిహ్వయందుండి నీ దీర్ఘదేహంబు తైలోక్య సంచరివై రామ నామాంకితధ్యానివై బ్రహ్మతేజంబునన్ రౌద్రనీజ్వాల కల్లోల హావీర హనుమంత ఓంకార శబ్దంబులన్ భూత ప్రేతంబులన్ బెన్ పిశాచంబులన్ శాకినీ ఢాకినీత్యాదులన్ గాలిదయ్యంబులన్ నీదు వాలంబునన్ జుట్టి నేలంబడంగొట్టి నీముష్టి ఘాతంబులన్ బాహుదండంబులన్ రోమఖండంబులన్ ద్రుంచి, కాలాగ్ని రుద్రండవై బ్రహ్మప్రభా భాసితంభైన నీదివ్యతేజంబునున్ జూచి, రారనాముద్దునరసింహాయంచున్, దయాదృష్టివీక్షించి, నన్నేలు నాస్వామి ! నమస్తే సదా బ్రహ్మచారీ నమస్తే ! వాయుపుత్రా నమస్తే ! నమస్తే నమస్తే నమస్తే నమస్తే నమస్తే నమః
Also Read: