AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025: తొలి విజయంతో ముంబైకి షాకింగ్ న్యూస్.. స్టార్ ప్లేయర్ ఔట్?

Jasprit Bumrah Injury Update: ముంబై ఇండియన్స్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా రాబోయే రెండు వారాల పాటు ఐపీఎల్ 2025 మ్యాచ్‌లకు దూరంగా ఉంటాడని సమాచారం. వెన్నునొప్పితో బాధపడుతున్న బుమ్రాకు ఇంకా ఫిట్‌నెస్ క్లియరెన్స్ రాలేదు. ఇది ముంబై ఇండియన్స్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ. అతను కోలుకుంటున్నాడని వార్తలు వస్తున్నాయి. కానీ, అతను తిరిగి వస్తాడని ఖచ్చితంగా చెప్పలేం.

IPL 2025: తొలి విజయంతో ముంబైకి షాకింగ్ న్యూస్.. స్టార్ ప్లేయర్ ఔట్?
Jasprit Bumrah's IPL Dominance: ఐదుసార్లు ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ మరోసారి ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. తొలి మ్యాచ్‌ల్లో చాలా పేలవ ప్రదర్శన చేసిన ఆ జట్టు, గత 8 మ్యాచ్‌ల్లో 7 గెలిచి ప్లేఆఫ్స్‌లో తన స్థానాన్ని పదిలం చేసుకుంది. ముంబై జట్టు ఈ విజయానికి కారణం జస్‌ప్రీత్ బుమ్రా అనడంలో ఎటువంటి సందేహం లేదు.
Venkata Chari
|

Updated on: Apr 01, 2025 | 7:11 AM

Share

Jasprit Bumrah Injury Update: ఐదుసార్లు ఛాంపియన్స్ అయిన ముంబై ఇండియన్స్ 2025 ఐపీఎల్‌లో మూడో మ్యాచ్‌లో విజయం సాధించి, తొలి పాయింట్లను సాధించింది. ముంబై ఆడిన గత రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. కేకేఆర్‌తో జరిగిన మూడో మ్యాచ్‌లో ఏకంగా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే, ఈ విజయానందంలో ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది.

నివేదికల ప్రకారం, ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా లేకుండా ఆడటం కొనసాగించాల్సి ఉంటుంది. జస్‌ప్రీత్ బుమ్రా రాబోయే రెండు వారాల పాటు ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడలేడని నివేదికలు వినిపిస్తున్నాయి. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో అతను బౌలింగ్ చేస్తున్న వీడియో వైరల్ అయినప్పటికీ, అతనికి ఇంకా ఫిట్‌నెస్ క్లియరెన్స్ రాలేదు.

బుమ్రాను బీసీసీఐ వైద్య బృందం, జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) స్పోర్ట్స్ సైన్స్ బృందం పర్యవేక్షిస్తున్నాయి. గత ఏడాది ఆస్ట్రేలియా పర్యటనలో వెన్నునొప్పికి గురైన బుమ్రా అప్పటి నుంచి క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. అతను ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా పాల్గొనలేదు. ఐపీఎల్‌లో ఆడటం గురించి ఇంకా ఖచ్చితంగా తెలియదు.

ఇవి కూడా చదవండి

“ప్రస్తుతం బుమ్రా వేగంగా కోలుకుంటున్నాడు” అని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పినట్లు తెలుస్తోంది. కానీ, అతను క్రికెట్‌లోకి ఎప్పుడు తిరిగి వస్తాడో ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. అతను క్రమంగా తన పనిభారాన్ని పెంచుకుంటున్నాడు. ఇది ఇలాగే కొనసాగితే బుమ్రా రాబోయే రెండు వారాల్లో ఆడటానికి సిద్ధంగా ఉంటాడని సమాచారం. అయితే, బుమ్రా రాబోయే రెండు వారాలు ఆడకపోతే ఈ కాలంలో ముంబై మరో నాలుగు మ్యాచ్‌లు ఆడవలసి ఉంటుంది. అంటే, బుమ్రా ఐపీఎల్‌లోని మొదటి 6-7 మ్యాచ్‌లలో ఆడలేడని తెలుస్తోంది.

జూన్‌లో జరిగే ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌కు బుమ్రా ఫిట్‌గా ఉంటాడని బీసీసీఐ లేదా ఎన్‌సీఏలో ఎవరూ క్లారిటీ ఇవ్వడంలేదు. బుమ్రా త్వరగా కోలుకుంటున్నాడని మాత్రమే చెబుతున్నారు. బుమ్రా విషయానికి వస్తే తొందరపడటం లేదని అర్థం అవుతోంది. వైద్యులు, ఫిజియోలు, ఆటగాళ్ళు 100% ఫిట్‌గా ఉంటేనే అనుమతి ఇస్తారని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పినట్లు తెలుస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..