కలబంద మొక్కను ఇంట్లో ఈ దిశలో పెడితే దరిద్రం మీ వెంటే.. ఇలా చేస్తే సంపద అమాంతం..
Vastu Tips: కలబంద.. కేవలం చర్మ సౌందర్యానికే కాదు, మన ఇంటి అదృష్టాన్ని మార్చడానికి కూడా అద్భుతంగా పనిచేస్తుందని మీకు తెలుసా? చాలా మంది కలబందను అందం కోసం పెంచుకుంటారు. కానీ వాస్తు ప్రకారం దీనిని ఏ దిశలో ఉంచాలనే విషయంపై అవగాహన ఉండదు. కలబందను సరైన స్థానంలో ఉంచితే మీ కెరీర్, ఆర్థిక స్థితి అమాంతం మారుతుందట. ఆ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

మన ఇంట్లో ఉండే మొక్కలు కేవలం అందానికే కాదు.. మన అదృష్టాన్ని మార్చడానికి కూడా ఉపయోగపడతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా కలబంద మొక్కకు వాస్తులో విశిష్ట స్థానం ఉంది. అయితే దానిని ఇంట్లో ఎక్కడ ఉంచాలి? ఏ దిశలో ఉంచకూడదు? అనే విషయాలు తప్పక తెలుసుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ పెడితే కొన్ని సమస్యలు తలెత్తే అవకాశాలు లేకపోలేదు.
మూడు అంశాలపై సానుకూల ప్రభావం
కలబందను సరైన దిశలో ఉంచినప్పుడు అది మన జీవితంలోని మూడు ప్రధాన అంశాలను ప్రభావితం చేస్తుంది.
- వృత్తిపరమైన ఎదుగుదల ఉంటుంది.
- ఇంట్లో సంపద పెరుగుతుంది.
- కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ఏ దిశలో ఉంచాలి? ఏ దిశలో ఉంచొద్దు
కలబంద మొక్కను ప్రతికూల శక్తులను తొలగించే పవిత్ర మొక్కగా పండితులు చెబుతున్నారు. అయితే దిశల విషయంలో జాగ్రత్త వహించాలని ఆయన హెచ్చరించారు.
శుభ దిశలు: కలబందను తూర్పు, పశ్చిమ, ఈశాన్యం లేదా నైరుతి దిశలలో ఉంచడం చాలా మంచిది.
నివారించాల్సిన దిశలు: వాస్తు నియమాల ప్రకారం.. కలబందను ఎట్టి పరిస్థితుల్లోనూ వాయువ్యం, ఆగ్నేయం దిశలలో ఉంచకూడదు.
సరైన ప్రదేశం: బాల్కనీలు లేదా బాగా గాలి, వెలుతురు వచ్చే ప్రదేశాలలో ఉంచితే వాతావరణంలో సానుకూలత పెరుగుతుంది. మొక్కను నేలపై కాకుండా కొంచెం ఎత్తైన ప్రదేశంలో ఉంచడం మరింత శుభ ఫలితాలను ఇస్తుంది.
సంరక్షణ సులభం.. ఫలితం అమోఘం
కలబంద మొక్కకు పెద్దగా జాగ్రత్తలు అవసరం లేదు. కొంచెం నీరు పోసినా ఇది బాగా పెరుగుతుంది. ఇంట్లో శాంతి, ప్రశాంతతను కోరుకునే వారు ఈ చిన్న వాస్తు చిట్కాను పాటించడం ద్వారా మెరుగైన ఫలితాలు పొందవచ్చని గురూజీ సూచిస్తున్నారు.
Note: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్య శాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. దీనిని TV9తెలుగు ధృవీకరించదు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




