AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చికెన్ లెగ్‌పీస్ ఎందుకు అంత స్పెషల్.. దాన్ని టేస్ట్ వెనకున్న మ్యాజిక్ తెలిస్తే అవాక్కవడం పక్కా..

Chicken Leg Piece: నాన్‌వెజ్ ప్రియుల ఇళ్లలో ఆదివారం వచ్చిందంటే చాలు.. చికెన్ వంటకాలతో ఇల్లంతా ఘుమఘుమలాడిపోవాల్సిందే. అయితే గిన్నెలో ఎన్ని ముక్కలున్నా అందరి కళ్లు మాత్రం ఆ ఒక్క గ్ పీస్ మీదనే ఉంటాయి. ఇంట్లో పిల్లల నుండి హోటల్‌కు వెళ్లే కుర్రాళ్ల వరకు.. లెగ్ పీస్ కోసం గొడవ పడని వారంటూ ఉండరు. అసలు కోడి మాంసంలో మిగతా భాగాలన్నీ ఒకెత్తయితే, లెగ్ పీస్ మాత్రం మరో ఎత్తు అని ఎందుకు అంటారు..

చికెన్ లెగ్‌పీస్ ఎందుకు అంత స్పెషల్.. దాన్ని టేస్ట్ వెనకున్న మ్యాజిక్ తెలిస్తే అవాక్కవడం పక్కా..
Why Chicken Leg Pieces Are So Popular
Krishna S
|

Updated on: Jan 11, 2026 | 7:05 AM

Share

ప్రపంచవ్యాప్తంగా నాన్ వెజ్ ప్రియులకు చికెన్ లేనిదే ముద్ద దిగదు. పార్టీ అయినా ఫంక్షన్ అయినా విభిన్న రకాల చికెన్ వంటకాలు ఉండాల్సిందే. అయితే కోడి మాంసంలో ఏ భాగాన్ని తిన్నా రాని తృప్తి.. ఒక్క లెగ్ పీస్ తింటే వస్తుందని చాలా మంది నమ్ముతారు. అందుకే హోటల్‌కు వెళ్లినా, ఇంట్లో వండుకున్నా లెగ్ ముక్కల కోసం పోటీ పడుతుంటారు. ఇంతకీ చికెన్ లెగ్ పీస్‌లో ఏముంది? ఇది ఎందుకు అంత రుచిగా ఉంటుంది? దీని పోషక విలువల వెనుక ఉన్న రహస్యమేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రుచికి కేరాఫ్ అడ్రస్

చికెన్ లెగ్ ముక్కలు కోడిలోని ఇతర భాగాల కంటే భిన్నంగా ఉంటాయి. ఇందులో డ్రమ్‌స్టిక్, తొడ మాంసం కలిసి ఉంటాయి. దీనిని డార్క్ మీట్ అని కూడా పిలుస్తారు. మిగిలిన తెల్లటి మాంసం తో పోలిస్తే లెగ్ పీస్ ముక్కలు చాలా మృదువుగా, జ్యూసీగా ఉంటాయి. అందుకే చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అందరూ వీటిని లొట్టలు వేసుకుంటూ తింటారు.

మైయోగ్లోబిన్ అనే ప్రోటీన్ మ్యాజిక్

లెగ్ ముక్కలు అంత రుచిగా ఉండటానికి ప్రధాన కారణం అందులో ఉండే మైయోగ్లోబిన్ అనే ప్రోటీన్. ఈ ప్రోటీన్ కండరాలకు ఆక్సిజన్‌ను సరఫరా చేయడంలో సహాయపడుతుంది. లెగ్ పీస్ అనేది కోడి శరీరంలో నిరంతరం కదిలే భాగం కాబట్టి అక్కడ ఈ ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది మాంసానికి మంచి రంగును, ప్రత్యేకమైన రుచిని ఇస్తుంది.

పోషకాల గని.. ఫిట్‌నెస్ ప్రేమికులకు వరప్రసాదం

చికెన్ లెగ్ ముక్కలు కేవలం రుచికరమే కాదు.. ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. ఇందులో ఐరన్, జింక్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. కేలరీల విషయానికి వస్తే.. సుమారు 44 గ్రాముల బరువున్న ఒక లెగ్ పీస్‌లో 12.4 గ్రాముల ప్రోటీన్ అందుతుంది. ఇందులో కొవ్వు శాతం కొద్దిగా ఎక్కువగా ఉండటం వల్ల శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. అందుకే జిమ్‌కు వెళ్లేవారు, కఠినమైన వ్యాయామం చేసేవారు లెగ్ ముక్కలను తినడానికి మొగ్గు చూపుతారు.

చికెన్ బ్రెస్ట్ పీస్‌తో పోలిస్తే లెగ్ పీస్‌లో కేలరీలు, కొవ్వు కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ అందులోని పోషకాలు, రుచి మాత్రం అమోఘం. అందుకే చికెన్ మార్కెట్‌లో లెగ్ పీస్‌లకు ఉన్న డిమాండ్ ఎప్పుడూ తగ్గదు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
అకౌంట్ తెరవాలంటే రూ.200 ఛార్జీ.. కేంద్రం కొత్త రూల్స్..
అకౌంట్ తెరవాలంటే రూ.200 ఛార్జీ.. కేంద్రం కొత్త రూల్స్..
అడవిని వీడి తోటలోకి వచ్చిన ఏనుగు.. అంతలోనే విషాదం
అడవిని వీడి తోటలోకి వచ్చిన ఏనుగు.. అంతలోనే విషాదం
ఆ చేపలు తినొద్దు.. నేపాల్ వరద నీటిలో కొట్టుకొస్తున్న భారీ చేపలు!
ఆ చేపలు తినొద్దు.. నేపాల్ వరద నీటిలో కొట్టుకొస్తున్న భారీ చేపలు!
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
కార్బన్ జెన్‌జె ప్రో స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలివే
కార్బన్ జెన్‌జె ప్రో స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలివే
ఫాస్టెస్ట్ బాల్ వేసినోడు తెలుసు.. ఆడిన మొగోడు ఎవడో తెలుసా?
ఫాస్టెస్ట్ బాల్ వేసినోడు తెలుసు.. ఆడిన మొగోడు ఎవడో తెలుసా?
సైన్స్ కు అందని కదిరి లక్ష్మీనరసింహస్వామి శ్వేద రహస్యం
సైన్స్ కు అందని కదిరి లక్ష్మీనరసింహస్వామి శ్వేద రహస్యం
నిజమైన దెయ్యం సినిమా.. ఓటీటీలో ఎక్కువమంది చూసిన హారర్ థ్రిల్లర్
నిజమైన దెయ్యం సినిమా.. ఓటీటీలో ఎక్కువమంది చూసిన హారర్ థ్రిల్లర్