మేడారంలో తప్పిపోయిన పాప.. చిన్నారిని స్వయంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చిన మంత్రి సీతక్క
తెలంగాణ కుంభమేళా.. మహాజాతరకు ముందే మేడారంకు భక్తులు పోటెత్తారు. రోజుకు లక్ష మందికి పైగా సమ్మక్క-సారక్క దేవతల దర్శనానికి తరలివస్తున్నారు. ఆదివారం (జనవరి 11) ఒక్కరోజే రెండు లక్షల మందికి పైగా మేడారంకు భక్తులు పోటెత్తారు. జంపన్నవాగు జనంతో కిక్కిరిసింది. అయితే ఈ వాగులో ఓ బాలిక మిస్సయింది. తప్పిపోయిన ఆ పాప ఏడుస్తూ తిరగడాన్ని గమనించిన మంత్రి సీతక్క ఆ చిన్నారిని చేరదీసి ఎత్తుకున్నారు.

తెలంగాణ కుంభమేళా.. మహాజాతరకు ముందే మేడారంకు భక్తులు పోటెత్తారు. రోజుకు లక్ష మందికి పైగా సమ్మక్క-సారక్క దేవతల దర్శనానికి తరలివస్తున్నారు. ఆదివారం (జనవరి 11) ఒక్కరోజే రెండు లక్షల మందికి పైగా మేడారంకు భక్తులు పోటెత్తారు. జంపన్నవాగు జనంతో కిక్కిరిసింది. అయితే ఈ వాగులో ఓ బాలిక మిస్సయింది. తప్పిపోయిన ఆ పాప ఏడుస్తూ తిరగడాన్ని గమనించిన మంత్రి సీతక్క ఆ చిన్నారిని చేరదీసి ఎత్తుకున్నారు. ఆ పాప తల్లిదండ్రుల కోసం పోలీసులతో వెతికించారు. చివరికి తల్లిదండ్రులను వెతికి పట్టుకుని వారికి అప్పగించారు.
మేడారం మహాజాతర జనవరి 28 నుండి 31వ తేదీ వరకు జరగనుంది. ఈసారి జాతరకు కోటి 50 లక్షల మందికి పైగా భక్తులు హాజరవుతారని అంచనాలు వేస్తున్నారు. అయితే మేడారం గ్రామంతో పాటు గద్దెలను పూర్తిగా ఆధునీకరిస్తున్న నేపథ్యంలో భక్తులు ముందస్తుగా పోటెత్తుతున్నారు. వేలాది వాహనాలు మేడారంకు బారులు తీరాయి. రోజుకు లక్ష మందికి పైగా భక్తులు తరలివస్తున్నారు. ప్రస్తుతం సంక్రాంతి సెలవుల ఎఫెక్ట్ తో మేడారం జనసంద్రంగా మారింది. ఆదివారం ఒక్కరోజే రెండు లక్షల మందికిపైగా భక్తులు సమ్మక్క సారక్క దర్శనానికి వస్తారని అంచనాలు వేసి అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి సీతక్క అక్కడ తిష్టవేసి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. అధికారులను తన వెంట పెట్టుకుని భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూస్తున్నారు.
భక్తుల పుణ్యస్నానాలతో జంపన్నవాగులో జనం పోటెత్తారు. అభివృద్ధి పనులను పరిశీలిస్తున్న మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర్, ఎస్పీ సుదీర్ రామనాథ్ కేకన్ తో కలిసి జంపన్న వాగు వద్దకు నడుచుకుంటూ వెళ్లారు. ఈ క్రమంలో జంపన్న వద్ద అభివృద్ధి పనులను పరిశీలిస్తున్న మంత్రి సీతక్కకు అక్కడ తప్పిపోయిన బాలిక కనిపించింది. తల్లిదండ్రులు కనిపించక.. ఓ చిన్నారి అక్కడ ఏడుస్తూ తిరుగుతుంది. తన తల్లిదండ్రులు ఎటో వెళ్లారని తెలిపింది. ఈ క్రమంలో ఆ బాలికను చేరదీసిన మంత్రి సీతక్క ఎత్తుకుని ఓదార్చారు. ఆ బాలిక తల్లిదండ్రుల కోసం ఆరా తీశారు. సీతక్క అంగరక్షకులు, అక్కడున్న పోలీస్ సిబ్బంది ఆ బాలిక తల్లిదండ్రుల కోసం ఆరా తీశారు. వారిని గుర్తించి బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు.
ఆ బాలికను ఎత్తుకుని మనోధైర్యం నింపిన సీతక్క.. ఈ బాలిక తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే భక్తులు వేలాదీగా తరలివస్తున్న నేపథ్యంలో పిల్లలను జాగ్రత్తగా తమ వెంట పెట్టుకోవాలని, తప్పిపోతే సమ్మక్క సారక్క సన్నిధిలో ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్ కు వచ్చి తెలియపరచాలని మంత్రి సీతక్క సూచించారు.
వీడియో చూడండి…
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
