AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jagtial District: పొలం బాట పట్టిన ట్రైనీ డిప్యూటీ కలెక్టర్

జగిత్యాల జిల్లాలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ హరిణి చేసిన క్షేత్ర స్థాయి పర్యటనకు విశేష స్పందన లభించింది. ధర్మపురి మండలంలోని గ్రామాల్లో ఆమె పొలాల్లోకి వెళ్లి మహిళా కూలీలతో కలిసి వరి నాట్లు వేస్తూ, గ్రామీణ జీవన కష్టసుఖాలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. అధికారిణిగా మాత్రమే కాకుండా ప్రజలతో కలిసిపోయిన ఆమె పర్యటన అందరి ప్రశంసలు పొందింది.

Jagtial District: పొలం బాట పట్టిన ట్రైనీ డిప్యూటీ కలెక్టర్
Deputy Collector Harini
G Sampath Kumar
| Edited By: |

Updated on: Jan 11, 2026 | 11:10 AM

Share

జగిత్యాల జిల్లాకు నియమితులైన ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ హరిణి గ్రామీణ ప్రాంతాల్లో క్షేత్ర స్థాయి పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా ధర్మపురి మండలంలోని తిమ్మాపూర్, బూరుగుపల్లి గ్రామాల్లో ఆమె పర్యటించారు. పొలాల్లోకి నేరుగా వెళ్లిన హరిణి, వ్యవసాయ కూలీలతో మమేకమయ్యారు. వరి పొలంలోకి దిగిన ఆమె.. రైతులు మహిళా కూలీలతో కలిసి వరి నాట్లు వేసి, వారి జీవన విధానం, కష్టసుఖాలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. నాటు వేసే విధానాన్ని అడిగి తెలుసుకున్న ట్రైనీ డిప్యూటీ కలెక్టర్, స్వయంగా బురదలోకి దిగి కొంతసేపు నాట్లు వేశారు. వ్యవసాయ పనులు చేస్తున్న కూలీలతో కలిసి పనిచేసిన అనంతరం, లంచ్ సమయంలో వారికి పండ్లను పంపిణీ చేశారు. అలాగే మహిళా రైతులతో కలిసి సెల్ఫీలు దిగుతూ, సుమారు అరగంట పాటు వారి మధ్య గడిపారు.

గ్రామీణ మహిళలతో కలిసి పనిచేయడం, వారి జీవన పరిస్థితులను తెలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని హరిణి తెలిపారు. అధికారిగా మాత్రమే కాకుండా, గ్రామీణ ప్రజలతో కలిసిపోయిన ఆమె క్షేత్ర స్థాయి పర్యటన స్థానికుల్లో విశేష స్పందనను పొందింది. నేరుగా అధికారి పొలాల్లోకి వచ్చి తమతో కలిసి పనిచేయడం చూసి మహిళా రైతులు సంతోషం వ్యక్తం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రోజూ చూయింగ్ గమ్ తింటున్నారా? శరీరంలో జరిగేది తెలిస్తే...
రోజూ చూయింగ్ గమ్ తింటున్నారా? శరీరంలో జరిగేది తెలిస్తే...
వాడిన టీపొడిని పారేస్తున్నారా? ఉపయోగాలు తెలిస్తే అసలు అలా చేయరు!
వాడిన టీపొడిని పారేస్తున్నారా? ఉపయోగాలు తెలిస్తే అసలు అలా చేయరు!
అవి బలహీనమైన రోగనిరోధక శక్తికి సంకేతమా?
అవి బలహీనమైన రోగనిరోధక శక్తికి సంకేతమా?
తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త యాప్.. అన్నీ టికెట్లు ఒకే చోట బుకింగ్
తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త యాప్.. అన్నీ టికెట్లు ఒకే చోట బుకింగ్
Robin Sharma: ఈ 5 సూపర్ హ్యాబిట్స్‌తో విజయం మీదే
Robin Sharma: ఈ 5 సూపర్ హ్యాబిట్స్‌తో విజయం మీదే
ఉదయాన్నే అలసిపోయినట్లు అనిపిస్తుందా..? ఈ 5 రహస్య కారణాలు కావొచ్చు
ఉదయాన్నే అలసిపోయినట్లు అనిపిస్తుందా..? ఈ 5 రహస్య కారణాలు కావొచ్చు
పండక్కి నాటుకోడి తినాలంటే జేబు ఖాళీనే.. వామ్మో ధరలు మరీ ఇంతలా..
పండక్కి నాటుకోడి తినాలంటే జేబు ఖాళీనే.. వామ్మో ధరలు మరీ ఇంతలా..
జుట్టు వేగంగా పెరగాలంటే ఏం చేయాలి?ఈ సింపుల్‌ టిప్స్ ట్రై చేశారంటే
జుట్టు వేగంగా పెరగాలంటే ఏం చేయాలి?ఈ సింపుల్‌ టిప్స్ ట్రై చేశారంటే
టీమిండియాకు బిగ్ షాక్.. గాయంతో మైదానం వీడిన స్టార్ ప్లేయర్
టీమిండియాకు బిగ్ షాక్.. గాయంతో మైదానం వీడిన స్టార్ ప్లేయర్
విజయవాడలో సూపర్‌స్టార్ కృష్ణ విగ్రహావిష్కరణ
విజయవాడలో సూపర్‌స్టార్ కృష్ణ విగ్రహావిష్కరణ