AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మటన్ బోటీ తింటే ఏమవుతుంది.. మేక పేగుల వెనుక ఉన్న అసలు రహస్యం తెలిస్తే అవాక్కే..

చాలా మందికి ముక్క లేనిదే ముద్ద దిగదు. మటన్‌తో పాటు బోటిని ఇష్టంగా తింటుంటారు. అయితే ఈ బోటీ కేవలం రుచి కోసం మాత్రమే కాదు.. మన శరీరానికి ఇదొక అద్భుతమైన హెల్త్ టానిక్ అని మీకు తెలుసా? మేక పేగులు తినడం వల్ల రక్తహీనత నుంచి చర్మ సమస్యల వరకు అన్నింటికీ చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. అసలు బోటిలో ఏముంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

మటన్ బోటీ తింటే ఏమవుతుంది.. మేక పేగుల వెనుక ఉన్న అసలు రహస్యం తెలిస్తే అవాక్కే..
ముందుగా మటన్ బోటి తీసుకుని దానిని బాగా వేడి నీటితో కడిగి వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత దానిలో కొద్దిగా పసుపు, ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసి 15 నిమిషాల పాటు ఉంచి మటన్‌ ను నానా బెట్టుకోవాలి.
Krishna S
|

Updated on: Jan 09, 2026 | 8:57 PM

Share

పండగా లేదా ఆదివారం వచ్చిందంటే చాలు.. మాంసాహార ప్రియుల ఇళ్లలో మటన్ ఘుమఘుమలాడాల్సిందే. మటన్ ముక్కలతో పాటు మేక తలకాయ మాంసం, కాళ్లు, రక్తం, బోటీని చాలామంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. అయితే వీటిలో బోటీ రుచికి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మేక కేవలం పచ్చని ఆకులను మాత్రమే ఆహారంగా తీసుకుంటుంది కాబట్టి దాని పేగులలో మన శరీరానికి అవసరమైన అనేక పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.

బోటీ వల్ల కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

రక్తహీనతకు చెక్: మేక పేగుల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలోని హీమోగ్లోబిన్ స్థాయిలను పెంచి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. రక్తహీనతతో బాధపడేవారికి ఇది మంచి ఆహారం.

చర్మం – జుట్టు ఆరోగ్యం: బోటీలో జింక్ అధికంగా ఉంటుంది. ఇది చర్మం కాంతివంతంగా ఉండటానికి, జుట్టు దృఢంగా పెరగడానికి సహాయపడుతుంది. అలాగే ఇందులోని విటమిన్ A, విటమిన్ E చర్మ కణాలను రక్షిస్తాయి.

ఇవి కూడా చదవండి

రోగ నిరోధక శక్తి: దీనిని తీసుకోవడం వల్ల శరీర రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది. వైరస్‌లు, బ్యాక్టీరియాల నుండి శరీరాన్ని రక్షించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.

ప్రొటీన్లు – విటమిన్లు: శారీరక బలానికి కావాల్సిన ప్రొటీన్లు, బి-విటమిన్లు, ఖనిజాలు ఇందులో పుష్కలంగా లభిస్తాయి.

శుభ్రత విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి

బోటీ తినడం వల్ల లాభాలు ఉన్నప్పటికీ, దానిని శుభ్రం చేసే పద్ధతి చాలా ముఖ్యం. పేగులలో మలినాలు ఉండే అవకాశం ఉన్నందున వేడి నీటితో కనీసం నాలుగైదు సార్లు క్షుణ్ణంగా కడిగి బాగా ఉడికించిన తర్వాతే తీసుకోవాలి. సరిగ్గా ఉడకని బోటీ వల్ల జీర్ణక్రియ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.

మార్కెట్‌లో తక్కువ ధరకే దొరుకుతుందని లేదా రుచిగా ఉందని అతిగా తినడం మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మటన్ లేదా బోటీ ఏదైనా సరే.. పరిమితంగా, సమతుల్య ఆహారంలో భాగంగా తీసుకున్నప్పుడే పూర్తి ఆరోగ్యం చేకూరుతుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
నోట్లో వేస్తే కరిగిపోయేలా డబల్ కా మీఠా.. పక్కా కొలతలతో ఇలా చేయండి
నోట్లో వేస్తే కరిగిపోయేలా డబల్ కా మీఠా.. పక్కా కొలతలతో ఇలా చేయండి
ఒక వ్యక్తి పేరుపై రెండు గ్యాస్ కనెక్షన్లు తీసుకోవచ్చా..?
ఒక వ్యక్తి పేరుపై రెండు గ్యాస్ కనెక్షన్లు తీసుకోవచ్చా..?
ఈ యాప్స్‌ ఉంటే గూగుల్ మ్యాప్స్ అక్కర్లేదు
ఈ యాప్స్‌ ఉంటే గూగుల్ మ్యాప్స్ అక్కర్లేదు
జబర్దస్త్‌లోకి ఆ స్టార్ కమెడియన్ల రీఎంట్రీ.. రష్మీ ఎమోషనల్
జబర్దస్త్‌లోకి ఆ స్టార్ కమెడియన్ల రీఎంట్రీ.. రష్మీ ఎమోషనల్
రోడ్ సైడ్ బండి మీద అమ్మే చల్ల పునుగులు.. ఇంట్లోనే ఇలా చేసి చూడండి
రోడ్ సైడ్ బండి మీద అమ్మే చల్ల పునుగులు.. ఇంట్లోనే ఇలా చేసి చూడండి
ఆవుతో స్నేహం చేస్తే ఇట్టా ఉంటుందా.. మాంసం మానేసిన కుక్క..
ఆవుతో స్నేహం చేస్తే ఇట్టా ఉంటుందా.. మాంసం మానేసిన కుక్క..
సంజూ ఎంట్రీతో బీసీసీఐ పై వచ్చిన వార్తలన్నీ అబద్ధాలేనా
సంజూ ఎంట్రీతో బీసీసీఐ పై వచ్చిన వార్తలన్నీ అబద్ధాలేనా
కేవలం రూ.50 వేల బడ్జెట్‌తో 7 దేశాల టూర్‌కు వెళ్లొచ్చు! లిస్ట్ ఇదే
కేవలం రూ.50 వేల బడ్జెట్‌తో 7 దేశాల టూర్‌కు వెళ్లొచ్చు! లిస్ట్ ఇదే
ఆండ్రాయిడ్ యాప్స్‌ కోసం కొత్త రూల్స్‌ తెచ్చేసిన గూగుల్‌
ఆండ్రాయిడ్ యాప్స్‌ కోసం కొత్త రూల్స్‌ తెచ్చేసిన గూగుల్‌
రాత్రి పండ్లు తింటే నిజంగానే బరువు పెరుగుతారా?
రాత్రి పండ్లు తింటే నిజంగానే బరువు పెరుగుతారా?