ఫస్ట్ నైట్ రోజే పారిపోయిన భర్త.. అసలు విషయం తెలిసి భార్య షాక్.. ఏం జరిగిందంటే..?
నమ్మించి తాళి కట్టాడు.. తీరా శోభనం రోజు వధువుకు ఊహించని షాక్ తగిలింది. భార్య శీలాన్ని సోషల్ మీడియాలో బజారుకీడ్చిన కిరాతక భర్త కథ ఇది. పెళ్లై రెండు నెలలైనా గదిలోకి రావడానికి భయపడి పారిపోయిన ఆ డాక్టర్ అసలు రంగు బయటపడటమే కాకుండా తన భార్యను, ఆమె సిస్టర్స్‌ను ఫేక్ ఐడీలతో వేధించిన వికృత చేష్టలు ఇప్పుడు గోరఖ్‌పూర్‌లో సంచలనం రేపుతున్నాయి.

ఆ యువతి ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకుంది. పైగా భర్త డాక్టర్ అని మురిసిపోయింది. కానీ ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. నమ్మించి పెళ్లి చేసుకున్న భర్త తీరా చూస్తే నపుంసకుడు.. ఆ నిజాన్ని ప్రశ్నించినందుకు అత్తమామల అండతో భార్య శీలాన్ని బజారుకీడ్చిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో వెలుగుచూసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఒక దంత వైద్యుడు, అతని తండ్రిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గోరఖ్‌పూర్‌లోని ఒక ఇంటర్ కాలేజీలో పనిచేస్తున్న యువతికి, నవంబర్‌లో గోరఖ్‌నాథ్ ప్రాంతానికి చెందిన దంత వైద్యుడితో వివాహమైంది. వివాహ సమయంలో భారీగా కట్నకానుకలు సమర్పించిన యువతి కుటుంబానికి, తమ అల్లుడు నపుంసకుడు అనే చేదు నిజం తెలియదు.
శోభనం గది నుంచి పారిపోయిన భర్త
బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. వివాహమైన మొదటి రాత్రి నుండి భర్త తనతో గడపడానికి భయపడుతూ తప్పించుకు తిరిగేవాడు. సుమారు 20 రోజుల పాటు భార్య తన భర్త ప్రవర్తనలో మార్పు కోసం వేచి చూసింది. ప్రతి రాత్రి ఏదో ఒక సాకుతో గది నుంచి పారిపోవడమో లేదా నిద్రపోవడమో చేసేవాడు. అనుమానం వచ్చిన బాధితురాలు ఒకరోజు నేరుగా నిలదీయగా, తాను లైంగికంగా అసమర్థుడినని ఆ డాక్టర్ ఒప్పుకున్నాడు.
అత్తమామల వికృత చేష్టలు
తమ కొడుకు లోపం తెలిసి కూడా మోసం చేసి పెళ్లి చేసిన అత్తమామలను బాధితురాలు ప్రశ్నించింది. వారు ఆ నిజాన్ని అంగీకరించకపోగా రివర్స్‌లో ఆమెపైనే వేధింపులకు దిగారు. బాధితురాలు తన పుట్టింటికి వెళ్లిపోవడంతో నిందితుడైన భర్త, అతని తండ్రి ఆమెపై కక్ష పెంచుకున్నారు.
ఫేక్ ఐడీతో అసభ్య ప్రచారం
జనవరి 1న బాధితురాలి సోదరి ఫోన్ చేసి, ఫేస్‌బుక్‌లో వారిద్దరి గురించి ఎవరో అత్యంత అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారని చెప్పింది. నిందితులు ఫేక్ ఫేస్‌బుక్ ఖాతాలను సృష్టించి, బాధితురాలు, ఆమె సోదరీమణుల గురించి అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. వేర్వేరు ఫోన్ నంబర్ల నుండి అసభ్య సందేశాలు పంపి మానసికంగా వేధించారు.
పోలీసుల రంగప్రవేశం
బాధితురాలు సాక్ష్యాధారాలతో సహా పోలీసులను ఆశ్రయించింది. గోరఖ్‌నాథ్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ శశి భూషణ్ రాయ్ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడైన డాక్టర్, అతని తండ్రిపై మోసం, ఐటి యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సైబర్ క్రైమ్ విభాగం ఆ ఫేక్ ఐడీల ఐపీ అడ్రస్‌లను తనిఖీ చేయగా, అవి నిందితులవేనని తేలింది. వైద్య వృత్తిలో ఉండి ఇలాంటి నీచమైన పనికి ఒడిగట్టడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
