ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడ్డ టూరిస్టు బస్సు.. 8 మంది మృతి, 10 మందికి సీరియస్!
హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. హరిపుర్ధార్ ప్రాంతంలో బస్సు లోయలో పడిపోయింది. ఇప్పటి వరకు 8మంది ప్రాణాలు కోల్పోగా, పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో సిర్మౌర్‌లోని సంగ్రా సబ్‌డివిజన్‌లోని హరిపుర్‌ధర్‌లో ఒక ప్రైవేట్ బస్సు ఎతైన లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించారు.

హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హరిపుర్ధార్ ప్రాంతంలో బస్సు లోయలో పడిపోయింది. ఇప్పటి వరకు 8మంది ప్రాణాలు కోల్పోగా, పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో సిర్మౌర్‌లోని సంగ్రా సబ్‌డివిజన్‌లోని హరిపుర్‌ధర్‌లో ఒక ప్రైవేట్ బస్సు ఎతైన లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించారు. పదుల సంఖ్యలో ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 54 మంది ప్రయాణికులు ఉన్నారు. కుప్వి నుంచి బస్సు సిమ్లాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన తరువాత స్థానికులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో బస్సు నుజ్జునుజ్జయ్యింది. మృతులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది.
జీత్ కోచ్ అనే ప్రైవేట్ బస్సు కుప్వి నుండి సిమ్లాకు వెళుతోంది. బస్సు హరిపుర్ధార్ బజార్ నుండి సిమ్లాకు వెళుతుండగా మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ అకస్మాత్తుగా వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో అది రోడ్డు పక్కనే ఉన్న లోతైన లోయలో పడిపోయింది. హరిపుర్ధార్ మార్కెట్ నుండి కేవలం 100 నుండి 200 మీటర్ల దూరంలో, డ్రైవర్ అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోయాడు. బస్సు రోడ్డు నుండి లోతైన లోయలోకి దూసుకెళ్లింది. బస్సులో 54 మంది ప్రయాణికులు ఉన్నారని తెలుస్తోంది. ఈ ఘటనలో మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే స్థానిక అధికారులు, పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. లోయ నుండి ఇప్పటివరకు ఐదు మృతదేహాలను వెలికితీసినట్లు అదనపు పోలీసు సూపరింటెండెంట్ యోగేష్ రోల్టా ధృవీకరించారు. సంగ్రా , రాజ్‌గఢ్, దాదాహు నుండి పోలీసులు, సహాయక బృందాలను సంఘటనా స్థలానికి రప్పించారు. పోలీసు సూపరింటెండెంట్ ఎన్.ఎస్. నేగి సంఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు పర్యవేక్షిస్తున్నారు. స్థానిక నివాసితుల సహాయంతో, గాయపడిన వారిని లోయ నుండి బయటకు తీసి వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలిస్తున్నారు.
లోయ లోతు ఎక్కువగా ఉండటం వల్ల సహాయక చర్యలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మృతులను గుర్తించే ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. గాయపడిన వారికి సాధ్యమైనంత ఉత్తమమైన చికిత్స అందించడం, లోయలో చిక్కుకున్న ఇతర ప్రయాణీకులను రక్షించడానికి ప్రస్తుతం అధికారులు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
