Dhanurmasam Thiruppavai: నేడు తిరుప్పావై 20వ పాశురం.. జగన్నాటక సూత్రధారియైన ఆ జగన్నాధుని మేల్కొలుపు..

విష్ణువును కీర్తిస్తూ, గోదాదేవి మూలద్రావిడంలో గానం చేసిన ముప్ఫై పాశురాల గీతమాలిక. ఇది పన్నిద్దరాళ్వార్లు రచించిన నాలాయిర దివ్య ప్రబంధములో ఒక ముఖ్య భాగమై, తమిళ సాహిత్యంలో ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించుకుంది.

Dhanurmasam Thiruppavai: నేడు తిరుప్పావై 20వ పాశురం.. జగన్నాటక సూత్రధారియైన ఆ జగన్నాధుని మేల్కొలుపు..
Thiruppavai Pasuram
Follow us
Sanjay Kasula

|

Updated on: Jan 04, 2022 | 9:56 AM

విష్ణువును కీర్తిస్తూ, గోదాదేవి మూలద్రావిడంలో గానం చేసిన ముప్ఫై పాశురాల గీతమాలిక. ఇది పన్నిద్దరాళ్వార్లు రచించిన నాలాయిర దివ్య ప్రబంధములో ఒక ముఖ్య భాగమై, తమిళ సాహిత్యంలో ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించుకుంది. విష్ణువును కీర్తిస్తూ, గోదాదేవి మూలద్రావిడంలో గానం చేసిన ముప్ఫై పాశురాల గీతమాలిక. ఇది పన్నిద్దరాళ్వార్లు రచించిన నాలాయిర దివ్య ప్రబంధములో ఒక ముఖ్య భాగమై, తమిళ సాహిత్యంలో ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించుకుంది. తిరుప్పావై పన్నిద్దరాళ్వారులలో ఒకరైన గోదాదేవి రచించిన ముప్పది పాశురాల ప్రబంధం. వైష్ణవులు పరమ పవిత్రంగా పఠించే ఈ పాశురాలు మధుర భక్తిని ప్రబోధిస్తాయి. ధనుర్మాసంలో నేడు 20వ రోజు. ఈ మాసంలో అమ్మాళ్ రంగనాధుడిని తన భర్తగా పొందడానికి వ్రతమాచరిస్తూ.. పాశురాలను రచించింది. ఈ పాశురాలను తిరుప్పావై అని అంటారు. ఈ రోజు తిరుప్పావై 20వ పాశురం.

పాశురము – 20…

ముప్పత్తు మూవర్ అమరర్కు మున్ శెన్రు

కప్పమ్ తవిర్కుమ్ కలియే తుయిలెళాయ్

శెప్పముడైయాయ్ తిఱలుడైయాయ్ ! శెట్రార్కు

వెప్పమ్ కొడుక్కుమ్ విమలా తుయిలెళాయ్

శెప్పన్న మెన్ములైచ్చెవ్వాయ్ చ్చిరు మరుంగుల్

నప్పిన్నై నంగాయ్ ! తిరువే ! తుయిలెలాయ్

ఉక్కముమ్ తట్టొళియుమ్ తన్దున్ మణాళనై

ఇప్పోదే యెమ్మై నీరాట్టేలే రెమ్బావాయ్.

అర్థం: ముప్పది మూడు కోట్ల దేవతలకు ఏ విధమైన సంకటములు వచ్చినను ముందుగనే అటకుపోయి వారిని రక్షించు సమర్ధతగల ఓ స్వామీ! నిద్రలేచిరమ్ము. ఆశ్రితులను రక్షించుటకై వారి విరోధులను దునుమాడు బలాఢ్యుడా! ఆశ్రిత రక్షకా! ఓ బలశాలీ! శత్రువులకే అతి దుఃఖమునిచ్చే నిర్మలుడా! నిద్ర నుండి మేల్కొను స్వామీ!’ అని స్తుతిస్తూ మేల్కొల్పినను స్వామి మేల్కొనకుండుట చూచి, జగన్నాటక సూత్రధారియైన ఆ జగన్నాధుని మేల్కొలుపుమని నీళాదేవిని ప్రార్ధిస్తున్నారు గోపికలు. బంగారు కలశముల వంటి స్తనద్వయమును, దొండపండు వంటి అధరములను, సన్నని నడుమును కల్గి అతిలోక సుందరముగ విరాజిల్లుచున్న ఓ నీళాదేవీ!మాయమ్మా! నీవు శ్రీమహాలక్ష్మీ దేవికి సమానురాలవు! కరుణించి నీవైన మేల్కొనవమ్మా! ‘నేను లేచి మీకేమి చేయవలెనందువేమో!’ వినుము – మన స్వామియైన శ్రీకృష్ణునకు శరీరముపై చిరుచెమట పట్టినపుడు దానిని ఉపశమింపచేయగా వీవన కైంకర్యమును చేయుటకు ఒక దివ్యమైన వీవన (విసనకర్ర) నిమ్ము! ప్రబోధ సమయాన స్వామి తిరుముఖ మండలము జూచుకొనుటకు ఒక దివ్య మణిదర్పణము (అద్దము) నిమ్ము. వీటన్నింటిని మాకనుగ్రహించి, స్వామిని మేల్కొలిపి, మమ్ము అతనితో కూర్చి మంగళస్నానము చేయింపుము తల్లీ! నీ యనుగ్రహమున్ననే కద మా యీ వ్రతము మంగళముగ పూర్తికాగలదు?’ అని ఆండాళ్ తల్లి నీళాదేవిని వేడుకొంటున్నారు యీ పాశురంలో.

ఇవి కూడా చదవండి: Drink and Drive Fine: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికాడు.. తన వెహికిల్‌ని తానే తగలబెట్టుకున్నాడు.. ఎందుకో తెలుసా..

CM KCR: లాక్‎డౌన్ విధించాల్సిన అవసరం లేదు.. కానీ జాగ్రత్తగా ఉండాలి..