AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: ఈ ఐదు లక్షణాలు కలిసిన స్త్రీ ఏ వ్యక్తి జీవితంలో ఉంటే ఆ వ్యక్తి అదృష్టవంతుడే అంటున్న చాణక్య..

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు.. తక్షశిలలో అధ్యాపకుడిగా పని చేశాడు. అంతేకాదు చంద్రగుప్త మౌర్యుడిని రాజుకి మంత్రిగా పనిచేశాడు. ఆచార్య చాణక్యుడు రచించిన..

Chanakya Niti: ఈ ఐదు లక్షణాలు కలిసిన స్త్రీ ఏ వ్యక్తి జీవితంలో ఉంటే ఆ వ్యక్తి అదృష్టవంతుడే అంటున్న చాణక్య..
Acharya Chanakya
Surya Kala
|

Updated on: Jan 04, 2022 | 10:21 AM

Share

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు.. తక్షశిలలో అధ్యాపకుడిగా పని చేశాడు. అంతేకాదు చంద్రగుప్త మౌర్యుడిని రాజుకి మంత్రిగా పనిచేశాడు. ఆచార్య చాణక్యుడు రచించిన నీతి శాస్త్రంలో మానవ జీవితంలోని ప్రతి అంశాన్ని ప్రస్తావించాడు. గొప్ప వ్యూహకర్త ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో తెలిపిన విషయాలను నేటి జనరేషన్ కు సరిగ్గా సరిపోతాయి. అలా చాణుక్యుడు చెప్పిన విషయాల్లో ఒకటి స్త్రీ గురించి.. ప్రత్యేక వ్యక్తిత్వం లక్షణాలు కలిగిన స్త్రీ ని పొందిన వ్యక్తి అదృష్టవంతుడిని చేస్తోంది. ఈ స్త్రీ తల్లి, సోదరి, స్నేహితురాలు, భార్య  ఇలా ఏ రూపంలోనైనా వ్యక్తి జీవితంలో ఉంటుంది. ఆ గుణాలు ఏమిటో తెలుసుకుందాం

తన ధర్మాన్ని ఆచరించే స్త్రీ ఏ వ్యక్తి జీవితంలో నైనా ధర్మాన్ని ఆచరించే స్వభావం ఉన్న స్త్రీ ఉంటే, అతని విధి మారుతుంది.  సనాతన ధర్మాన్ని పాటించే స్త్రీలు ప్రతిరోజూ పూజలు చేస్తారు. స్త్రీలు ప్రతిరోజూ పూజించే ఇళ్లలో దేవుడు కొలువై ఉంటాడు. అటువంటి స్త్రీలు మనిషి జీవితంలోని ప్రతి సమస్య తొలగిపోతుంది.

సంతృప్తి చెందిన స్త్రీ తన భావాలను నియంత్రించుకుంటూ.. సంతృప్తిగా ఉండే స్త్రీ.. మంచి, చెడు ఇలా ఏ పరిస్థితులోనైనా  తన భాగస్వామికి మద్దతు ఇస్తుంది. అలాంటి మహిళలు తమ భాగస్వామికి ఎటువంటి కష్టం ఎదురైనా తోడుగా నిలబడుతుంది.

సహనం గల స్త్రీ తమ జీవితంలో ఎటువంటి కష్ట, నష్టాలు ఏర్పడినా.. ఏ సమయసందర్భంలోనైనా సహనం పాటించే స్త్రీలు జీవితంలో ఎప్పుడూ విఫలం కారు. ఓర్పు, సహనం కలిగిన స్త్రీ ఉన్న వ్యక్తి ఎప్పుడు విజయాన్ని సొంతం చేసుకుంటాడు.

ప్రశాంతంగా ఉండే స్త్రీ కోపం మనిషికి శత్రువు అని అంటారు. కనుక ప్రశాంతంగా ఉండే స్త్రీ.. ఇంటిని అన్ని విధాలా సంరక్షిస్తుంది. శాంతి ఉన్న ఇళ్లలో దేవుడు ఉంటాడు. అలాంటి ఇళ్లలో పెద్ద అడ్డంకులు ఏర్పడవు కూడా..

మధురంగా ​​మాట్లాడే స్త్రీ మధురమైన మాటలు మాట్లాడే స్త్రీ.. ఏ వ్యక్తి జీవితంలో ఉంటె.. ఆ వ్యక్తిని అదృష్టం వరిస్తుంది.  ఎటువంటి పరిస్థితి ఏర్పడినా ఆ వ్యక్తికీ మద్దతుగా ఆ స్త్రీ నిలుస్తుంది. ఇలాంటి మహిళలు తమ ఇంటి వాతావరణాన్ని ఎల్లప్పుడూ ఆహ్లాదకరంగా ఉంచుతారని.. అందరూ సంతోషంగా ఉంటారని  చాణుక్యుడు చెప్పారు.

అయితే ఈ విషయాలు నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. ఎటువంటి శాస్త్రీయ కోణం ఆధారంగా కాదు.

Also Read:

కోరిన కోర్కెలు తీర్చే అత్యంత మంత్రం శక్తి కలిగిన ఆంజనేయ స్వామి దండకం..