AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hanuman Chalisa: శనిప్రభావాన్ని నివారించే హనుమాన్ చాలీసా.. రోజుకు ఎన్నిసార్లు, ఎక్కడ పఠించాలంటే..

Hanuman Chalisa: హనుమంతుడి ఆరాధన వలన కార్యసిద్ధి కలుగుతుందనీ, అనారోగ్యాలు దూరమవుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. హిందూ మతంలో..

Hanuman Chalisa: శనిప్రభావాన్ని నివారించే హనుమాన్ చాలీసా.. రోజుకు ఎన్నిసార్లు, ఎక్కడ పఠించాలంటే..
Hanuman Chalisa
Surya Kala
|

Updated on: Jan 04, 2022 | 12:06 PM

Share

Hanuman Chalisa: హనుమంతుడి ఆరాధన వలన కార్యసిద్ధి కలుగుతుందనీ, అనారోగ్యాలు దూరమవుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. హిందూ మతంలో హనుమాన్ చాలీసాకి ప్రత్యేక స్థానం ఉంది. రామునికి పరామభక్తుడైన తులసీదాసు అవధి భాషలో రాసిన హనుమాన్ చాలీసా చాలా ప్రసిద్ధి పొందింది. “చాలీసా” అంటే హిందీ లో చాలీస్ .. తెలుగు నలభై అని అర్ధం. హనూమన్ చాలీసాలో నలభై శ్లోకాలు ద్విపదులుగా ఉంటాయి. హనుమాన్ చాలీసా పఠనం వల్ల, హనుమంతుడ్ని మెప్పించి ఆయన దీవెనలు పొందవచ్చని అంటారు. హనుమాన్ చాలీసా చదవటం వల్ల శనిప్రభావం కూడా పోతుంది. అయితే హనుమాన్ చాలీసా చదవటానికి ఒక సమయం, పద్ధతి ఉంది. ప్రతి మంగళవారం, శనివారాల్లో దేవాలయంలో గానీ, పూజా మందిరం దగ్గర గాని కూర్చుని ‘హనుమాన్ చాలీసా’ను 11 మార్లు పారాయణ చేయవలసి ఉంటుంది. భక్తి శ్రద్ధలతో ఈ విధంగా చేయడం వలన, హనుమ అనుగ్రహంతో మనసులోని కోరికలు నెరవేరతాయి. హనుమాన్ చాలీసాలోని ప్రతి శ్లోకానికి ప్రత్యేక అర్థం ఉంది. హనుమాన్ చాలీసా పఠనం చేసే వ్యక్తిపై అద్భుత ప్రభావం ఉందని విశ్వాసం.

హనుమాన్ చాలీసా దోహా: శ్రీగురు చరన సరోజ రజ నిజ మను ముకుర సుధార । బరణౌం రఘువర విమల యశ జో దాయకు ఫలచార ॥ బుద్ధిహీన తను జానికే సుమిరౌం పవనకుమార । బల బుద్ధి విద్యా దేహు మోహిఁ హరహు కలేస వికార ॥

జయ హనుమాన జ్ఞాన గుణ సాగర । జయ కపీశ తిహుం లోక ఉజాగర ॥1॥ రామ దూత అతులిత బల ధామా । అంజనిపుత్ర పవనసుత నామా ॥2॥ మహావీర విక్రమ బజరంగీ । కుమతి నివార సుమతి కే సంగీ ॥3॥ కంచన బరన విరాజ సువేసా । కానన కుండల కుంచిత కేశా ॥4॥ హాథ వజ్ర ఔ ధ్వజా విరాజై । కాంధే మూంజ జనేఊ సాజై ॥5॥ సంకర సువన కేసరీనందన । తేజ ప్రతాప మహా జగ వందన ॥6॥ విద్యావాన గుణీ అతిచాతుర । రామ కాజ కరిబే కో ఆతుర ॥7॥ ప్రభు చరిత్ర సునిబే కో రసియా । రామ లఖన సీతా మన బసియా ॥8॥ సూక్ష్మ రూప ధరి సియహిఁ దిఖావా । వికట రూప ధరి లంక జరావా ॥9॥ భీమ రూప ధరి అసుర సంహారే । రామచంద్ర కే కాజ సంవారే ॥10॥ లాయ సజీవన లఖన జియాయే । శ్రీరఘువీర హరషి ఉర లాయే ॥11॥ రఘుపతి కీన్హీ బహుత బడాయీ । తుమ మమ ప్రియ భరత సమ భాయీ ॥12॥ సహస వదన తుమ్హరో యస గావైఁ । అస కహి శ్రీపతి కంఠ లగావైఁ ॥13॥ సనకాదిక బ్రహ్మాది మునీశా । నారద శారద సహిత అహీశా ॥14॥ యమ కుబేర దిక్పాల జహాం తే । కవి కోవిద కహి సకే కహాం తే ॥15॥ తుమ ఉపకార సుగ్రీవహిం కీన్హా । రామ మిలాయ రాజ పద దీన్హా ॥16॥ తుమ్హరో మంత్ర విభీషన మానా । లంకేశ్వర భయే సబ జగ జానా॥17॥ యుగ సహస్ర యోజన పర భానూ । లీల్యో తాహి మధుర ఫల జానూ ॥18॥ ప్రభు ముద్రికా మేలి ముఖ మాహీఁ । జలధి లాంఘి గయే అచరజ నాహీఁ ॥19॥ దుర్గమ కాజ జగత కే జేతే । సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే ॥20॥ రామ దుఆరే తుమ రఖవారే । హోత న ఆజ్ఞా బిను పైసారే ॥21॥ సబ సుఖ లహై తుమ్హారీ సరనా । తుమ రక్షక కాహూ కో డర నా ॥22॥ ఆపన తేజ సంహారో ఆపై । తీనోఁ లోక హాంక తేఁ కాంపై ॥23॥ భూత పిశాచ నికట నహిఁ ఆవై । మహావీర జబ నామ సునావై ॥24॥ నాశై రోగ హరై సబ పీరా । జపత నిరంతర హనుమత వీరా ॥25॥ సంకటసే హనుమాన ఛుడావై । మన క్రమ వచన ధ్యాన జో లావై ॥26॥ సబ పర రామ తపస్వీ రాజా । తిన కే కాజ సకల తుమ సాజా ॥27॥ ఔర మనోరథ జో కోయీ లావై । తాసు అమిత జీవన ఫల పావై ॥28॥ చారోఁ యుగ ప్రతాప తుమ్హారా । హై ప్రసిద్ధ జగత ఉజియారా ॥29॥ సాధు సంత కే తుమ రఖవారే । అసుర నికందన రామ దులారే ॥30॥ అష్ట సిద్ధి నవ నిధి కే దాతా । అస బర దీన జానకీ మాతా ॥31॥ రామ రసాయన తుమ్హరే పాసా । సదా రహో రఘుపతి కే దాసా ॥32॥ తుమ్హరే భజన రామ కో పావై । జన్మ జన్మ కే దుఖ బిసరావై ॥33॥ అంత కాల రఘుపతి పుర జాయీ । జహాఁ జన్మి హరిభక్త కహాయీ ॥34॥ ఔర దేవతా చిత్త న ధరయీ । హనుమత సేయి సర్వ సుఖ కరయీ ॥35॥ సంకట కటై మిటై సబ పీరా । జో సుమిరై హనుమత బలవీరా ॥36॥ జై జై జై హనుమాన గోసాయీఁ । కృపా కరహు గురు దేవ కీ నాయీఁ ॥37॥ యహ శత బార పాఠ కర కోయీ । ఛూటహి బంది మహా సుఖ హోయీ ॥38॥ జో యహ పఢై హనుమాన చలీసా । హోయ సిద్ధి సాఖీ గౌరీసా ॥39॥ తులసీదాస సదా హరి చేరా । కీజై నాథ హృదయ మహ డేరా ॥40॥ దోహా- ॥ పవనతనయ సంకట హరణ । మంగల మూరతి రూప ॥ రామ లఖన సీతా సహిత । హృదయ బసహు సుర భూప ॥

Also Read: ఈ ఐదు లక్షణాలు కలిసిన స్త్రీ ఏ వ్యక్తి జీవితంలో ఉంటే ఆ వ్యక్తి అదృష్టవంతుడే అంటున్న చాణక్య..