Watch Video: కజకిస్థాన్ విమాన ప్రమాదానికి ముందు.. తరువాత.. క్యాబిన్ పరిస్థితి చూస్తే షాక్ అవ్వాల్సిందే!
అజర్‌బైజాన్‌కు చెందిన విమానం బుధవారం కజకిస్థాన్‌లోని అక్టౌ సమీపంలో కూలిపోయింది. ఈ ప్రమాదం తర్వాత, విమానం కూలిపోవడానికి కొన్ని సెకన్ల ముందుకు సంబంధించిన వీడియో బయటపడింది. ఈ వీడియోలో భయాందోళనలో ఉన్న ప్రయాణీకులు ప్రార్థనలు చేస్తూ కనిపించారు. ఈ ప్రమాదంలో ఈ వీడియో తీసిన వ్యక్తి గాయపడి ప్రాణాలతో బయటపడ్డాడు.
కజకిస్తాన్‌లో కూలిపోయిన విమానం క్యాబిన్ లోపల జరిగిన ఘటనకు సంబంధించి ఒక వీడియో బయటపడింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విమానంలో కూర్చున్న ఓ ప్రయాణికుడు తీసిన సంచలనంగా మారింది. ఆ బాధాకరమైన వీడియోను సదరు ప్రయాణికుడు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇందులో విమానం చివరి క్షణాలను చూపించారు. కాస్పియన్ సముద్రం తూర్పు తీరంలో చమురు, గ్యాస్ హబ్ అయిన అక్టౌ సమీపంలో కుప్పకూలిన విమానం ఇదే. ఇందులో 38 మంది చనిపోయారు.
ముందుగా వీడియో చూడండి..
The final moments of the Azerbaijan Airlines plane before its crash in Kazakhstan were captured by a passenger onboard.
Aftermath also included in the footage. pic.twitter.com/nCRozjdoUY
— Clash Report (@clashreport) December 25, 2024
వీడియోలో విమానం ఏటవాలుపైకి వెళుతున్నప్పుడు ప్రయాణీకుడు “అల్లాహు అక్బర్” అంటూ దేవుడిని వేడుకున్నారు. పసుపు ఆక్సిజన్ మాస్క్‌లు సీట్లకు వేలాడుతూ కనిపించాయి. ‘వేర్ యువర్ సీట్‌బెల్ట్’ గట్టిగా డోర్‌బెల్ లాంటి శబ్దం మధ్య అరుపులు, ఏడుపులు వినిపించాయి. క్యాబిన్ లోపల తీసిన మరో వీడియో కూడా ప్రస్తుతం వైరల్ అవుతోంది. రీడింగ్ లైట్, ఎయిర్ బ్లోవర్ తలక్రిందులుగా ఉన్న ఎయిర్‌క్రాఫ్ట్ రూఫ్ ప్యానెల్. ప్రయాణికులు సహాయం కోసం అరుస్తున్న అర్తనాదాలు వినిపించాయి. విమానం కూలిపోయిన తర్వాత వీడియో ఉన్నట్లు తెలుస్తోంది.
బుధవారం(డిసెంబర్ 25) రోజున కుప్పకూలిన విమానం కాస్పియన్ పశ్చిమ తీరంలోని అజర్‌బైజాన్ రాజధాని బాకు నుండి దక్షిణ రష్యాలోని చెచ్న్యాలోని గ్రోజ్నీ నగరానికి వెళ్తోంది. ఆ దేశానికి చెందిన ఫ్లాగ్ క్యారియర్ అజర్‌బైజాన్ ఎయిర్‌లైన్స్ ఈ ఘటనపై స్పందించారు. అక్టౌ నుండి 3 కి.మీ దూరంలో విమానం అత్యవసర ల్యాండింగ్ చేసింది. 62 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బందితో ఉన్న విమానం అత్యవసర ల్యాండింగ్ చేయవలసి వచ్చింది. 32 మందిని అధికారులు రక్షించారు. 38 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అజర్‌బైజాన్ ఎయిర్‌లైన్స్ ప్రకటించింది.
రాజధాని బాకు నుంచి రష్యాలోని గ్రోంజీకి వెళ్తున్న ఎంబ్రేయర్ 190 ప్యాసింజర్ విమానం ప్రమాదంలో మరణించిన వారికి గౌరవ సూచకంగా అజర్‌బైజాన్ గురువారం జాతీయ సంతాపం ప్రకటించింది. అజర్‌బైజాన్ అధ్యక్షుడు ఇల్హామ్ అలియేవ్ బుధవారం ఈ దుర్ఘటన తర్వాత ఒక రోజు సంతాప దినం పాటించాలని అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. సెయింట్ పీటర్స్‌బర్గ్‌కు వెళ్లే మార్గంలో రష్యా గగనతలంలో ఉన్నప్పుడు అలియేవ్ కూలిపోయిన వార్తను అందుకున్నారు. అతను అక్కడ ఒక శిఖరాగ్ర సమావేశానికి వెళ్తున్నారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అతను తన ప్రయాణాన్ని రద్దు చేసుకుని స్వదేశానికి తిరిగి వచ్చేశారు.
కజకిస్థాన్‌లోని అత్యవసర పరిస్థితుల మంత్రిత్వ శాఖ (MES) 28 మంది ప్రాణాలతో బయటపడినట్లు తెలిపింది. జిన్హువా వార్తా సంస్థ నివేదిక ప్రకారం, అజర్‌బైజాన్ ఎయిర్‌లైన్స్ తెలిపిన వివరాల ప్రకారం, విమానంలో 62 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బందితో సహా 67 మంది ఉన్నారు. విమానంలోని ప్రయాణికుల్లో అజర్‌బైజాన్‌కు చెందిన 37 మంది, రష్యాకు చెందిన 16 మంది, కజకిస్థాన్‌కు చెందిన ఆరుగురు, కిర్గిస్థాన్‌కు చెందిన ముగ్గురు పౌరులు ఉన్నారని కజకిస్తాన్ మీడియా తెలిపింది. విమానాన్ని పక్షి ఢీకొనడమే ఈ విషాదానికి ప్రధాన కారణమని చెబుతున్నారు. MES విమానంలో మంటలు చెలరేగిన ప్రదేశానికి 52 మంది సిబ్బంది, 11 యూనిట్ల పరికరాలను పంపించారు. ఎంబ్రేయర్ 190 ఎయిర్‌క్రాఫ్ట్ క్యాబిన్ కాన్ఫిగరేషన్‌ను బట్టి 96 నుండి 114 మంది ప్రయాణికులను తీసుకెళ్లే సామర్థ్యం ఉంటుంది. ఈ విమానం 4,500 కి.మీ. FlightAware ప్రకారం, విమానం బాకు నుండి షెడ్యూల్ కంటే 11 నిమిషాల ముందు బయలుదేరింది. ఇది కాస్పియన్ సముద్రం మీదుగా ఎగురుతున్నప్పుడు అత్యవసర సంకేతాన్ని జారీ చేసింది.
పొగమంచు కారణంగా విమానాన్ని గ్రోజ్నీలో ల్యాండ్ చేయడానికి అనుమతించలేదని అజర్బైజాన్ మీడియా పేర్కొంది. ఈ కారణంగా అది మఖచ్కాలాకు మళ్లించారు. ఆ తరువాత అక్టౌకు మళ్లించారు. ఆన్‌లైన్ ఫ్లైట్ ట్రాకింగ్ యాప్‌లు విమానం కాస్పియన్ సముద్రం మీదుగా ఎగురుతున్నట్లు చ్న్యాలో దాని గమ్యస్థానం వైపు వెళుతున్నట్లు చూపించాయి. విమానం రష్యా ప్రాదేశిక పరిమితుల్లోకి ప్రవేశించిన వెంటనే విమానాశ్రయం సమీపంలో చక్కర్లు కొట్టడం ప్రారంభించింది. ఆ తర్వాత స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 6.28 గంటలకు ఎయిర్‌పోర్టుకు కొన్ని కిలోమీటర్ల దూరంలో విమానం కూలిపోయింది.