Maha Kumbha Mela: మహా కుంభ మేళాలో చివరి రాజ స్నానం తేదీ..? శివయ్య అనుగ్రహం కోసం చేయాల్సిన దానాలు ఏమిటంటే
మహా కుంభ మేళా జాతరకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. జనవరి 13వ తేదీ 2025న ప్రయాగ్ రాజ్ లో మహా కుంభ మేళా ప్రారంభమై.. 45రోజుల పాటు జరగనుంది. అయితే మహా కుంభ మేళా సమయంలో రాజ స్నానానికి విశిష్ట స్థానం ఉంది. ఈ కుంభ మేళా సమయంలో చేసే రాజ స్నానాలలో ఒకటి మహాశివరాత్రి రోజున అంటే ఫిబ్రవరి 26న జరుపుకుంటారు. కుంభ మేళా సమయంలో ఋషులు, సాధువులు, భక్తులు త్రివేణీ సంగమ ప్రాంతంలో ఆరవ, చివరి రాజ స్నానం చేస్తారు. ఈ రోజున స్నానం చేయడానికి శుభ సమయం, శివయ్య ఆశీర్వాదం కోసం స్నానంతో పాటు చేయాల్సిన ఇతర పనుల గురించి తెలుసుకుందాం..
మహా కుంభ మేళా హిందువుల అతిపెద్ద మతపరమైన సమావేశ కార్యక్రమం. ఉజ్జయిని, నాసిక్, హరిద్వార్, ప్రయాగ్‌రాజ్‌లలో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఈ మతపరమైన సమావేశం నిర్వహించబడుతుంది. తీర్థయాత్రలకు రారాజుగా పిలువబడే ప్రయాగ్‌రాజ్‌లో ఈసారి జనవరి 13 నుంచి మహా కుంభ మేళాను నిర్వహించనున్నారు. ఈ మహా కుంభ మేళా ఫిబ్రవరి 26 వరకు కొనసాగుతుంది.
ఈ మహా కుంభ మేళాలో ఆరు రాజ స్నానాలు చేయనున్నారు. జనవరి 13న పుష్య మాసం పౌర్ణమి రాజ స్నానాలు ప్రారంభమవుతాయి. పుష్య మాసం పౌర్ణమి నుంచి ప్రారంభమైన రాజస్నానాలు మహా శివరాత్రికి ముగుస్తాయి. అంతేకాదు రాజ స్నానాల తో పాటు 45 రోజుల పాటు సాగిన ఈ మహా కుంభ మేళా కూడా ఈ రోజుతో ముగుస్తుంది. మహా కుంభ మేళాలోని ఆరవ రోజు అంటే మహాశివరాత్రి రోజున చేసే రాజ స్నానం తేదీ ఏమిటి? ఈ రోజున స్నానం చేయడానికి అనుకూలమైన సమయం ఏది? శివుని ఆశీస్సులు పొందడానికి స్నానంతో పాటు చేయాల్సిన ఇతర పనులు ఏమిటి తెలుసుకుందాం..
మహా శివరాత్రి స్నానానికి అనుకూలమైన సమయం
వచ్చే ఏడాది ఫిబ్రవరి 26న మహాశివరాత్రి జరుపుకోనున్నారు. మహా కుంభ మేళాలో ఋషులు, సాధువులు, భక్తులు మహా కుంభ మేళాలో ఆరవ, చివరి రాజ స్నానం చేస్తారు. మహాశివరాత్రి రోజున చేసే రాజ స్నానం బ్రహ్మ ముహూర్తం సాయంత్రం 5.09 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ శుభ సమయం సాయంత్రం 5:59 గంటలకు ముగుస్తుంది. ఈ రోజు స్నానంతో పాటు మహాదేవుని పూజించే సంప్రదాయం కూడా ఉంది. అంతే కాదు ఈ దానం చేయడం కూడా చాలా పుణ్య ప్రదంగా పరిగణించబడుతుంది.
మహాశివరాత్రి ప్రాముఖ్యత
హిందూ మతంలో మహాశివరాత్రికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పండుగను అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. మహాశివరాత్రి కూడా శివ పార్వతుల కల్యాణానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. హిందూ మతంలో మహాశివరాత్రి రోజున శివునికి చేసే జలాభిషేకం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఎవరైతే ఈ రోజున శివునికి జలాభిషేకం, పూజలు, ఉపవాసం మొదలైనవాటిని చేస్తారో వారి పట్ల భగవంతుడు ప్రసన్నుడై ప్రత్యేక అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు.
చేయాల్సిన దానాలు
మహాశివరాత్రి రోజున స్నానం చేయడమే కాదు.. చేసే దానాలకు కూడా ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున తప్పనిసరిగా గోధుమలు, బియ్యం, పచ్చి పాలు, నెయ్యి, నల్ల నువ్వులు, బట్టలు అవసరం ఉన్నవారికి దానం చేయాలి. ఇలా చేయడం వల్ల భగవంతుడు శివుడు సంతోషిస్తాడు. ఆశీర్వదిస్తాడు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.