Vastu Tips: మానసిన ఒత్తిడి లేకుండా ఉండాలంటే వంట ఇంట్లో ఉప్పుని ఇలా ఉపయోగించాలంటున్న జ్యోతిష్యశాస్త్రం..

Vastu Tips: జీవితంలో ఆనందం, సంతోషం ఉండాలంటే మానసికంగా ఒత్తిడి ఉండకూడదు.  అంతేకాదు కొన్ని కొన్ని సార్లు.. ఎంత ప్రయత్నించినా కోరుకున్నది లభించదు. దీనికి కారణం..

Vastu Tips: మానసిన ఒత్తిడి లేకుండా ఉండాలంటే వంట ఇంట్లో ఉప్పుని ఇలా ఉపయోగించాలంటున్న జ్యోతిష్యశాస్త్రం..
Vastu Tips
Follow us
Surya Kala

|

Updated on: Jan 04, 2022 | 5:07 PM

Vastu Tips: జీవితంలో ఆనందంగా ఉండాలంటే మానసికంగా ఒత్తిడి ఉండకూడదు.  అంతేకాదు కొన్ని కొన్ని సార్లు.. ఎంత ప్రయత్నించినా కోరుకున్నది లభించదు. దీనికి కారణం పరిస్థితులే కాదు, వాస్తు దోషాలు కూడా ఉండవచ్చు. అందుకనే ఇంటిని వాస్తు ప్రకారం అలంకరించుకోవాలి. బెడ్ రూమ్, కిచన్, హాల్ ఇలా ప్రతి గదిని వాస్తుకు అనుగుణంగా అలంకరించుకోవాలని జ్యోతిష్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వంటగదిలో వాస్తు దోషం ఉంటే చాలా కాలం పాటు సమస్యలు మనల్ని ఇబ్బంది పెడతాయి. అందుకనే వంటగదికి కొన్ని వాస్తు నియమాలు సూచించారు. ఆ నియమాలను పాటించక పోతే చాలా సమస్యలు వస్తాయి. వీటిలో ఒకటి ఉప్పు . దీనిని వాస్తు ప్రకారం ఉంచడం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. వంటగదిలో ఉప్పుకి సంబంధించిన వాస్తు దోషాలు, నమ్మకాలను గురించి ఈరోజు తెలుసుకుందాం..

వంట చేసే సమయంలో ఆహారంలో ఉప్పు  వేసే సమయంలో కొన్ని సార్లు నేలపై పడుతుంది.  వాస్తు , జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉప్పు ఇలా నేలపై పడటం శ్రేయస్కరం కాదు. ఉప్పు శుక్రుడు , చంద్రునికి సంబంధించినదని జ్యోతిష్యులు చెబుతారు. వాస్తు నియమాల ప్రకారం..  ఉప్పు నెల మీద పడితే రెండు గ్రహాలకు సంబంధించిన అశుభ ఫలితాలు ఇబ్బంది పెడతాయి.

ఉప్పు- నమ్మకం:  1.  ఉప్పును అపరిశ్రమైన చేతులతో ఎప్పుడూ తాకవద్దు. ఇలా చేయడం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలు ఏర్పడతాయి.

2. పొరపాటున ఉప్పు నేలపై పడితే.. ఆ ఉప్పును పాదాలతో తాకవద్దు.. పొరపాటున కూడా పాదాలతో శుభ్రం చేయవద్దు.  ఇది అశుభాన్ని కలిస్తుందట.

3. వారానికి ఒకసారైనా ఇంటి మూలల్లో ఉప్పును చల్లుతారు. ఇలా చేయడం వలనస్ నెగెటివ్ ఎనర్జీ తొలగిపోయి ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని నమ్మకం.

4. హిందూ మతానికి సంబంధించిన నమ్మకం ప్రకారం, ఉప్పును ఎప్పుడూ అప్పు గా తీసుకోరు. ఇవ్వరు. అంతేకాదు ఉప్పుని ఎప్పుడు అప్పు పెట్టి కొనుగోలు చేయకూడదు. ఒకవేళ మీరు దుకాణదారు అయితే ఉప్పును అప్పుగా ఇవ్వకండి. అలా చేయడం అశుభం అని  భావిస్తారు.

Also Read:

 శనిప్రభావాన్ని నివారించే హనుమాన్ చాలీసా.. రోజుకు ఎన్నిసార్లు, ఎక్కడ పఠించాలంటే..

ఈ ఐదు లక్షణాలు కలిసిన స్త్రీ ఏ వ్యక్తి జీవితంలో ఉంటే ఆ వ్యక్తి అదృష్టవంతుడే అంటున్న చాణక్య..